Vitamin D Deficiency: విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి ముఖ్యమైనది. వాస్తవానికి, ఎముకలలో కాల్షియం గ్రహించడానికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలు కాల్షియంను గ్రహించలేవు. అంతే కాకుండా విటిమిన్ డి తగ్గితే..ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి.
దీంతో పాటు, శరీరంలో విటమిన్ డి లోపం మానసిక కల్లోలం, జుట్టు రాలడం వంటి అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే 7 ప్రధాన నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు బలహీనపడటం: విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అంతే కాకుండా బోలు ఎముకల వంటి వ్యాధులకు దారితీయవచ్చు.
కండరాల నొప్పి, బలహీనత: విటమిన్ డి లోపం వల్ల కండరాలలో నొప్పి కలుగుతుంది. అంతే కాకుండా ఎముకల బలహీనత కూడా ఏర్పడుతుంది.
అలసట, బలహీనత: విటమిన్ డి లోపం నిరంతరం అలసట, బలహీనతకు కారణమవుతుంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: విటమిన్ డి లోపం కారణంగా, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఇది మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది.
మూడ్ స్వింగ్స్: విటమిన్ డి లోపం డిప్రెషన్ , మూడ్ స్వింగ్‌లకు దారితీస్తుంది.
జుట్టు రాలడం: విటమిన్ డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.
దంత సమస్యలు: విటమిన్ డి లోపం వల్ల దంతాలు బలహీనపడటం లేదా విరగడం వంటి దంత సమస్యలకు కారణం కావచ్చు.
విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి ?
సూర్యకాంతి: రోజుకు 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం ద్వారా విటమిన్ డి అందుతుంది.
ఆహారం: చేపలు, గుడ్లు, పాలు, చీజ్,పుట్టగొడుగులు మొదలైన వాటిలో విటమిన్ డి లభిస్తుంది.
సప్లిమెంట్స్: డాక్టర్ సలహా మేరకు మీరు విటమిన్ డి మాత్రలు లేదా క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు.