E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: లాల్ సింగ్ గురించి భయపడుతున్న అమర్ 

Nindu Noorella Saavasam Serial Today march 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: లాల్ సింగ్ గురించి భయపడుతున్న అమర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఫోటో ముందు నిలబడి ఏడుస్తున్న అమ్ము దగ్గరకు వెళ్లిన బుజ్జమ్మ అచ్చం ఆరులా అమ్ము అని పిలుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. బుజ్జమ్మ మాత్రం ఆరులా మాట్లాడుతూ అమ్ము  మా అందరికి దూరంగా వెళ్తున్నానని బాధపడకు డాడీకి మంచి పేరు తీసుకురావాలి. నీ మీద డాడీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు సరేనా అని చెప్తుంటే.. అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ఎమోషనల్‌ అవుతారు.. మిస్సమ్మ రాథోడ్‌ దగ్గరకు వెళ్లి బుజ్జమ్మ మాట్లాడుతుంటే సాక్ష్యాత్తు మా అక్క మాట్లాడినట్టే ఉంది కదా రాథోడ్‌.. అని చెప్పగానే.. రాథోడ్‌ హ్యాపీగా మరి బుజ్జమ్మ మళ్లీ పుట్టిన అరుంధతి అమ్మే కదా మిస్సమ్మ అని చెప్తాడు.. అమర్‌ కూడా మనసులో బుజ్జమ్మ మాట్లాడుతుంటే ఆరు గొంతులా వినిపిస్తుందేంటి..? బహుషా ఆరు బతికి ఉంటే ఇలాగే చెప్పేదేమో..? అనుకుంటాడు..

ఇక బుజ్జమ్మ మాత్రం ఏడవకుండా బాధపడకుండా వెళ్లు.. సంతోషంగా చదువుకో.. నీతో రోజూ ఫోన్‌ లో మాట్లాడతాను. అప్పుడప్పుడు నిన్ను చూడటానికి కూడా వస్తాను.. నీకేం భయం లేదు.. మేమంతా నీకు ఉన్నాము.. అని చెప్తుంది. యాదమ్మ మాత్రం ఆశ్చర్యంగా ఏంటి మనోహరి ఆ పిల్ల పెద్ద ఆరిందలా మాట్లాడుతుంది అనగానే.. మనోహరి కూడా ఆశ్చర్యంగా అది ఆరిందా కాదు మళ్లీ పుట్టిన అరుంధతి.. పై చదువులకు వెళ్తున్న కూతురుకు సెండాఫ్ ఇస్తుంది అంటూ చెప్తుంది. ఇంతలో అమ్ము ఏడుస్తూ.. బుజ్జమ్మను హగ్‌ చేసుకుని థాంక్యూ అమ్మ అంటుంది. అందరి దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతూ.. బయలుదేరుతాను అంజు అంటూ హగ్‌ చేసుకుంటుంది. బై ఆనంద్‌.. బై ఆకాష్‌.. మీరు కూడా బాగా చదువుకోండి.. వెళ్లోస్తాను మిస్సమ్మ అని చెప్పగానే..

Advertisement

మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతూ.. నువ్వు దూరంగా వెళ్లిపోతున్నాను అనుకోకు మేము ఫోన్‌లో టచ్లో ఉంటాం.. నువ్వు మాత్రం చదువు మీద కాంసట్రేట్‌ చేయ్‌.. అంటూ చెప్తుంది. ఇంతలో అమర్‌ ఫ్లైట్‌కు టైం అవుతుంది అమ్ము వెళ్దాం అని చెప్పగానే.. అమ్ము ఏడుస్తూ.. డాడ్‌ ఐ మిస్‌ యూ.. అంటుంది. అమర్‌ కూడా అమ్ము నేను మిమ్మల్ని డిసిప్లిన్‌ గా పెంచినా మీరంటే నాకు ప్రాణం ముఖ్యంగా నువ్వంటే.. నాకెంతో ఇష్టం అమ్ము.. నిన్ను అంత దూరం పంపించడం నాకు ఇష్టం లేదు.. కానీ మీ అమ్మ ఆవ నువ్వు నెరవేర్చాలి అంటే నువ్వు తప్పకుండా వెళ్లాలి  అని చెప్పి అమ్మును తీసుకుని వెళ్లి డిల్లీలో స్కూల్‌లో జాయిన్‌ చేసి వస్తాడు అమర్‌.

ఎయిర్‌ఫోర్ట్‌ నుంచి ఇంటికి వచ్చిన అమర్‌కు తన ఫ్రెండ్‌ లాల్‌ సింగ్‌ ఫోన్‌ చేస్తాడు. అమర్‌ ఎలా ఉన్నావురా..? ఎక్కడ ఉన్నావురా..? అంటూ యోగక్షేమాలు అడగ్గానే.. లాల్‌ సింగ్‌ బాగానే ఉన్నానని హైదరాబాద్ వైఫ్‌తో వచ్చానని ఇంకో రెండు గంటల్లో మీ ఇంటికి వచ్చానని చెప్తాడు. దీంతో అమర్‌ టెన్షన్‌ పడుతుంటాడు. అప్పుడే రాథోడ్‌ వచ్చి ఏంటి సార్‌ టెన్షన్‌ పడుతున్నారు.. ఫోన్‌లో ఎవరు మాట్లాడింది అని అడగ్గానే.. అమర్‌ లాల్‌ సింగ్‌ గురించి చెప్తాడు.  దీంతో రాథోడ్‌ ఆయన వస్తే మీరెందుకు సార్‌ టెన్షన్‌ పడుతున్నారు అని అడగ్గానే.. లాల్‌సింగ్‌కు తన గురించి అన్ని విషయాలు తెలుసని అయితే నేను భాగీ విడిపోయామని.. మాకు పుట్టిన పాప ఎక్కడుందో తెలియదు అని లాల్‌సింగ్‌కు తెలిస్తే బాడ్‌గా ఉంటుంది అని అమర్‌ చెప్పగానే..

Advertisement

ఓస్‌ దానికి టెన్షన్‌ ఎందుకు సార్‌ లాల్‌సింగ్‌ ఇక్కడ ఉన్నన్ని రోజులు బుజ్జమ్మ మీకు మిస్సమ్మకు పుట్టిన కూతురు అని చెప్పండి అంటూ ఐడియా ఇస్తాడు రాథోడ్‌. దీంతో అమర్‌ సరే అలాగే కానిద్దాం. రాథోడ్‌ నువ్వెల్లి విషయం భాగీకి చెప్పు అనగానే.. నేనెందుకు సార్‌ మీరు చెబితేనే బాగుంటుంది అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు. అమర్‌ వెళ్లి మిస్సమ్మకు విషయం చెప్తాడు. ఇంతలో లాల్‌సింగ్‌ వస్తాడు. మిస్సమ్మ గురించి అడగ్గానే.. అమర్‌ మిస్సమ్మను పిలుస్తాడు. మిస్సమ్మ చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయి కిందకు వస్తుంటుంది. అమర్‌ కూడా కళ్ల తిప్పుకోకుండా చూస్తుంటాడు.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×