E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 10th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తతో చాలెంట్ చేసిన ఆరు – మనోహరికి తాయెత్తు ఇచ్చిన ఘోర

Nindu Noorella Saavasam Serial Today January 10th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తతో చాలెంట్ చేసిన ఆరు – మనోహరికి తాయెత్తు ఇచ్చిన ఘోర
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : నాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు సాయం చేశారు. ఈ ఒక్కసారి ఒక్కసాయం అడుగుతాను చేస్తారా..? గుప్త గారు.. అంటూ ఏడుస్తూ.. మీ మౌనం నాకు అర్థం అయింది కానీ కొద్ది రోజులు మా చెల్లితో.. మా నాన్నతో గడపాలని ఉంది. ఈ ఒక్క కోరిక మన్నించండి అని ఆరు అడుగుతున్నా..గుప్త  మౌనంగానే ఉండిపోతాడు. పోనీ ఆస్తికలు నదిలో కలపకుండా ఏమైనా చేయమంటారా..? అంటుంది ఆరు.

గుప్త షాకింగ్‌ గా బాలిక అది అసాధ్యం అంటాడు. అసలు కుదరదా గుప్త గారు మీరేం చేయలేరా…? అని అడుగుతుంది. చేయలేను అంటాడు గుప్త అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. ఆస్తికలు నదిలో కలపకుండా ఏదో ఒకటి చేయాలి చేస్తాను అంటూ ఆరు ఇంటికి వెళ్తుంది. గుప్త ఎంత చెప్పినా వినకుండా వెళ్తుంది. గుప్త ఏం చేయలేక యముడిని పిలుస్తాడు. యముడు రాడు.

Advertisement

మరోవైపు మిస్సమ్మ.. మనోహరి చేతల గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. నిర్మల వచ్చి పిలిచినా పలకదు. దీంతో గట్టిగా పిలుస్తుంది నిర్మల.. ఉలిక్కి పడిన మిస్సమ్మ అత్తయ్యా అంత గట్టిగా అరవకుంటే పిలవొచ్చు కదా అంటుంది. నా పిలుపు కానీ నా అరుపు కానీ నీ చెవిలో పడలేదు కదా..? అందుకే అరిచాను అంటుంది నిర్మల. మీరు పిలిచారా…? ఏదో ఆలోచనలో ఉండి వినిపించలేదు అని మిస్సమ్మ చెప్పగానే వినిపించని అంతగా ఆలోచిస్తున్నావా..? అని అడగ్గానే.. మనోహరి కిచెన్‌లోకి వచ్చి అదోలా చూసింది అని చెప్పగానే నా గది దగ్గరకు కూడా వచ్చి అదోలా చూసింది. ఎందుకని అలా చూస్తున్నావు అని అడగ్గానే.. నీకోసం వెతుకుతున్నాను అని చెప్పింది.

మళ్లీ మనోహరి ఏదైనా ప్లాన్‌ చేస్తుందని ఆలోచిపస్తున్నావా..? అని నిర్మల చెప్పగానే కాదు అత్తయ్యా ప్రతి పౌర్ణమికి ఆ మనోహరి ఇంట్లో ఏదో వెతుకుతుంది. ఇంతకు ముందు కూడా నా దగ్గరకు వచ్చి ఆరు అని పిలిచింది. అని చెప్తుంది మిస్సమ్మ. ఇప్పుడు నాకు అర్థం అయింది. ఎప్పుడు ఎవరినో అడిగి తనకు పిచ్చి పట్టినట్టు ఉంది అంటుంది నిర్మల. మీరు అలా తేలిగ్గా మాట్లాడకండి అత్తయ్యా మనోహరి చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అంటూ పౌర్ణమి రోజు ఆరు అక్క ఆత్మకు శక్తి వచ్చి ఎవరిలోనైనా ప్రవేశిస్తుందేమో అంటుంది మిస్సమ్మ. కథ బాగుందని నిర్మల వెటకారంగా చెబితే.. సరే అత్తయ్యా పదండి అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

ఆరు ఇంటికి వస్తుంది. గుప్త ఆపుతూ.. నువ్వు ఇది చేయడం సరికాదు. అంటే సరి అయినది కాబట్టే ఆ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు. అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. గుప్త ఎంత చెప్పినా వినదు. గుప్త భయంతో యముడిని పిలుస్తాడు. యముడు రాగానే.. ఆ బాలిక మనం చెప్పిన మాట వినదని చెప్పాను కదా..? ఇప్పుడు ఆ బాలిక మానవ శరీరంలో దూరింది. ఇప్పుడేమి చేయాలి అని అడుగుతాడు.  ఆ బాలికను ఏమైనా చేసి ఎన్ని మాయలు చేసైనా సరే యమపురికి తీసుకురా…? అని చెప్తాడు యముడు.

మనోహరి.. ఘోర దగ్గర ఉంటుంది. పౌర్ణమి గడియలు మొదలైయ్యాక కూడా ఆత్మ ఎవరి ఒంట్లోకి ప్రవేశించలేదా..? అంటూ ఆవేశపడుతుంటాడు. అది ఎవరి ఒంట్లోకి దూరలేదు కానీ నేను కొంచెం ఉంటే అమర్‌కు దొరికిపోయేదాన్ని.. అయినా అది ఎవరిలోకి దూరకపోతే నేనేం చేయాలి. అయినా రేపు ఆస్తికలు కలపాలనుకుంటున్నారు. ఈ పౌర్ణమికి శక్తి ఉందో లేదో అంటుంది మనోహరి. ఇంతలో ఘోర మంత్రం వేసి చూసి ఆత్మ ఆ ఇంట్లో ఒకరిలోకి ప్రవేశించింది.

అని చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. నేను చూశాను ఎవరిలోకి ప్రవేశించలేదు అంటుంది మనోహరి. దీంతో ఆత్మ ఇప్పుడే మనిషిలోకి ప్రవేశించింది వెళ్లి చూసి చెప్పు అంటూ మనోహరికి ఒక లాకెట్‌ ఇస్తూ ఇది నీ మెడలో వేసుకో.. ఇంట్లో ఉన్న వాళ్లందరినీ ముట్టుకో ఎవరిని ముట్టుకుంటే ఈ ముత్యం వెలుగుతుందో వారిలో ఆత్మ ఉన్నట్లే  అని చెప్తాడు. సరే అని మనోహరి వెళ్తుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×