E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today March 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వాప్టింగ్స్‌ చేసుకున్న మిస్సమ్మ – నెల తప్పిందన్న నిర్మల – మనోహరి షాక్‌

Nindu Noorella Saavasam Serial Today March 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వాప్టింగ్స్‌ చేసుకున్న మిస్సమ్మ – నెల తప్పిందన్న నిర్మల – మనోహరి షాక్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  మిస్సమ్మ దగ్గరకు అనామికను తీసుకొచ్చిన రాథోడ్‌ మంగళసూత్రంలో ఏదో ప్రాబ్లం ఉందట చూడమని చెప్తాడు. సరేనని అనామిక చూడబోతుంటే ఇంతలో మనోహరి వస్తుంది. స్వామిజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని కోపంగా రాథోడ్‌ను తిడుతూ.. అనామికను తిడుతుంది. ఏం చేస్తున్నావు తాళిని ఎందుకు ముట్టుకుంటున్నావు. అసలు తాళిని ముట్టుకునే అధికారం నీకెక్కడిది అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మిస్సమ్మ కోపంగా మనోహరి గారు అసలు అనామిక ఏం చేసిందని ఇప్పుడు అంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మనోహరి ఏం చేసిందా..? తాళి ముట్టుకోబోయింది. అనామిక తాళి ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..? అనగానే.. ఏమవుతుందని మిస్సమ్మ కోపంగా అడగ్గానే..

మనోహరి ఆవేశంలో గతం.. తను నీ తాళి ముట్టుకోకూడదు అంతే ఎందుకంటే అది ఆరు తాళి తన జ్ఞాపకంగా మాకు మిగిలిన వస్తువు. దాన్ని ఎవరు పడితే వాళ్లు ముట్టుకోవడం నాకు అసలు నచ్చదు. అంటే ఆరుకు కూడా తన తాళి ఎవరైనా ముట్టుకుంటే అసలు నచ్చేదే కాదు. అందుకే అనామిక మీద అరిచాను.. అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ తను కావాలని ఏమీ ముట్టుకోవడం లేదు. చైన్‌ తెగిపోయేలా ఉందని రాథోడ్‌ చెబితే చూడ్డానికి వచ్చింది. ఇప్పుడు ఏమైందని అంతలా అరిచావు అంటుంది. దీంతో మనోహరి ఏం కాలేదు. అనామిక నువ్వు పైకి వెళ్లు.. నీకు స్పెషల్‌గా చెప్పాలా? రాథోడ్‌.. నువ్వు వెనకేసుకొస్తున్న ఈ అమ్మాయే నీకు వెన్నుపోటు పొడిచి వెళ్తుంది నువ్వు చూస్తూ ఉండు అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీ మనసులో విషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి నీకు చెడుగా కనిపిస్తుంది మను అంటుంది. అయితే చూద్దాం అంటుంటి మనోహరి. చూద్దాంలో అంటూ మిస్సమ్మ వెళ్లిపోతుంది.

Advertisement

గార్డెన్‌లోకి వెళ్లగానే రాథోడ్‌ లో నుంచి గుప్త బయటకు వస్తాడు. పేరుకు మాత్రమే నిండు కుండ రత్తడివి.. ఇచ్చట అంతయూ నిండుగానే ఉన్నది. ఇచ్చట మాత్రం ఏమీ లేదు నిన్ను నమ్ముకున్నందుకు కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అయింది అనుకుంటూ వెళ్లిపోతాడు. రాథోడ్‌ కన్పీజ్‌గా చూస్తూ.. బండి అక్కడ ఆపాను.. ఇక్కడి దాకా వచ్చాను లోపలికి వెళ్లాల్సిన వాడిని ఇక్కడికి ఎందుకు వచ్చాను. ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ఏం జరిగి ఉంటుంది.. అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే.. మనోహరి వచ్చి ఏంటి రాథోడ్‌.. చూస్తూ ఊరుకుంటుంటే.. చాలా ఎక్స్‌స్ట్రాలు చేస్తున్నావు అంటుంది. దీంతో రాథోడ్‌ ఇప్పుడు నేను అంత కానీ పని ఏం చేశాను మేడం అని అడుగుతాడు. ఏం చేశావో.. ఏం చేయడానికి అలా చేశావో నాకు తెలియదు కానీ ఇది ఇంకొక్కసారి రిపీట్‌ అయితే మాత్రం నీకు అసలైన మనోహరిని పరిచయం చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. రాథోడ్‌ మాత్రం ఏమైంది ఈవిడవకు ఇలా మాట్లాడుతుంది. సార్‌ దక్కలేదని మెల్లమెల్లగా పిచ్చి పడుతున్నట్టు ఉంది అనుకుంటూ వెళ్లిపోతాడు.

మనోహరి స్వామిజీ దగ్గరకు వెళ్లి ఆ అనామికను ఇంట్లోంచి పంపించడానికి ఏం చేయాలో తెలియడం లేదు. మీరో ఒక మార్గం చూపించండి అని అడుగుతుంది. దీంతో స్వామిజీ నీకు ఒక మార్గం చెప్పాను కదా..? అంటాడు. ఎంత ట్రై చేసినా ఆపలేకపోతున్నాను అని చెప్తుంది. దీంతో స్వామిజీ నీకున్న సమస్యకు సమాధానం చెప్పలేను కానీ నీకు చాలా తక్కువ సమయం ఉందని మాత్రం చెప్పగలను అంటూ హెచ్చిరిస్తాడు.

Advertisement

ఇంట్లో మిస్సమ్మ వాంప్టింగ్స్‌ చేసుకుంటుంది. మిస్సమ్మను చూసిన నిర్మల సంతోషంగా కంగారుగా వెళ్లి భాగీ కళ్లు తిరుగుతున్నాయా..? అని అడుగుతుంది. మిస్సమ్మ అవును అత్తయ్యా అని చెప్తుంది. దీంతో నిర్మల సంతోషంగా నిజంగానా తల్లి.. అయ్యో నా బంగారు తల్లి నువ్వు ఎక్కువ సేపు నిలబడకూడదు పద లోపలికి పద అంటూ లోపలికి తీసుకెళ్లి.. అమర్‌ను పిలుస్తుంది. కిందకు వచ్చిన అమర్‌ ఏంటమ్మా పిలిచావు అని అడుగుతాడు. నిర్మల నీకొక శుభవార్త చెప్పడానికి పిలిచాను నాన్నా.. ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలు కన్నాను కానీ కళ్ల ముందు ఉండే సరికి కాళ్లు చేతులు ఆడటం లేదు అంటుంది. దీంతో అమర్‌ ముందు విషయం చెప్పు అమ్మా ఏమైంది… అని అడుగుతాడు. దీంతో శివరాం హ్యాపీగా మీ ఆవిడ వాంతులు చేసుకుంది అమర్‌ అని చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. అనామిక కంగ్రాట్స్‌ చెప్తుంది.  అమర్‌ ఆలోచనలో పడిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×