BigTV English

Indian Toy Trains: ఇండియాలో ఇన్ని టాయ్ ట్రైన్స్ ఉన్నాయా? ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

Indian Toy Trains: ఇండియాలో ఇన్ని టాయ్ ట్రైన్స్ ఉన్నాయా? ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

Indian Railways: భారత్ టాయ్ ట్రైన్స్ కు అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ రైళ్లన్నీ కనువిందు చేసే ప్రయాణాన్ని అందిస్తాయి. హిల్ స్టేషన్లు, పర్వత ప్రాంతాల ద్వారా ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తాయి. ఇంతకీ దేశంలో ఉన్న అద్భుతమైన టాయ్ ట్రైన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ కల్కా- సిమ్లా టాయ్ ట్రైన్ (హిమాచల్ ప్రదేశ్)

ఈ రైలు కల్కా నుంచి సిమ్లా వరకు సుమారు 96 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ రైలు 103 సొరంగాలు, 800 కంటే ఎక్కువ వంతెనల మీదుగా ప్రయాణం చేస్తుంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్లో ప్రయాణించాలనుకునే వాళ్లు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్‌ సైట్ లేదంటే మోబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కల్కా, సిమ్లా రైల్వే స్టేషన్ల లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (పశ్చిమ బెంగాల్)

ఈ టాయ్ ట్రైన్  డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురి వరకు ప్రయాణిస్తుంది. సుమారు సుమారు 88 కిలోమీటర్ల పరిధిలో ఈ రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో అద్భుతమైన హిమాలయన్ దృష్టాలు పర్యాటకును మంత్రముగ్ధులను చేస్తాయి. దీనిని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ రైలు ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులు IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. లేంటే డార్జిలింగ్ రైల్వే స్టేషన్‌ లోనూ టికెట్లు తీసుకోవచ్చు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే (తమిళనాడు)

ఈ రైలు మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు.. సుమారు 46 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో దట్టమైన అడవులు, తేయాకు తోటలు, అందమైన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రయాణం చేయాలనుకునే వాళ్లు IRCTC వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మెట్టుపాళ్యం, ఊటీ రైల్వే స్టేషన్ లోనూ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

Read Also: దేశంలో అత్యంత పురాతనమైన రైళ్లు ఇవే.. ఎన్నేండ్ల క్రితం పట్టాలెక్కాయో తెలుసా?

⦿ కాంగ్రా వ్యాలీ రైల్వే (హిమాచల్ ప్రదేశ్)

ఈ రైలు పఠాన్‌ కోట్ నుంచి జోగిందర్ నగర్ వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 164 కిలోమీటర్ల మేర ఈ రైల్వే మార్గం విస్తరించి ఉంది. ఈ రూట్ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించిన సుందరమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే, ఇతర టాయ్ ట్రైన్లతో పోల్చితే ఇక్కడ రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. IRCTC వెబ్ సైట్ లేదంటే నేరుగా రైల్వే స్టేషన్ లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ మాథెరన్ హిల్ రైల్వే (మహారాష్ట్ర)

నేరల్ నుంచి మాథెరన్ వరకు 21 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవచ్చు. తక్కువ పరిధి అయినా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాథెరన్ టాయ్ ట్రైన్ సాంప్రదాయ ట్రాక్ ఉపయోగించకుండా నడుస్తుంది. ఇది పశ్చిమ కనుమలకు సంబంధించిన ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. ఈ రైల్లో ప్రయాణించాలంటే మాథెరన్ రైల్వే అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read Also:  దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!

Tags

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×