E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆర్‌జేను గుర్తు చేసిన ఆనంద్‌ – నిజం తెలుస్తుందేమోనని టెన్షన్‌ పడ్డ అమర్‌

Nindu Noorella Saavasam Serial Today January 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆర్‌జేను గుర్తు చేసిన ఆనంద్‌ – నిజం తెలుస్తుందేమోనని టెన్షన్‌ పడ్డ అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజును తీసుకుని  కిందకు వెళ్లిన మిస్సమ్మ.. డాడీ అరిచారని బాధపడుతున్నావా  అని అడుగుతుంది. లేదని చెప్తుంది అంజు. కానీ మీ డాడీకి బాధ ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడ బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారోనని చెప్తుంది. దీంతో అమర్‌ కూడా డోర్‌ మూసి కిందకు వస్తాడు.

గార్డెన్‌ లోకి వెళ్లిన అంజు ఇక్కడేం చేస్తున్నారు గుప్త గారు అని అడుగుతుంది. మీ జనని ఎవరిలో ప్రవేశించో తెలియక ఆలోచించి.. ఆలోచించి ఇక్కడ విశ్రమించాను అంటాడు గుప్త. ఓహో అయినా ఇన్ని కష్టాలు మీకు ఎందుకు చెప్పండి భూలోకంలో మీరు ఎప్పుడూ లేరు కదా..? ఉన్నన్ని రోజులు హ్యపీగా చిల్‌ అవ్వండి అంటుంది అంజు. అయినా మాకు అంతటి మహా భాగ్యము కూడానా.. మానవులతో ఉన్న  పాపానికి మెల్లగా మేము కూడా మానవులను అయ్యెద్దని భయంగా ఉంది అంటాడు గుప్త. అంజు దగ్గరకు వెళ్లి కష్టాలు వచ్చిన్నప్పుడే ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది.

Advertisement

పిల్ల పిచ్చుకవు అయినను నీవు అంటూ గుప్త ఉలిక్కిపడతాడు. నీకు మేము కనిపిస్తున్నానా..? అని అడుగుతాడు. అవును కనిపిస్తున్నారు అని అంజు చెప్పగానే.. ఎటుల కనిపిస్తున్నాను అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే.. అంజులో ఆరు కనిపిస్తుంది గుప్తకు.. కోపంగా బాలిక అంటే బాలిక ఈజ్‌ బ్యాక్‌ అంటుంది. ఎంత పని చేసితివి బాలిక యమధర్మరాజుల వారు కూడా నీవు చేయవలసింది చేయోద్దని చెప్పెను కదా అంటాడు గుప్త. ఇన్ని రోజులు మీ మాటే కదా విన్నాను అంటుంది ఆరు. ఇంతలో మనోహరి వచ్చి ఇక్కడ ఉన్నావా..? నీకోసం ఇళ్లంతా వెతుకుతున్నాను అంటుంది.

మనోహరిని చూసి ఈ బాలిక తెలిసి అంటుందా..? తెలుసుకొనుటకు మాట్లాడుతుందా..? అనుకుంటాడు. మనోహరి ఆరు మాట్లాడుతుంది నీతోనే.. వినిపిస్తుంది చెప్పు అంటుంది ఆరు. ఘోరాకు నువ్వు అంజలి లోపల ఉన్నావని తెలిసిపోయింది. నిన్ను బంధించడానికి వస్తున్నాడు అని మనోహరి చెప్తుంది. తెలిసిపోయిందా..? చెప్పావా..? అంటూ నిలదీస్తుంది ఆరు. అంటే ఏంటి నేను చెప్పానని అంటున్నావా..? అని మనోహరి అడుగుతుంది. వాడు మంత్రాలు తంత్రాలు తెలిసినవాడు. ఎలా తెలుసుకున్నాడో ఏమో అంటుంది. నన్ను చూసి జాలిపడే స్టేజ్‌లో నువ్వు లేవు మనోహరి.. ఘోర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు..? కానీ ఇవ్వాళ నా  నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో తెలుసుకో అంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

Advertisement

అమర్‌ పోస్టల్ కవర్‌ తీసుకుని రామ్మూర్తి ఇంటికి వెళ్తాడు. కవర్‌లో ఉన్న ఆరు ఫోటో తీసి రామ్మూర్తికి ఇస్తాడు. ఫోటో చూసిన రామ్మూర్తి బాధపడతాడు. సంతోషంగా ఉందని నా కూతురుని ఇలాగైనా చూసుకునే భాగ్యం కల్పించారు అంటూ ఎమోషనల్‌ అవుతాడు. మీ కూతురే తను అని తెలిసాక తనను మీరు ఎంత మిస్‌ అవుతున్నారో నేను ఊహించగలను. కానీ తనను ఎలాగూ తీసుకుని రాలేను.. కానీ తన జ్ఞాపకాలనైనా మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు.

