BigTV English

Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మాయాపేటిక చూసి షాకైన గుప్త – అమర్‌ కు సపోర్టుగా నిలబడ్డ మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మాయాపేటిక చూసి షాకైన గుప్త – అమర్‌ కు సపోర్టుగా నిలబడ్డ మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode :  అమర్‌ ఇంట్లో ఏదో అశుభం జరగబోతుందని గుప్త అనుకుని మాయా దర్పణంలో చూడాలని మంత్రం చదవగానే మాయా దర్పణం వస్తుంది. అది ఓపెన్‌ చేసి చూడగానే జరగబోయేది అందులో కనిపిస్తుంది. అది చూసిన గుప్త షాక్‌ అవుతాడు. హతవిధి ఒక్క రోజులో ఇంత విధ్వంసం జరగబోతుందా..? అని భయపడతాడు. ఇంతలో ఆరు వచ్చి గుప్తను మీకు కొంచెం మెంటల్‌ ఉంది కానీ మంచివారే.. అరుస్తారు.. కరుస్తారు.. చిరాకుపడతారు కానీ చెప్పిన పని చేస్తారు. నేను అడిగానని మాయా పేటిక తెప్పించి మళ్లీ ఆలోచిస్తున్నారా..? అంటూ మాయా పేటిక చూడబోతుంటే వద్దని ఇది నువ్వు వీక్షించరాదు.. మేము మాత్రమే వీక్షించాలి. మాయా పేటికను మానవులు వీక్షించరాదు అంటాడు గుప్త.


అయితే నేను మానవురాలిని కాదు కదా..? నేనోక ఆత్మను ఇటివ్వండి అంటూ తీసుకోబోతుంటే.. బాలిక మాయా పేటిక విషయంలో చమత్కారం వలదు. జరుగుతున్నది వీక్షించాలి తప్పా జరగబోయేది వీక్షించాలి అనుకోకూడదు అంటాడు గుప్త. దీంతో సరే మీరు ఆ పేటికలో ఏం చూశారో చెప్పండి అని ఆరు అడుగుతుంది. దీంతో గుప్త నేనేమీ వీక్షించలేదు అంటాడు. ఆరు భయంగా ఏంటి గుప్త గారు మాట ఒకటి వస్తుంది. మీ ముఖం ఇంకోలా ఉంది మ కుంటుంబంలో ఎవరికైనా ఏమైనా అవుతుందా..? అని అడుగుతుంది. ముందు నేను చెప్పను అన్న గుప్త.. ఆరు బతిమాలడంతో చెప్తాను. కానీ నువ్వు మా లోకానికి తక్షణమే వస్తానని మాటిస్తే.. చెప్తాను అంటాడు గుప్త. ఆరు కుదరదని నేన మాటివ్వలేను అంటుంది.

ఇంతలో స్కూల్‌ నుంచి పిల్లలు డల్లుగా వస్తారు. వాళ్లను చూసి దగ్గరకు వెళ్తుంది ఆరు. పిల్లలు ఇంట్లోకి వస్తారు. అమర్‌ వాళ్లను చూసి ఏమైందని అడుగుతాడు. మిస్సమ్మ వచ్చి ప్రెష్‌ అయి రండి స్నాక్స్‌ పెడతాను అంటుంది. పిల్లలు పలకకుండా ఉండిపోతారు. ఇంతలో రాథోడ్‌ సార్‌ మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. అమర్‌ చెప్పమని అడుగుతాడు. ఈరోజు అంజు పాప మీద కిడ్నాప్‌ అంటెప్ట్‌ జరిగింది అని రాథోడ్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ భయంగా ఏమైంది అంజు అని అడుగుతాడు. అంజు స్కూల్‌ లో జరిగింది చెప్తుంది. మిస్సమ్మ భయంతో ఏడుస్తూ అంజును హగ్‌ చేసుకుంటుంది. అంజు నీకేం కాలేదు కదా..? దెబ్బలు ఏం తగల్లేందు కదా..? అంటూ ఏడుస్తుంది. అంజు కూడా ఏడుస్తూ మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది.  నేను బాగానే ఉన్నాను అంటుంది అంజు.


