E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను మానసికంగా భయపెడుతున్న చంభా, మనోహరి

Nindu Noorella Saavasam Serial Today December 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను మానసికంగా భయపెడుతున్న చంభా, మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మిస్సమ్మ రూంలో ఒంటరిగా కూర్చుని పంతులు చెప్పింది ఆలోచిస్తూ భయపడుతుంది. వేరే ఎవరైన స్వామిని అడగాలని అనుకుంటుంది. ఇంతలో బయట హాల్లో ఉన్న పాపను ఎత్తుకున్న మనోహరి అరుందతి అని పిలుస్తుంది. ఆ పాప కూడా మనోహరి అంటుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. పాపను ఎత్తుకుని ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి ఒసేయ్‌ అరుందతి నువ్వు మళ్లీ పుట్టావా..? ఈ బిడ్డలో ప్రవేశించావా..? ఒకసారి నా చేతిలో చచ్చావు కదే మళ్లీ మళ్లీ నా చేతిలో ఎందుకు చావాలి అనుకుంటున్నావు.. నాకు అడ్డు వచ్చావని నిన్ను చంపేశాను. నీ తర్వాత నీ చెల్లెలు భాగీ నాకు పోటీగా వచ్చింది. దాన్ని అడ్డు తొలగించుకుందామనుకుంటే.. ఇప్పటి వరకు కుదరలేదు. ఈ బిడ్డ రూపంలో నువ్వు మళ్లీ ఈ లోకంలోకి రాక ముందే..భాగీని తన కడుపులో ఉన్న నిన్ను అంతం చేద్దామనుకున్నాను అయినా తప్పించుకున్నావు.. ఇప్పుడు ఈ బిడ్డగా అందరితో సంతోషంగా ఉండాలనుకున్నావు.. కదూ.. నిన్ను భాగీని ఈ ఇంటి నుంచి దూరం చేసే పథకం మొదలు పెట్టాను. నేను ఆడే ఈ ఆటను నువ్వు ఎలా ఆపుతావో నేను చూస్తాను.. అంటూ పాపను తీసుకుని పైన రూంలో ఆలోచిస్తున్న మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది మనోహరి.

రూంలో దిగాలుగా కూర్చున్న మిస్సమ్మను చూసిన మనోహరి మనసులో  పంతులు గారితో నేను పట్టించిన భయం బాగా వర్కవుట్‌ అయినట్టు ఉంది. ఇప్పుడు కాస్త డోస్‌ పెంచితే దీనిలో ఏ మూలలో ఉన్న కాస్త ధైర్యాన్ని కూడా చంపేయోచ్చు అని మనసులో అనుకుంటూ రూంలోకి వెళ్లి.. భాగీ బిడ్డను ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. పాప దగ్గర పిల్లలు ఉన్నారు కదా.? అంటుంది మిస్సమ్మ.. దీంతో లేరు అంజు ఆకాష్‌, ఆనంద్‌ రూంలో హోం వర్క్‌ చేసుకుంటున్నారు.. అమ్ము కు ఏదో స్టేషనరీ కావాలని బయటకు వెళ్లింది. అని మనోహరి చెప్పగానే.. ఈ టైంలో బయటకు వెళ్లిందా..? అది ఒంటరిగా వెళ్లిందా..? అంటూ కోపంగా అడుగుతుంది మిస్సమ్మ.