తర్వాత ఇంటికి వచ్చిన అమర్‌ అందరికీ కాశీకి వెళ్లాక ఎలా ఉండాలో చెప్తుంటాడు. ఇంతలో రాథోడ్ వచ్చి మార్నింగ్‌ టైం ఫ్లైట్‌కు టికెట్స్‌ బుక్‌ చేశానని చెప్తాడు. దీంతో మనోహరి అక్కడికి వెళ్లాక ఏ కారణం చేతనైనా ఆస్తికలు కలపడం లేటు కాకుండా చూసుకోమని అక్కడి పంతులుకు చెప్పు అంటుంది. ఇంతలో మిస్సమ్మ అక్క వాళ్ల పేరెంట్స్‌ గురించి తెలిస్తే బాగుండు.. అక్క ఆస్తికలు కలపడానికి తీసుకెళ్తే బాగుండు అంటుంది. అందుకే కదా మిస్సమ్మ రామ్మూర్తి గారిని కూడా తీసుకెళ్తున్నాం అంటాడు రాథోడ్‌. అందరూ షాక్‌ అవుతారు. ఏమన్నావు రాథోడ్‌ అని మిస్సమ్మ అడుగుతుంది.

రాథోడ్‌.. మిస్సమ్మ.. ఆరు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే.. నువ్వు రామ్మూర్తి గారి గురించి అంటావేంటి అంటాడు శివరాం. ఇంతలో అమర్‌ అంటే మీ నాన్న ఆరును తన పెద్దకూతురు లాంటిది అన్నారు కదా అందుకే రాథోడ్‌ అలా అన్నాడు అని కవర్‌ చేస్తాడు అమర్‌. ఇంతలో ఆనంద్‌ అమ్మకు ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్దామా అని అడుగుతాడు. నేను కాకుండా మీ అమ్మకు మరో ఫ్రెండ్‌ ఎవరు అని మనోహరి అడుగుతుంది. మా అమ్మకు ఆర్‌ జే అంటే చాలా ఇష్టం. అని రేడియో ఫ్రోగ్రాం గురించి చెప్తారు. మీ అమ్మ ఏ ఫ్రోగ్రాం వినేది.. నేను కూడా ఆర్‌జే నే కదా..? అని అడుగుతుంది.

ఇంతలో అమర్‌ అడ్డుపడి ఒక్కటి అని ఏం లేదు మిస్సమ్మ టైం పాస్‌ కోసం ఏవేవో వినేది అంటాడు. అమ్ము మాత్రం అమ్మ రోజు ఒక్క ఫ్రోగ్రాం మాత్రమే వినేది అంటుంది. రాథోడ్‌ అంజును గుర్తు చేయగానే.. అందరూ అంజు కోసం వెతుకుతారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

ఈశ్వర్ సాయికి బెయిల్.. ఇక తప్పించుకున్నట్టేనా?

నటరాజ్ మాస్టర్ ను వెన్నుపోటు పొడిచిన లేడీ ఆర్టిస్ట్..శారీ వేసుకొని మోసం చేస్తుందంటూ!

సందీప్ మాస్టర్ కి కొరియోగ్రఫీ రాదా..నటరాజ్ మాస్టర్  షాకింగ్ కామెంట్స్ !

తిండి లేదు, నీళ్లు తాగి బ్రతికాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న నటరాజ్ మాస్టర్ కష్టాలు!

తెలంగాణ బిడ్డగా పుట్టిన ప్రయోజనాలు సున్నా: ఉదయభాను

రామ్ ప్రసాద్ కోసం స్టార్ యాంకర్ ఎంట్రీ?

బిగ్ బాస్ 10 నుండి తొలి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్.. మొదటి వారంలోనే ఇద్దరా?

యూట్యూబర్ నందనకు బిగ్ బాస్ క్రేజీ ఆఫర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Big Stories

Advertisement
×