Daaku Maharaj Pre Release Event: ప్రమోషన్స్ అనేవి ఏ సినిమా సక్సెస్‌లో అయినా కీలక పాత్ర పోషిస్తాయి. అందులోనూ ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి చాలా కీలకం. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉంటాయి. ఆ ఈవెంట్‌కు ఎవరు గెస్ట్‌గా వస్తారో, సినిమా గురించి ఎవరెవరు ఏం చెప్తారో అని ఇంట్రెస్టింగ్‌గా ఫాలో అవుతుంటారు. అలాగే బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన తన అప్‌కమింగ్ మూవీ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ అలాగే ఎదురుచూశారు. రెండు రోజుల క్రితం జరగాల్సిన ఈ ఈవెంట్ పోస్ట్‌పోన్ అవ్వగా ఫైనల్‌గా ప్రీ రిలీజ్ కోసం పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మళ్లీ ఫ్యాన్స్‌లో చర్చ మొదలయ్యింది.
ఈవెంట్ క్యాన్సెల్
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మామూలుగా బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేశాడు బాబీ. బోనస్‌గా ఒక ఐటెమ్ సాంగ్ కూడా పెట్టాడు. ఆ ఐటెమ్ సాంగ్ వల్ల, దానిపై వచ్చిన ట్రోల్స్ వల్ల మూవీపై డిస్కషన్స్ మరింత పెరిగాయి. ‘డాకు మహారాజ్’లో ఐటెమ్ సాంగ్ చేయడం కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాను రంగంలోకి దించారు మేకర్స్. ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో విడుదల అవ్వగానే దీనిపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అంతలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్ అవ్వడం ఫ్యాన్స్‌కు మరొక షాక్ తగిలేలా చేసింది.
Also Read: బాలయ్య చేసిన పనికి రేణూ దేశాయ్ షాక్.. వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను..!
అదొక్కటే ఆప్షన్
‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అనంతపురం సిద్ధమయ్యింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నారా లోకేశ్ రానున్నాడని కూడా మూవీ టీమ్ ప్రకటించింది. కానీ అంతలోనే తిరుమలలో తొక్కిసలాట జరగడం, పలువురు భక్తులు మృతి చెందడం లాంటివి జరిగాయి. దీంతో ఉన్నత రాజకీయ పదవిలో ఉన్న నారా లోకేశ్ ఈవెంట్‌కు రాలేడని తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ సైతం తప్పుకున్నారు. ఇంతలోనే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రస్తుతం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ ఆప్షన్ మాత్రమే మిగిలిందని వారికి క్లారిటీ వచ్చేసింది.
అనుమతి వచ్చింది
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది మూవీ టీమ్. ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తూ అనుమతినిచ్చింది. దీంతో శుక్రవారం అంటే జనవరి 10న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇకపై మూవీ ఈవెంట్స్‌లో ఎలాంటి ప్రమాదాలు, పొరపాట్లు జరగకుండా మేకర్స్‌తో పాటు పోలీసులు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.