ఇంతలో నిర్మల.. అంజు పాపను హాస్పిటల్‌ కు తీసుకెళ్దాం అంటుంది. అంజు భయపడింది మళ్లీ జ్వరం వస్తుందేమో అంటే ఎందుకు నాన్నమ్మ హాస్పిటల్‌ కు నేనేం భయపడలేదు అని చెప్తుంది. శివరాం మాత్రం ఇంత మాత్రం దానికే ఈ పొట్టిది భయపడతుందా..? వాళ్లనే బెదిరిస్తుంది అంటాడు. ఇంతలో అమ్ము డల్లుగా చూస్తుంటే..ఏమైంది అమ్ము అలా చూస్తున్నావు అంటూ మిస్సమ్మ అడుగుతుంది. ఎల్లుండి ఎక్స్‌ కర్షన్‌ కు వెళ్దామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇప్పుడు వెళ్లకపోతే క్లాస్‌ లీడర్‌గా నన్ను తీసేస్తుంది అని అమ్ము చెప్పగానే మనోహరి కోపంగా ఏయ్‌ ఇక్కడ ప్రాణాలే పోతుంటే.. పోస్ట్‌ పోతుంది అటారేంటి..? అంటూ కోప్పడుతుంది.

పోతే పోయింది వెదవ పోస్ట్‌, అదేదో ప్రెసిడెంట్‌ పోస్ట్‌ లా ఫీలవుతున్నారేంటి..? అనగానే మిస్సమ్మ  కోపంగా మనోహరిని పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మనం చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకునే వయసు, అనుభవం వాళ్లకు లేదు. మనమే కొంచెం నిదానంగా అర్థం అయ్యేలా చెప్పాలి అంటూ క్లాస్‌ తీసుకుంటుంది.  ఇంకొకసారి పిల్లల గురించి ఇలా మాట్లాడితే నేను ఇంత మంచిగా మాట్లాడను మనోహరి గారు. ఎక్స్‌ కర్షన్‌ ఎల్లుండి రేపే ఆయన వాళ్లను పట్టుకుంటే ఎల్లుండి హ్యాపీగా పంపొచ్చు అంటుంది మిస్సమ్మ. దీంతో రాథోడ్‌ విజిల్‌ వేస్తూ.. ఏం చెప్పావు మిస్సమ్మ.. నువ్వు సూపర్‌.. అంటాడు. ఒకవైపు భర్త సామర్థ్యాన్ని పొగుడుతూనే పిల్లలకు మంచి బూస్ట్‌ ఇచ్చావు మిస్సమ్మ నువ్వు సూపర్‌ అంటాడు శివరాం.

రామ్మూర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. మిస్సమ్మ ఫోన్‌ చేస్తుంది. పిల్లుల ఇంటికి వచ్చారా..? అమ్మా అని రామ్మూర్తి అడుగుతాడు. అసలు అంజలి పాపను ఎందుకు కిడ్నాప్‌ చేయాలనుకున్నారు. అని అడగ్గానే..ఈ విషయం మీకు ఎలా తెలిసింది నాన్నా అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో రామ్మూర్తి కంగారుపడుతూ.. ఇంతకు ముందు రాథోడ్‌కు ఫోన్‌ చేశానని చెప్తాడు. సరే మీరు ఇంటికి రండి అని చెప్తుంది మిస్సమ్మ. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు తల్లి.. అనగానే సరే నాన్నా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్‌ చేయండి అని చెప్తుంది.

ఇంట్లో అందరూ భయంగా గడుపుతుంటారు. మనోహరి భయంతో ఎప్పుడు ఎవడు ఎటు నుంచి వచ్చి అటాక్‌ చేస్తారోనని భయంగా ఉంది. అసలు ఇదంతా ఆ పిల్ల రాక్షసి వల్లే అనుకుంటూ భయపడుతుంది. మరోవైపు నిర్మల భయపడుతుంటే శివరాం ధైర్యం చెప్తాడు. నువ్వేం భయకు అమర్‌ ఉన్నాడు కదా.. అని చెప్తాడు. పైన రూంలో పిల్లలు కూడా భయపడుతుంటారు. మిస్సమ్మ వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

Related News

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Big Stories

×