E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మళ్లీ మిస్సమ్మను భయపెట్టిన పంతులు

Nindu Noorella Saavasam Serial Today January 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మళ్లీ మిస్సమ్మను భయపెట్టిన పంతులు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మనోహరి అమ్మును తోసేయబోయి బిల్డింగ్‌ మీద నుంచి తాను జారి పడిపోతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అమర్‌ మనోహరిని చేయి పట్టుకుంటాడు.  కానీ ఇంతలో రాథోడ్‌ వచ్చి రెస్క్యూ టీంకు ఫోన్‌ చేస్తాడు. రెస్క్యూ టీం వచ్చి మనోహరిని సేవ్‌ చేస్తుంది. అంతా అక్కడే నిలబడి చూస్తున్న రాజు వెంటనే మిస్సమ్మకు ఫోన్‌ చేసి చెస్తాడు. అమ్మా ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పగానే.. మిస్సమ్మ భయంగా ఎవరికి బాబాయ్‌ అమ్ముకా..? అని అడగ్గానే.. కాదమ్మా.. మనోహరికి మేడ మీద నుంచి కింద పడిపోయింది. పక్కన అమ్ము కూడా ఉందమ్మా..? అని చెప్పగానే.. బాబాయ్‌ అమ్ముకు ఏమీ కాలేదు కదా..? అని అడగ్గానే. ఏం కాలేదమ్మా.. సమయానికి సార్‌ రావడం వల్ల మనోహరికి ప్రాణాపాయం తప్పింది. అని చెప్పగానే.. బుజ్జమ్మ ఎక్కడుంది బాబాయ్‌ తను ఎలా ఉంది అని అడగ్గానే.. బుజ్జమ్మకు ఏమీ కాలేదమ్మా తను నా పక్కనే ఉంది అని చెప్పగానే.. సరే బాబయ్‌ బుజ్జమ్మ జాగ్రత్త అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది మిస్సమ్మ.

Advertisement

పక్కనే ఉన్న కరుణ ఏమైందే ఎందుకు అంత కంగారు పడుతున్నావు. చెప్పు.. ఏమైంది..? అని అడగ్గానే.. మనోహరి మేడ మీద నుంచి కింపడబోయిందట. ఆ టైంలో అమ్ము పక్కనే ఉందట అని చెప్పగానే.. కరుణ నేను చెప్పిన కదా..? ఆ మనోహరి ఏదో ఒకటి ప్లాన్‌ చేసి ఉంటుందని అనగానే.. మిస్సమ్మ కానీ పడబోయింది మనోహరి కదే.. అనగానే.. కాదే అమ్మును పై నుంచి మనోహరి తోసేయబోతే తనే పడిపోయి ఉంటుంది. ఆ దేవుడు ఉన్నాడే చూస్తూ ఉంటాడు అనగానే.. ఒకవేళ మనోహరి ప్లాన్  సక్సెస్‌ అయి అమ్ము పడిపోయి ఉంటే..? అంటూ మిస్సమ్మ ఊహించుకుని భయపడుతుంటే.. ఏయ్‌ ఊరుకో అట్లా జరగదు. అటువంటి చెడ్డోళ్లకు దేవుడు ఎప్పుడూ సాయం చేయడు.. ఇప్పటికైనా నమ్ముతవా..? ఇది జాతకం కాదు ఆ మనోహరి కుట్ర అని అంటూ కరుణ చెప్పగానే.. కానీ ఇప్పుడు కూడా బుజ్జమ్మ అక్కడ ఉన్నప్పుడే ఇలా జరిగింది కదా..? అంటూ మిస్సమ్మ భయపడుతుంటే..

ఏయ్‌ ఊరుకో పోరి ఇంకా ఏం మాట్లాడుతున్నావు.. బుజ్జమ్మ జాతకం వల్ల ఆ మనోహరికి ప్రాణగండం ఉందటావా..? ఏంటి..? అనగానే.. అది కాదే అంటూ మిస్సమ్మ బాధపడుతుంటే.. ఏయ్‌ ఊరికే మాట్లాడకు..అయినా నీకు ఈ జాతకం గురించి ఎవరు చెప్పిండ్రే.. ఆ బద్మాష్‌ గాణ్ణి పట్టుకుని నాలుగు పీకాలే.. అంటుంటే.. అయ్యోయ్యో అలా అనకే ఆ జాతకం చెప్పింది పంతులు గారు అనగానే.. ఆ పంతులు గాడేమన్నా కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నావా..? పోయి పోయి ఆ పిచ్చి పంతులు మాటలు నమ్ముతావేంటే నువ్వు… అనగానే.. అలా కాదే నా విషయంలో ఏం జరిగినా నేను తట్టుకోగలను కానీ పిల్లల విషయంలో అంటేనే నేను భరించలేను అనగానే.. ఏయ్‌ పో నీ ఈ వీక్‌నెస్‌ నే ఆ మనోహరి క్యాష్‌ చేసకుంది. మనం అర్జెంట్‌గా వెళ్లి ఆ పంతులును కలవాలి. పద పోదాం.. పంతులును కలుద్దాం పద అంటూ మిస్సమ్మను తీసుకుని బలవంతంగా పంతులును కలవడానికి వెళ్తారు.

Advertisement

మిస్సమ్మ, కరుణ వెళ్లి పంతులును కలుస్తారు. మిస్సమ్మ పంతులుగారు నమస్తే.. నేను గుర్తున్నానా..? అని అడగ్గానే.. పంతులు ఐదేళ్ల క్రితం మీ అమ్మాయికి జాతకం చెప్పింది నేనే కదా… అంటాడు. మీ పెద్దమ్మాయికి  ప్రమాదం తప్పిపోయి ఉండొచ్చు కానీ మీ చిన్న అమ్మాయికి ప్రమాదం జరగొచ్చు కదా అని చెప్పగానే.. మిస్సమ్మ భయంగా ఏం అంటున్నారు పంతులు గారు అని అడుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్లి మళ్ళీ ఆ మనుషులను కలిస్తే మీ చిన్నమ్మాయికే ప్రమాదం. ప్రాణసంకటమే వాటిల్లొచ్చు అని చెప్పగానే.. మిస్సమ్ భయంతో వణికిపోతుంది. పంతులు సరే అమ్మా వెళ్తాను అంటూ వెళ్లిపోతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×