trinayani serial today Episode: ఇలా చీరలు తీసుకురాకుండా ఉండమని చెప్పు అంటాడు వల్లభ. సరే వదిలేయండి రేపు ఇల్లంతా శుభ్రం చేయించాలి కదా..? అత్తయ్యా రేపు ఉదయం తాళాలు నయనికి ఇవ్వండి అని విశాల్ చెప్పగానే తాళాలా..? అంటూ షాక్ అవుతుంది దురందర. ఆ ఇస్తాంలే అల్లుడు అంటూ పావణమూర్తి వెళ్దాం పద బంగారం లాంటి నిద్ర చెడిపోయింది అంటూ లోపలికి వెళ్తాడు.
రూంలో సుమన అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంటే.. విక్రాంత్ వచ్చి అంతలా తిన్నావా అటూ ఇటూ తిరుగుతున్నావు అని అడగ్గానే అరగక తిరగడ లేదు. ఆలోచిస్తూ తిరుగుతున్నాను అని చెప్పగానే దేని గురించో అని అడుగుతాడు విక్రాంత్. పావణమూర్తి బాబయ్, దురందర పిన్ని గురించి అని చెప్పగానే ఇన్నాళ్లకు మంచి బుద్ది వచ్చింది నీకు అంటాడు విక్రాంత్. అదేం లేదు ఇదేదో వాళ్ల సొంత ఇల్లు అయినట్టు ఆ రూంకు ఎప్పుడూ తాళం వేస్తారు ఎందుకు అని అడుగుతుంది సుమన. అదా అత్తయ్య కడుపుతో ఉంది కాబట్టి ఏదైనా తినాలపించి తింటుంది. అలాగే మామయ్యకు సాయంత్రం కాగానే రెండు గ్లాసులు కాలీ చేయడం అలవాటు అందుకే తాళం వేసుకుంటారు అని చెప్పి వెళ్లిపోతాడు విక్రాంత్.
వల్లభ కంగారుగా తిలొత్తమ్మ దగ్గరకు వచ్చి మమ్మీ దురందర అత్తయ్య వాళ్ల గది తలుపు దగ్గర చెవి పెట్టి వింటే ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి అని చెప్తాడు. దీంతో అవునా పావనమూర్తితో కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడుతుందేమోనని అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన నయని మీ దుర్బుద్ది గురించి తెలిస్తే మామయ్య మీకు తగిన బుద్ది చెప్తాడు అంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నయని అని తిలొత్తమ్మ అడగ్గానే మీకు రెండు విషయాల్లో బుద్ది చెప్పాలని వచ్చాము అని నయని చెప్తుంది. ఏంటవి అని అడగ్గానే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నానో నేను ఏ చెక్కులు ఎక్కడ ఇస్తున్నానో అంటూ తెలుసుకోవడం మానేస్తే బాగుంటుంది లేదంటే మీకు బుద్ది చెప్పాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది నయని.
హాల్లో ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంటుంది దురందర. పావణమూర్తి పిల్లల కేసి చూడవే కడుపుతో ఉన్నప్పుడు పిల్లలను చూస్తే నీ కడుపులో పెరిగే బిడ్డకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తాడు. ఇంతలో హాసిని వచ్చి చిట్టి నీ బిడ్డ ఎక్కడ అని అడిగావు కదా..? ఇక్కడే ఉంది కదా.. అని చెప్పగానే సుమన వచ్చి తన బిడ్డను ఎత్తుకుని ఏవి పడితే అవి పిల్లలకు తినిపించకు అక్కా అంటూ తిడుతుంది సుమన. విశాల్ వచ్చి ఏమైంది సుమన ఉదయాన్నే పంచాయతి పెడుతున్నావు ఎందుకు అని అడిగితే ఎవరైనా న్యాయం చెప్పకపోతారా అని సుమన అనగానే సమస్య ఏంటని తిలొత్తమ్మ అడగ్గానే.. న్యూఇయర్ వస్తుందని పావనమూర్తి బాబాయ్ వాళ్లకు కూడా చెరో లక్ష ఇచ్చారు. నాకు మాత్రం పట్టుమని పది రూపాయలు కూడా ఇవ్వలేదు.
ఇప్పుడేమో లేని ప్రేమలు నటిస్తున్నారు అనగానే నీకు ఇవ్వను అన్నానా..? అంటుంది నయని. కావాలంటే మాకు ఇచ్చిన రెండు లక్షలు నువ్వే తీసుకో అంటాడు పావణమూర్తి. విక్రాంత్ మాత్రం వదిన రూపాయి కూడా ఇవ్వకండి అని చెప్తాడు. ఇంతలో పోస్ట్ వస్తుంది. కవర్ ఓపెన్ చేసి తిలొత్తమ్మ చూస్తుంది. ఇది ఇన్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిందని చెప్తుంది. సుమనకు ఎందుకు వస్తుందని అందరూ అడుగుతారు. ఎవరైనా పోతారేమోనని ఇన్సూరెన్స్ చేయించి ఉంటారని తిలొత్తమ్మ ఎవరు చేయించి ఉంటారని వల్లభ అడగ్గానే నయని పోతుందని చేసింది అసలు విషయం అది కాదు నీ చెల్లెలు కూతురు ఉలూచికి రావాలని తన పేరు రాయించావు కదా..? అని తిలొత్తమ్మ చెప్పగానే అందరూ షాక్ అవుతారు.
ఇప్పటికైనా అర్థం అయిందా..? వదిన ఎంత మంచిది అని విక్రాంత్ అనగానే చేసింది కానీ మా అక్క పోతేనే కదా..? పాతిక కోట్లు వచ్చేది అంటూ మాట్లాడుతుంది సుమన. దీంతో సుమనను విక్రాంత్ తిడతాడు. వదిన ప్రాణాలతో ఉండగానే ఈ రాక్షసి ఇలా మాట్లాడుతుందేంటి అంటాడు. దీంతో నయని ఎక్కడ ఉందిరా అని తిలొత్తమ్మ అడుగుతుంది. విశాల్ కోపంగా తిలొత్తమ్మను తిడతాడు. నన్ను కాదు తిట్టాల్సింది నయని కోమాలో ఉందని ఇన్సూరెన్స్ కంపెనీకి నిన్న ఉదయం ఫ్యాక్స్ చేసింది విక్రాంత్ అని తిలొత్తమ్మ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అలా చేశావు విక్కి అని దురందర అడుగుతుంది. విక్రాంత్ నయని నిక్షేపంగా ఉండగానే అలా ఎలా రాస్తావురా నువ్వు అంటూ విశాల్ ప్రశ్నించగానే ఐయామ్ సారీ బ్రో అంటాడు విక్రాంత్‌ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?