E-Paper
Advertisement

Horoscope Today January 14th: ఆ రాశి ఉద్యోగులకు ఇవాళ పదోన్నతులు – చేపట్టిన వ్యవహారాల్లో విజయం

Horoscope Today January 14th: ఆ రాశి ఉద్యోగులకు ఇవాళ పదోన్నతులు – చేపట్టిన వ్యవహారాల్లో విజయం
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 14న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మిధునం రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషానిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.  ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.  వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×