E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పేందుకు అమర్‌ ఇంటికి వచ్చిన కొడైకెనాల్‌ ఎస్సై  

Nindu Noorella Saavasam Serial Today Episode July 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పేందుకు అమర్‌ ఇంటికి వచ్చిన కొడైకెనాల్‌ ఎస్సై  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్‌ నుంచి ఎస్సై వస్తున్నారన్న విషయం అమర్‌ ఇంట్లో అందరికీ చెప్పబోతుంటే.. రాథోడ్‌ అడ్డుపడి పేరు చెప్పకుండా ఆపేస్తాడు. దీంతో మనోహరి కొడైకెనాల్‌ నుంచి ఎవరు వస్తున్నారో తెలియక రాత్రంతా ఆలోచిస్తూ భయపడుతుంది. మరుసటి రోజు ఉదయం చంభాతో అదే విషయం చెప్తుంది. అసలు ఎవరు వస్తున్నారు.. ఎం చెప్పబోతున్నారు… అమర్‌ ఎందుకు పేరు చెప్పకుండా ఆగిపోయాడు అంటూ టెన్షన్‌ పడుతుంటే.. చంభా కోసంగా ఇదే మనోహరి నీకు వద్దని చెప్పేది రాత్రే చెప్పాను నేను ఇక ఇక్కడి నుంచి చెప్పా పెట్టకుండా పారిపోమ్మని కానీ నువ్వు వినడం లేదు.. అనగానే.. పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు కదా..? అంటూ మనోహరి కోపంగా చంభాను తిడుతుంటే..

అప్పుడే సడెన్‌గా డోర్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి ఉలిక్కిపడిన మనోహరి కోపంగా ఏయ్‌ లోపలికి వచ్చే ముందు డోర్‌ కొట్టి రావాలన్న సెన్స్‌ లేదా..? అంటూ తిడుతుంది. దీంతో మిస్సమ్మ కోపంగా నువ్వు పెద్ద మహారాణివి నేను నీ సేవకురాలిని లోపలికి వచ్చే ముందు డోర్‌ కొట్టి రావాలి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఈరోజుతో నీ కథ ముగిసిపోయింది మనోహరి.. ఆయనకు నిజం తెలిసిన మరుక్షణమే నీ బతుకు తెల్లారిపోతుంది.. అందుకే నీకు రెండు ఆప్షన్స్‌ ఇస్తాను మనోహరి.. ఒకటి చెప్పాపెట్టకుండా పారిపోవడమో.. లేకపోతే ఆయన కాళ్ల మీద పడి నిజం ఒప్పుకుని క్షమాపణ అడగడమో అంటూ చెప్పగానే.. మనోహరి కోపంగా బతికున్నప్పుడు ఆరు కూడా నన్నేం చేయలేకపోయింది. అది చచ్చి దెయ్యం అయి పిల్ల రాక్షసిలా తిరిగొచ్చినా కూడా నన్నే చేయలేదు.. ఇప్పుడు నువ్వేం చేస్తావు.. అనగానే.. చంభా మాత్రం మనసులో సార్ నిజం తెలిస్తే ఆయన చేతిలో కుక్క చావు చస్తావు అనుకుంటుంది. భాగీ కూడా అవునా.. ఆయనకు నిజం తెలిస్తే.. వెంటనే నిన్ను కుక్కను చంపేసినట్టు కాల్చిపారేస్తారు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మిస్సమ్మ. అబ్బా నేను కూడా అలాగే అనుకున్నాను మేడం అని మళ్లీ మనసులో అనుకుంటుంది చంభా.

Advertisement

తర్వాత అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ముగ్గురు లాన్‌లో కొడైకెనాల్ నుంచి వచ్చే ఎస్సై కోసం ఎదురుచూస్తుంటారు. మనోహరి, యాదమ్మ కనిపించడం లేదని పారిపోయి ఉంటారా..? అని మిస్సమ్మ, రాథోడ్‌ మాట్లాడుకుంటుంటే.. అప్పుడే మనోహరి ఇంట్లోంచి వస్తుంది. మనోహరిని చూసిన రాథోడ్‌ పాపి చిరాయువు అన్నట్టు ఈ మనోహరి చూడా మిస్సమ్మ ఎంత దర్జాగా నడుచుకుంటూ వస్తుందో అంటాడు. మనోహరి దగ్గరకు వెళ్లి మిస్సమ్మ పక్కన నిల్చుంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి కొడైకెనాల్‌ ఎస్సై దిగతాడు. ఎస్సైని చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. కొడైకెనాల్‌లో ఎస్సై, మనోహరి గురించి అమర్‌కు నిజం చెప్పిన విషయం గుర్తు చేసుకుని మరింత టెన్షన్‌ పడుతుంది. ఎస్సై దగ్గరకు రాగానే.. మనోహరిని అనుమానంగా చూస్తుంటాడు.

అమర్‌ ఎస్సైని తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. అప్పుడే బయటకు వచ్చిన చంభా మనోహరి దగ్గరకు వెళ్లి అతను ఎవరు అని అడుగుతుంది. అతను కొడైకెనాల్‌ ఎస్సై అని చెప్పగానే.. అతనికి నీ గురించి తెలుసా..? అని అడిగితే మొత్తం తెలుసు అంటూ భయపడుతుంది మనోహరి. మనోహరి చెప్పిన మాటలకు చంభా షాక్‌ అవుతుంది. మరి అతనికి మొత్తం నీ గురించి తెలిసి ఉంటే అమర్‌ సార్‌కు అంతా చెప్పేస్తాడేమో.. అందుకే వచ్చాడేమో.. అంటూ వెంటనే ఇక్కడి నుంచి పారిపో మనోహరి అంటూ చెప్తుండగానే.. మనోహరి కోపంగా నేను ఇన్ని రోజులు పోరాడింది పారిపోవడానికి కాదు చంభా నేను ఆశపడింది దక్కించుకోవడానికి అమర్‌ చేతితో తాళి కట్టించుకుంటాను.. అని చెప్పగానే.. సార్‌కు నిజం తెలిస్తే తాళి కట్టడం కాదు.. నీ మెడలో ఉరితాడు కడతాడు అనగానే.. మనోహరి చాలా కాన్ఫిడెంట్‌గా నేను చాలాసార్లు తప్పించుకున్నాను.. ఇప్పుడు కూడా అంతే చావో రేవో తేల్చుకుంటాను అంటూ ఇంట్లోంకి వెళ్లిపోతుంది మనోహరి.. చంభా కూడా ఇది చెబితే వినే రకం కాదు దాని చావు దాన్ని చావనివ్వాలి నాకెందుకు అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×