trinayani serial today Episode: విశాల్ కమర్షియల్ గా ఆలోచించడని తిలొత్తమ్మ వల్లభకు చెప్తుంది. ఇదంతా తన ఒక్కడి వల్ల రాలేదని నయని హెల్ఫ్ కూడా ఉందని నమ్ముతాడు. అని చెప్పగానే.. అంతగా ప్రేమించే వాడు. ఇప్పుడు వదిలేసి వెళ్లిపోతాడా..? అని అడగ్గానే.. నిజమే కానీ అసలు ఇక్కడ నయని లేదని నాకు అనుమానంగా ఉందంటుంది తిలొత్తమ్మ. ఏంటి మమ్మీ ఒకసారి ఉంది అంటావు. మరోసారి లేదని అంటావు అసలు ఉందా..? లేదా..? అంటాడు వల్లభ.
మరోవైపు విక్రాంత్ లాప్ టాప్ కోసం వెతుకుతుంటే.. సుమన వస్తుంది. ఏంటి వెతుకుతున్నారు. ఆ పెట్టె కోసమేనా అని అడుగుతుంది. దాన్ని నడుముకు వేలాడేసుకునేటట్లు చెప్తావు ఇంతకీ ఎక్కడుంది అది అని అడుగుతాడు విక్రాంత్. అది సరే కానీ మీరు అది తీసుకుంటే అందులో లీనమైపోయి ఇంట్లో ఏం జరగుతుందో పట్టించుకోరు కానీ ఇంతకీ ఆ ముక్కోటి కి దెయ్యం పట్టిందా..? లేదా తెలుసుకోరా.? అని అడుగుతుంది సుమన. దీంతో విక్రాంత్ కోపంగా సుమనను తిడతాడు. సుమన అలిగి వెళ్లిపోతుంది.
వల్లభ, అఖండ స్వామిని తీసుకుని వస్తాడు. తిలొత్తమ్మ కూడా హాల్‌లో నయనిని పడకోబెడుతుంది. అదే విషయం చెప్పగానే ఎలా పడుకోబెట్టావు మమ్మీ అంటూ అడుగుతాడు. తాను ఎలా నయని నిద్ర పోయేలా చేసింది మొత్తం చెప్తుంది. అంతా విన్న వల్లభ ఐడియా అదిరింది మమ్మీ అంటూ ఇంతకీ గాయత్రి పాప ఎక్కడుంది అని అడుగుతాడు. ఇంకో ఎవరినైనా తీసుకొస్తుందేమో అని అఖండ స్వామి అనగానే ఎవరికీ తెలియకపోతే ఏమీ అనరులే స్వామి అంటుంది తిలొత్తమ్మ.
ఇంతలో నయని శరీరం చూసిన అఖండ స్వామి ఇక్కడ ఉన్నది నయని ఆత్మే అంటాడు. వల్లభ షాక్ అవుతాడు. ఇంతలో నయని ఆత్మ వస్తుంది. వెనక్కి తిరిగి చూసిన తిలొత్తమ్మ షాక్ అవుతుంది. పిల్లతో పాటు తల్లి కూడా వచ్చిందిరా అంటుంది తిలొత్తమ్మ. వల్లభ భయంతో అఖండ స్వామిని పట్టుకుంటాడు. నయని ఆత్మ వచ్చిందట నీ ప్రయోగాలు ఆపు స్వామి అంటాడు. ఇంతలో స్వామి కూడా తిరిగి చూసి ఇది దేహం అది ఆత్మ అంటాడు. శభాష్ అఖండ స్వామి చాలా బాగా చెప్పారు. మా అత్త నన్ను చూసి చాలా రోజులు అయినట్టు ఉందే.. అంటూ తిలొత్తమ్మ దగ్గరకు వస్తుంది.
తిలొత్తమ్మ భయపడుతూ దగ్గరకు రావొద్దు.. నన్నేం చేయాలని వస్తున్నావు అంటుంది. నేను ఇలా మారడానికి మీరేం చేశారు. చెప్పండి అత్తయ్యా నాకు యాక్సిడెంట్ అవ్వడానికి మీరేం చేశారు అంటూ అడుగుతుంది. తిలొత్తమ్మ నయనితో పాటు గాయత్రి పాప ఉంది ఇద్దరి శక్తులు కలిస్తే మనం అంతం అయిపోతాం అని హెచ్చరించడంతో ఇప్పుడు మనం ఏం చేద్దాం స్వామి అని అడుగుతుంది తిలొత్తమ్మ.. వల్లభ వెంటనే నయనికి స్పృహ వచ్చేలా చేయ్ అంటాడు ఎలా చేయాలి స్వామి అని వల్లభ అడగ్గానే నీళ్లు తీసుకొచ్చి నయని మీద చిలకరించు అని చెప్తాడు అఖండ స్వామి.
వల్లభ బయపడుతూ.. కిచెన్ లోకి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి నయని శరీరం మీద చల్లగానే ఆత్మ మాయం అవుతుంది. నయని నిద్ర లేస్తుంది. వెంటనే పాప అంటూ గాయత్రి దగ్గరకు వెళ్తుంది. నాకు ఏమైంది అని అడుగుతుంది. ఏమో నేను సోపాలో పడుకున్నాను. ఎవరో నీళ్లు చల్లగానే మెలుకువ వచ్చిందని చెప్తుంది నయని. ఇక్కడ ఎందుకు పడుకున్నావు అక్కా అని సుమన అడుగుతుంది. నేనే పడుకోబెట్టాను అని తిలొత్తమ్మ చెప్తుంది.
ఎందుకని విక్రాంత్ అడగ్గానే.. నేను నయని ఆత్మను చూశానని తిలొత్తమ్మ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. రత్నాంభ కోపంగా తిలొత్తమ్మను తిట్టగానే.. నీ మనవరాలు త్రినేత్రి ఎప్పుడో చనిపోయిందని.. త్రినేత్రి శరీరంలో నయని ఆత్మ చేరిందని చెప్తుంది తిలొత్తమ్మ. అందరూ తిలొత్తమ్మను తిడతారు. అఖండ స్వామి వెళ్లిపోతాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?