E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు విలువైన వస్తు, వాహనాలు కొంటారు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 23వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. 

వృషభం

Advertisement

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. 

మిథునం

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన  పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.  బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

కన్య

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృశ్చికం

వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. 

ధనుస్సు

బంధువులతో  అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ  పరుస్తాయి. ముఖ్యమైన  పనులు కొన్ని వాయిదా వేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి.

మకరం

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో  సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  

కుంభం

ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.  బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మీనం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×