E-Paper
Advertisement

Agra Murder: ఆఫీస్‌లోనే హెచ్ఆర్ మేనేజర్‌ను చంపి, ముక్కలు చేసి.. నదిలో పడేసిన ఉద్యోగి, హత్యకు కారణాలివే!

Agra Murder: ఆఫీస్‌లోనే హెచ్ఆర్ మేనేజర్‌ను చంపి, ముక్కలు చేసి.. నదిలో పడేసిన ఉద్యోగి, హత్యకు కారణాలివే!
Advertisement

Agra Man Killed Girl Friend: యూపీలో దారుణం జరిగింది. ఆగ్రా సిటీలో ఓ యువతికి పెళ్లికి నిరాకరించిందని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె ప్రియుడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను యుమనా నదిలో వేశాడు. సంచలనం రేపిన ఈ ఘటనలో గోల్డెన్ నెయిల్ పాలిష్ నిందితుడ్ని పట్టించింది. ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. ఘటన ఎలా జరిగింది?

పెళ్లికి నో చెప్పినందుకు ప్రేయసిని చంపేశాడు

Advertisement

ఆగ్రాలోని నివాసం ఉంటోంది 25 ఏళ్ల మింకీ శర్మ. సంజయ్ ప్లేస్‌ ప్రాంతంలోని మారుతి ప్లాజాలో ఓ ప్రైవేట్ ఆఫీసులో హెచ్ఆర్ మేనేజర్‌గా ఆమె పని చేస్తోంది. ఆమె తండ్రి అశోక్ శర్మ ఓ కోల్డ్ స్టోరేజ్‌లో పని చేసేవాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. వారిలో మింకి చిన్నది. మింగి తమ్ముడు దీపక్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మింకి శర్మకు తన ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ రాజ్‌పుత్‌తో పరిచయం మొదలైంది.

ఒకే ఆఫీసు కావడంతో ఇద్దరు మరింత క్లోజ్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇదే క్రమంలో పింకీ తమ్ముడు వివాహం ఫిబ్రవరి 6న జరగాల్సి ఉంది. ఇదే మయంలో వినయ్.. మింకీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయం ప్రియురాలితో చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది.

Advertisement

మింకి తనను మోసం చేస్తుందని అనుమానించాడు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని భావించాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించాడు. జనవరి 23న మధ్యాహ్నం సమయంలో మింకి ఇంటి నుండి బయలుదేరింది. దీపక్ వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికలను కొంతమంది స్నేహితులకు కొరియర్ చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పింది. రాత్రి 8 గంటలు అవుతున్నా మింకీ తిరిగి రాలేదు.

ప్రేయసి శరీరాన్ని ముక్కలు చేసి యమునా నదిలో పడేశాడు

దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆఫీసుకు వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఇద్దరు కూతుళ్లకు ఫోన్ చేసి మింకీ కనిపించడం లేదని తండ్రి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అసలు విషయాన్ని చెప్పారు మింకీ పేరెంట్స్. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు మింకి ఫోటో తీసుకొని వెతకడం ప్రారంభించారు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కొంతమంది వ్యక్తులు సమీపంలోని జవహర్ వంతెనపై ఓ సంచి పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచి తెరిచి చూశారు. అందులో అమ్మాయి మృతదేహం కనిపించింది. ఆమె కాళ్ళు, తల కనిపించలేదు, పైగా మృతదేహం దుస్తులు లేకుండా ఉంది.

ఈ మృతదేహం ఎవరిది? మింకీదా? కాదా?అని నిర్ధారణ పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసు దర్యాప్తులో చిన్న క్లూ లభించింది. మింకీ గోళ్లపై బంగారు నెయిల్ పాలిష్ ఉంది. దీని ఆధారంగా మింకీ ఇంటికి చేరుకున్నారు. ఆమె గదిలో బంగారు నెయిల్ పాలిష్ బాటిల్ దొరికింది. ఆ మృతదేహం కచ్చితంగా మింకీదేనని నిర్ధారణకు వచ్చారు. మింకీని ఎవరు అత్యంత దారుణంగా చంపారనేది మరొక మిస్టరీ.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు,

జనవరి 24న మింకీ పని చేసే ఆఫీసుకు వచ్చారు పోలీసులు. ఆమెకి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. అక్కడున్న CCTV ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో వినయ్ రాజ్‌పుత్.. ఆఫీసు నుంచి సంచిని బయటకు లాగుతున్న కనిపించింది. జవహర్ బ్రిడ్జి వైపు స్కూటర్‌పై సంచిని మోసుకెళ్తున్నట్లు ఉంది. దీంతో వినయ్ రాజ్‌పుత్ హత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు. చివరకు నిందితుడు అతడిని అరెస్టు చేశారు.

పోలీసుల విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. హత్యకు జరిగిన పైకారణాలను వివరించాడు. తాను ముందుగా కొనుగోలు చేసిన కత్తితో మింకి పొడిచి చంపేశానని, అక్కడికక్కడే మరణించిందని తెలిపాడు. మింకీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి సంచిలో పెట్టినట్టు వివరించాడు. ఆఫీసు మొత్తాన్ని ఫినాయిల్‌తో శుభ్రం చేసి బట్టలు మార్చుకుని అక్కడి నుంచి సంచి పట్టుకుని వెళ్లినట్టు తెలిపాడు. ఆమె శరీర భాగాలు వేర్వేరు ప్రాంతంలో విసిరి వేసినట్టు తెలియజేశాడు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×