Illu Illalu Pillalu Today Episode june 20th: విశ్వం ని కోర్టుకి తీసుకుని వెళ్లేందుకు నోటీసులు వస్తాయి. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. నా కొడుకు కోర్టుకు వెళ్తాడు అంటే కచ్చితంగా ఇక జైలుకు వెళ్తాడా ఏంటి అని రేవతి బాధ పడిపోతూ ఉంటుంది.. నా మేనల్లుడు కోర్టుకు వెళుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను ఏదో ఒకటి చేస్తాను కదా మీరు ఏమి కంగారు పడకండి అని భద్ర అంటుంది.. వాడిని విడిపించుకోవడానికి ఇక్కడ నుంచి సిటీ కోర్టుకు వెళ్లారు.. కానీ ఈ సమస్యకు పరిష్కారం రామరాజు ఉన్నాడు కదా అని భద్రవల్లమ్మ అనగానే అందరూ ఒకేసారిగా షాక్ అవుతారు..
విశ్వం ఇంకా జైలుకు వెళ్లాల్సిందేనా..? వాడిని ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని భద్ర అంటుంది. అసలు మనం విని కాపాడుకోడానికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటి అని భద్ర ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ అమ్మ ఆ పరిష్కారం కళ్ళముందే పెట్టుకొని ఎందుకంత బాధ పడిపోతున్నావు అని అంటుంది. ఏంటి పరిష్కారం ఉందా ఏం మాట్లాడుతున్నావమ్మా.. అవునే భద్ర పరిష్కారం ఎవరో కాదు రామరాజు.. ఆ రామరాజు దగ్గరికి వెళ్లి మన వాడిని జైలుకు పంపించకుండా చేయమని అడుగుదాం.. అతను మన మాట వింటాడు. విశ్వం నీ కాపాడుకోవచ్చు అని ఎంత చెప్తున్నా సరే.. భద్ర ఆ పనోడు కాళ్ళు నేను పట్టుకోమంటావా సమస్య లేదు అని అంటుంది. ఏది ఏమైనా సరే.. నా మేనల్లుని నేనే కాపాడుకుంటాను అని భద్ర సవాలు చేస్తుంది..
రామరాజు కోర్టు నోటీసు ఏదో వచ్చింది ఒకసారి ఏంటో చెప్పండి అని ధీరజ్ కి ఇస్తాడు.. ఆ నోటీసు నేను చూసిన ధీరజ్ షాక్ అవుతాడు. అదే విధంగా ప్రేమ కూడా ఆ నోటీసు తీసుకుంటుంది.. చివరికి నర్మద కూడా ఆ నోటీసు తీసుకుని చూసి షాక్ అవుతుంది.. ఏమైంది ఎందుకు మీరందరూ దాన్ని చూసుకొని అలా చదువుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదు అని మీరు చెప్పకుండా దాచేస్తున్నారా అని వేదవతి అడుగుతుంది.. ఆ విశ్వం నీ కోర్టుకి తీసుకుని వెళ్తారు విచారణకి వెళ్లాలి అమూల్య కూడా కోర్టుకి హాజరైన కిడ్నాప్ చేసింది తనే అని చెప్పాలి. అమూల్య నాలుగైదు సార్లు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని అనగానే.. పెళ్లి కావాల్సిన అమ్మాయి కోర్టుకు వెళ్లాలా? అలా అయితే రేపు అమ్మాయికి పెళ్లి ఎలా జరుగుతుంది అని వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది.
రామరాజు రేవతి వాళ్లు వచ్చి కేసుని వెనక్కి తీసుకోవాలి విశ్వం ఆల్రెడీ ఒక నెల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు.. వాడు ఇప్పుడు మారిపోయాడు. మీరు నా కొడుకుని కాపాడాలి అని అడుగుతుంది.. అయితే మీ కొడుకుకి శిక్ష పడుతుంది అని గుర్తుకు వచ్చినప్పుడు మీకు కన్నా మమకారం గుర్తుకు వచ్చిందా..? అమ్మ నాన్నల్ని కూతురు విషయంలో వాళ్లకి ఎంత బాధ ఉంటుంది కానీ మీరు కొంచమైనా ఆలోచించారా అని ధీరజ్ రేవతి వాళ్ళకి షాక్ ఇస్తాడు.. ఒకవేళ మా నాన్న ప్రాణాలు పోయుంటే మా చెల్లెలికి జరగనుంది ఏమైనా జరిగి ఉంటే అప్పుడు మీరు వచ్చి ఇలాగే మాట్లాడి ఉండేవారా..? ఇక ధీరజ్ వాళ్ళ అమ్మమ్మ ఎంత చెప్పినా కూడా ధీరజ్ మాత్రం అస్సలు వినడు.
ఒరేయ్ మనవడా వాడు ఇప్పటికే చాలా తప్పులు మీద తప్పులు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు.. ఇప్పుడు వాడు మారిపోయేలా మేము చూసుకుంటాము.. ఒక ఛాన్స్ ఇవ్వండి అని రేవతి అలాగే వాళ్ళ అత్తయ్య వచ్చి ఇద్దరు బ్రతిమలాడుతారు.. అన్నయ్య మీరు పెద్దమనిషి చేసుకొని కేసు వాపస్ తీసుకోండి అని రేవతి అడిగితే.. రామరాజు లేదు తీసుకొని అని అంటాడు.. ఒక ఆడపిల్ల తండ్రిగా వాడికి నేనే ఆ శిక్ష వేయాలి.. భార్య పుట్టింటి వాళ్ళు కాబట్టి నేను వెనక్కి తగ్గే ఆలోచించాను. ఇకమీదట ఏది ఆలోచించను.. నా కొడుకుని కాపాడండి అన్నయ్య అని రేవతి బతిమిలాడినా సరే రామరాజు మాత్రం అస్సలు వినడు. నన్ను నోరార అన్నయ్య అని పిలిచావు.. అలాంటిది నీకు ఎటువంటి సాయం అయినా నేను చేస్తాను కానీ నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసిన వాడికి మాత్రం శిక్ష పడాల్సిందే అని రామరాజు అంటాడు..
ఇక క్లాసికల్ డాన్స్ పోటీలకు 10 లక్షలు ప్రకటించిన అతను ఒక్క అందమైన అమ్మాయి కూడా కనిపించలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే మనం ప్రోగ్రాం కి 10 లక్షలని విలేజ్ లో కూడా పబ్లిసిటీ చేసాం కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పగానే అతను చాలా ఆవేశంగా అవునా ఎవరు ఆ అమ్మాయి ఫోటోలు ఒకసారి చూపించని అంటారు. ఆ ఫోటోలను చూసి నాతో నువ్వు ప్రేమ గుంటూరు మిరపకాయ లాగా చాలా హాట్ గా ఉంది అని అంటాడు. ప్రేమకు ఫిదా అయిపోతాడు. ఆమె సెలెక్ట్ అయిందని చెప్పమని చెప్తారు.. మొత్తానికి ప్రేమని అతను సెలెక్ట్ చేసుకుంటాడు.. ప్రేమ వీడియో చూసిన తర్వాత అతని మైండ్ బ్లాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో విశ్వం అమూల్యని ఎలాగైనా సరే చావు దెబ్బ కొట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..