Advertisement

దీంతో మనోహరి ఎందుకు భాగీ అంత కంగారు పడతావు అని అడుగుతుంది. కంగారు పడక ఏం చేయమంటావు. ఇంత రాత్రి పూట అమ్మును ఎందుకు ఒంటరిగా పంపించావు.. వద్దని చెప్పలేకపోయావా..? నాతో కూడా ఎందుకు చెప్పలేదు అంటూ అరుస్తుంది మిస్సమ్మ. దీంతో మనోహరి చాలా కూల్‌గా భాగీ అమ్ము ఒంటరిగా ఏం వెళ్లలేదు. యాదమ్మ కూడా తోడుగా వెళ్లింది అని చెప్పగానే.. అమ్ముకు తోడుగా యాదమ్మ వెళ్లిందా అని అడుగుతుంది మిస్సమ్మ అడగ్గానే.. అదే కదా చెప్పాను.. అమ్ము ఏమైనా చిన్న పిల్లా తనకేం అవుతుంది చెప్పు అని మనోహరి అనగానే.. మిస్సమ్మ పంతులు చెప్పింది చెప్పబోయి ఆగిపోతుంది. దీంతో మనోహరి నవ్వుకుంటూ సరే భాగీ పాప ఇందాక ఏడ్చింది కదా పాలు కావాలేమో చూడు అని చెప్పి వెళ్లిపోతుంది. మనోహరి వెళ్లిపోయాక.. నాతో చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావు అమ్ము.. త్వరగా ఇంటికి రా అమ్ము అని అనుకుంటూ బాధపడుతుంది.

మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న అమ్మును బెదిరించేందుకు వెనకే వెళ్తున్న చంభా మంత్రం వేసి భైరవా అంటూ కుక్కను పిలుస్తుంది. ఒక నల్ల కుక్క వస్తుంది. దాన్ని చూసిన చంబా.. భైరవ వెళ్లు వెళ్లి ఆ పిల్లను బయపెట్టు.. చంపకు.. చావు భయం చూపించు వెళ్లు అని చెప్పగానే.. ఆ నల్ల కుక్క అమ్ము మీదకు వెళ్తుంది. అనుమానం వచ్చి తిరగి చూసిన అమ్ముకు కుక్క కనిపిస్తుంది. దీంతో అమ్ము భయంతో పరుగెడుతుంది. కుక్క కూడా పరుగెడుతుంది. కొద్ది దూరం పరుగెత్తాక అమ్ము కింద పడుతుంది. కుక్క మొరుగుతూ అమ్ము మీదకు వెళ్తుంది. అమ్ము భయంతో వద్దు నన్నేం చేయోద్దు అంటూ భయపడుతుంది. చంభా పక్క నుంచి చూస్తుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. అమర్‌ చూసి చంభా కోపంగా చ ఈ అమరేంద్ర ఇప్పుడే రావాలా…? అనుకుంటుంది. అమర్‌ను భయంతో అమ్ము హగ్ చేసుకుంటుంది. కుక్క డాడీ అక్కడ కుక్క ఉంది అని చెప్తుంది. అమర్‌ భయపడకు నేను వచ్చాను కదా..? అంటూ ధైర్యం చెప్తుంటాడు. రాథోడ్ కారులో ఉన్న రివాల్వర్‌ తీసుకొచ్చి కుక్కను కాల్చబోతుంటే అమర్‌ ఆగు రాథోడ్‌ మూగ జీవి వదిలేయ్‌ అంటాడు. అది పిచ్చి కుక్కలా ఉంది సార్‌. మనం రాకపోయి ఉంటే అమ్మును కరిచేది అని చెప్తాడు. మనం వచ్చాము కదా ఏంమీ కాదు అంటూ రివాల్వర్‌ తీసుకుని పక్కన చెత్తను కాలుస్తాడు. అందులో మంట రాగానే.. ఆ మంటలో ఆ కుక్కను అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు.

Advertisement

తర్వాత పిల్లలు అందరూ గార్డెన్‌లో ఆడుకుంటుంటే.. మనోహరి, చంభాను పిలిచి వెంటనే మంత్రం వేసి గరుడ వచ్చి అమ్మును గాయపడేలా చేయమని అని చెప్తుంది. మనోహరి చెప్పినట్టుగానే.. చంబా మంత్రం వేస్తుంది. గరుడ వచ్చి అమ్మును గాయపరుస్తుంది. అది చూసి మిస్సమ్మ మరింత భయంతో వణికిపోతుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×