trinayani serial today Episode: నయని కాదని నిరూపించడానికి గాయత్రి పాపకు పాలల్లో మత్తు మందు కలిపానని నిజం చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో విక్రాంత్ ఎంత పని చేశావు అమ్మా అంటూ తిడుతుంటే..వదిలేయరా.. మీ అమ్మ చేసిన పనికి మా అమ్మ శిక్షించింది కదా..? అంటాడు. ఇంతలో గాయత్రి దేవి కూడా కాసేపట్లో పాపకు స్పృహ రాబోతుందని నేను వెళితే తప్పా తను కళ్లు తెరవదని వెళ్లిపోతుంది గాయత్రిదేవి.
గాయత్రిదేవి కొట్టిన దెబ్బల నొప్పికి ఏడుస్తుంది తిలొత్తమ్మ. ఇంతలో వల్లభ వచ్చి రిలాక్స్ మమ్మీ శ్వాస మెల్లగా తీసుకుని బయటకు వదులు అంటూ చెప్తుంటే.. అసలు సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా..? అంటూ తిడుతుంది తిలొత్తమ్మ. సరే మమ్మీ నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతాడు. దీంతో గాయత్రి అక్క రెండో సారి వచ్చినప్పుడు రాలేదని చెప్పకుండా ఉండాల్సింది అంటుంది తిలొత్తమ్మ.
దీంతో అబద్దం ఎందుకు చెప్పావు అంటూ వల్లభ అడుగుతాడు. నయనిని ఇరికిద్దామని చూస్తే అదే నన్ను ఇరికించింది అంటుంది తిలొత్తమ్మ. మమ్మీ నీకు ఎప్పుడో చెప్పాను. ఎవరితోనైనా పెట్టుకో కానీ పెద్ద మరదలుతో పెట్టుకోవద్దని వినావా..? అంటాడు వల్లభ. అవునురా.. నయని కాదని నిరూపిస్తే అప్పుడు అది నా కాళ్ల బేరానికి వస్తుందని అనుకున్నాను. అప్పుడు ఆస్తులన్నింటిని నా చేతుల్లోకి తీసుకుందామనుకున్నాను అంటుంది.
విక్రాంత్ రూంలోకి వెళ్లి లాప్ టాప్ వెతుకుతాడు.. సుమనను అడిగితే తనకు తెలియదు అంటుంది. కాస్త నన్ను కోలుకోనివ్వండి అంటుంది. ఎందుకు ఒంట్లో బాగాలేదా..? అని విక్రాంత్ అడగ్గానే.. ఇంట్లోనే బాగాలేదు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్తుంది. అసలు విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు విక్రాంత్. పెద్దత్తయ్యను మా అక్క చూసింది కదా..? అవును నయని వదిన అయితేనే చూస్తుంది అని విక్రాంత్ చెప్తాడు. దీంతో అంటే నయని అక్కా అని ఒప్పేసుకోవాల్నా..? అంటుంది సుమన. అదే మంచిదేమో అంటాడు విక్రాంత్. నిజమే.. లేదంటే తిలొత్తమ్మ అత్తయ్యన బాదినట్టు నన్ను బాదేస్తారేమో అంటూ భయపడుతుంది.
విశాల్ వాళ్ల ఇంటకి ఇచ్చిన గురువుగారు నేత్రి ఎలా ఉందో చూద్దామని వచ్చాను అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తిలొత్తమ్మ ఇప్పుడు త్రినేత్రి కాదు త్రినయని అంటూ చెప్తుంది. ఇదేంటి అలా మాట మార్చారని అలా చూడకండి ఇందాకే నేను మా మమ్మీ కష్టపడి పెద్ద మరదలును మర్చేశాం అంటాడు. అది వీళ్ల ఘనత అనుకుంటున్నారు కానీ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తర్వాత మెల్లగా కోలుకుంటుందని తెలుసు అంటుంది. ఇంతలో విశాల్ వచ్చి నేను ఎప్పుడు తనను వేరు అనుకోలేదని చెప్తాడు. అయితే తను నయని కాదా..? అనేది మీలో మీరు అనుకోవడం కాదు. నయని తనను తాను గుర్తించిందా..? లేదా..? అన్నదే ముఖ్యం అని చెప్తాడు.
ఇంతలో దురందర గాయత్రి అక్క ఆత్మ వచ్చిన తర్వాత నయని మంచిగా అయింది అని చెప్తుంది. గాయత్రి దేవి వచ్చిందా…? అంటూ గురువుగారు అడుగుతారు. అవునని అక్క రాగానే నయని మామూలు మనిషిగా మారిపోయింది అని చెప్తుంది హాసిని. ఇంతలో అక్కడికి నయని వస్తుంది.. గాయత్రి దేవి ఆత్మను నువ్వు చూశావా నయని అని అడుగుతాడు. చూశానని నయని చెప్తుంది. ఏ టైంకి చూశావని అడగ్గానే నయని ఆలోచిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటలకు అని విక్రాంత్ చెప్తాడు. ఇప్పుడు ఆరు కావోస్తుంది అంటాడు పావణమూర్తి. అయినా ఈ టైం లెక్కలు ఎందుకు గురువుగారు అంటూ సుమన అడుగుతుంది. స్వామిజీకి నా గురించి తెలిసిపోయిందా..? అని మనసులో అనుకుంటుంది. ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉంది. నేను త్రినేత్రిలా మారితే బాబుగారిని ఏమనుకుంటారో ఏమో అని మనసులో అనుకుంటుంది.
ఏం ఆలోచిస్తున్నావు నయని అని గురువుగారు అడుగుతారు. కొంచెం తల నొప్పిగా ఉందని నేను వెళ్లి పడుకుంటానని వెళ్లబోతుంటే.. ఆగు నయని నీకు సుస్తిగా ఉన్నప్పుడు అందరిలో ఉంటేనే సేద తీరినట్టు ఉంటుంది అని చెప్తాడు. ఇంతలో పావణమూర్తి ఆరు గంటలు అయింది. దీపారాధన చేయాల్సింది హాసిని అమ్మా అంటాడు. ఇంతలో నయని నేత్రిలా మారిపోతుంది. మళ్లీ నేత్రిలా మాట్లాడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో గురువు గారు నేత్రిని పిలిచి చేతికి గడియారం పెట్టుకునే అలవాటు ఉందా..? నీకు అని అడుగుతాడు. లేదని చెప్తుంది నేత్రి. ఇష్టం లేనప్పుడు వాచ్ ఎందుకు పెట్టుకున్నావు చెల్లి అని అడుగుతుంది హాసిని.
తన చేతికి ఉన్న వాచ్ చూసి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది నేత్రి. దీంతో విక్రాంత్ ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు అంటూ దగ్గరకు వెళ్లి విశాల్ బ్రో అంటే నాకు ప్రాణం మా వదిన అంటే మాకు దేవత అలాంటి మా వదినలా వచ్చి ఇంత బాగా నటించడానికి మీరెవరు అంటూ నిలదీస్తాడు విక్రాంత్. మర్యాదగా కాదు అసలు ఎవరు నువ్వూ అంటూ కోప్పడతాడు. దీంతో అనాలోచితంగా ఆవేశపడకు విక్రాంత తను నయనియే అంటాడు గురువుగారు. దీంతో నేత్రి నేను నయని కాదు అంటుంది. అవును నువ్వు త్రినేత్రివే అంటాడు గురువు. దీంతో తిలొత్తమ్మ ఏంటి గురువుగారు మీరు గాలి ఎటు వీస్తే అటు మాట్లాడుతున్నారు అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?