E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. సుబ్బారావు, నిర్మలను రౌడీలు చంపేస్తారా..? మీనాక్షి జైలుకు వెళ్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. సుబ్బారావు, నిర్మలను రౌడీలు చంపేస్తారా..? మీనాక్షి జైలుకు వెళ్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode june 20th: కమల్ ఎలాగైనా సరే ఆ సుబ్బారావుని తీసుకొని వస్తాను అని చెప్పాడు కదా.. మరి నిజంగానే కమల్ ఆ సుబ్బారావు వాళ్ళని కనిపెట్టాడో లేదో తెలుసుకోవాలని పల్లవి కమల్ కి ఫోన్ చేస్తుంది. సుబ్బారావు ఎందుకు కోర్టుకు రాలేదు అని అడిగితే కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు అని చెప్తాడు. అంతే కాదు సరోజ తెచ్చిన బిర్యాని ఇవ్వడంతో దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటాడు. సరోజ ను ఎందుకు సుబ్బారావు లవ్ చేస్తున్నాడు అన్నది కమల్ చెప్పగానే అవును నువ్వు చెప్పింది నిజమే అబ్బాయని సుబ్బారావు అంటాడు. పల్లవి ఫోన్ చేయగానే కమల్ సీరియస్ అయ్యి ఫోన్ పెట్టేస్తాడు. సుబ్బారావు నిజంగానే వీళ్ళకి దొరికాడా లేదా అన్నది తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది..

అవనిని చూసి పల్లవికి అనుమానం..

మీనాక్షిని కోర్టుకు తీసుకొని వస్తారని పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది.. అవని ఎలాగైనా సరే సాక్షులు దొరికారు కాబట్టి వాళ్లు వెంటనే తీసుకొని వస్తారు అక్షయ్ కమల్ వెళ్లారు కదా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మని కాపాడుకోడానికి ఇదే అసలు ప్లాను మా అమ్మని ఎలాగైనా సరే ఇవాళ కాపాడుకుంటాను అని అవని ధీమాగా ఉంటుంది.. పల్లవి అవనికి ఎక్కడ టెన్షన్ కానీ భయంగానే లేదేంటి సాక్షులు నా దగ్గరే ఉన్నారు కదా వీళ్ళకి దొరికారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మా అమ్మని కాపాడుకోవాలి అని అవని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. మీనాక్షి రాగానే నువ్వేం కంగారు పడకమ్మా నువ్వు ఎలాగైనా సరే ఇవాళ బయట పడతావు అని అవని అంటుంది.. పల్లవికి అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది..

రౌడీలకు పల్లవి బంఫర్ ఆఫర్..

Advertisement

అవని ఎందుకు ఇలా ధైర్యంగా ఉంది నాకు ఏదో అనుమానం గా ఉంది అని పల్లవి రౌడీలకు ఫోన్ చేస్తుంది.. అయితే నైట్ సాక్షులు మా దగ్గరే ఉన్నారు అని చెప్పినా రౌడీలు.. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడమే లేదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. పల్లవి వీళ్ళకి దొరికింటారా అని అనుమానం పడుతూనే వేరే రౌడీ కి ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకుంటుంది.. రాత్రి మమ్మల్ని ఎవరూ ట్రాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లారు మేడం అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకు ఎంత డబ్బు లేనా నేను ఇస్తాను కానీ నాకు వాళ్లు కోర్టుకు రాకుండా చేయాలి అని పల్లవి వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తుంది..

సుబ్బారావు, నిర్మలను కాపాడిన అక్షయ్..

అక్షయ్, కమల్ ఇద్దరూ సాక్షులను తీసుకొని కోర్టుకు వస్తున్నామని అవనితో చెప్తారు. అయితే లోపలికి వెళ్లిన మీనాక్షిని ఇంట్రాగేషన్ చేస్తారు. అటు శ్రీకర్ ఇటు లాయర్ ఇద్దరు కూడా వాళ్ల వాదనలను వినిపిస్తారు. సాక్షులు ఇంకా కోర్టుకు రాకపోవడంతో పల్లవి మీనాక్షికి శిక్ష పడుతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇద్దరు కూడా సాక్షులని తీసుకొని కోర్టుకు బయలుదేరుతారు. ఇందులో అడ్డుకున్న రౌడీలు సాక్షులని చంపేయాలి అని అనుకుంటారు.. పల్లవి చెప్పినట్లుగా వాళ్ళని కోర్టుకు రానివ్వకుండా చేయాలి అంటే చంపాలి అని అనుకుంటారు.. కానీ రౌడీలను చితక్కొట్టిన అక్షయ్ సుబ్బారావు నిర్మలను కాపాడుతాడు.. వాళ్ళని తీసుకుని కోర్టుకు బయలుదేరుతాడు..

జడ్జి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న అవని…

Advertisement

సాక్షులు ఇంకా కనిపించలేదు అని పల్లవి తరపున లాయర్ వాధిస్తాడు.. కానీ శ్రీకర్ మాత్రం సాక్షులు దొరికారు వాళ్లు ని తీసుకొని వస్తున్నాము కానీ మధ్యలో కొంతమంది అడ్డుపడుతున్నారు అని ఎంత చెప్తున్నా సరే జడ్జి మాత్రం మీకు ఆల్రెడీ ఒక వాయిదా ఇచ్చాం కదా.. ఇప్పుడు ఏమి చేయలేను జడ్జిమెంట్ ఇస్తాను అని అంటాడు.. తన తల్లి ఏ తప్పు చేయలేదు.. దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కోర్టు రూల్స్ నీకు తెలుసు కదా అమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం కాదు సాక్ష్యాలు ఉంటేనే ఏదైనా జరుగుతుంది అని జడ్జ్ అనగానే కొంచెం టైం ఇవ్వండి అని అవని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ సాక్షులు ఉన్నారు అని గట్టిగా అవ్వగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

పల్లవికి షాక్.. మీనాక్షికి రిలీఫ్..

సాక్షులను చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆరోజు ఏం జరిగింది చూసింది మేమే.. మేము నిజం చెప్తాము అని సుబ్బారావు ఆయన భార్య నిర్మల బోనులోకి వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని బయటపడతారు. రాజేశ్వరి కాలుజారి రాయి మీద పడిపోయి చనిపోయింది ఇందులో మీనాక్షి తప్పేమీ లేదు అని వాళ్ళు చెప్పగానే అది నమ్మిన జడ్జి మీనాక్షి నిర్దోషి అని వదిలేస్తారు. మీనాక్షి నిర్దోషిగా విడుదలైందని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ పల్లవి మాత్రం అవని సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటుంది.. అవని ఇంత సంతోషంగా ఉండడం నేను భరించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రిని రెచ్చగొట్టిన నారాయణ.. బాధతో మందు తాగిన చక్రీ.. అయ్యో.. మహాకు మైండ్ బ్లాక్..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×