E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మిస్సమ్మ ల మధ్య గొడవ

Nindu Noorella Saavasam Serial Today october 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మిస్సమ్మ ల మధ్య గొడవ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ తన మనుషులతో అమర్‌ కిడ్నాప్‌ చేసి చంపబోతుంటే.. అమర్‌ బాడీలోకి ఆరు ఆత్మ వెళ్లి అందరిని కొడుతుంది. ఆ విషయం తెలిసి గుప్త షాక్‌ అవుతాడు. మనోహరిని పట్టుకోవాలని అమరేంద్ర వేసిన పథకాన్ని అరుంధతి తన చేజేతులారా పాడు చేయుచున్నది అని అనుకుంటాడు. మరోవైపు అమర్‌లో దూరిని ఆరును చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. ఇక ఆరు దెబ్బకు చంభా అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతుంది. ఆరు కోపంగా రణవీర్‌ను చూస్తుంటే.. రణవీర్‌ కత్తితో అమర్‌ను పొడిచేందుకు ట్రై చేస్తాడు. ఇంతలో తప్పించుకున్న ఆరు రణవీర్‌ను కొడుతుంది.

రణవీర్‌ చేతిలో కత్తి లాక్కుని రణవీర్‌ను చంపబోతుంది. ఇంతలో గుప్త వచ్చి ఆరును ఆపేస్తాడు. బాలిక ఆగుము.. నీ పతి దేవుని శరీరము వదిలి బయటకు వచ్చేయ్‌ అని చెప్తాడు. గుప్తగారు వదలండి.. ఒక్కసారి వదిలేయండి అంటూ బతిమాలుతుంది. అయినా వినకుండా గుప్త తన మంత్ర శక్తితో ఆరు ఆత్మను కట్టడి చేస్తాడు. దీంతో ఆరు ఆత్మ అమర్ లోంచి బయటకు వస్తుంది. అమర్‌ స్పృహ తప్పి పడిపోతాడు. చంభా, రణవీర్‌ అక్కడి నుంచి పారిపోతారు. మనోహరి వెళ్లిపోతుంది. తర్వాత రాథోడ్‌ వచ్చి అమర్‌ను ఇంటికి తీసుకెళ్తాడు.

Advertisement

మరుసటి రోజు గార్డెన్‌లో ఉన్న ఆరు మిస్సమ్మను పిలుస్తుంది. మిస్సమ్మ గార్డెన్‌లోకి రాగానే.. ఆరు ఎమోషనల్‌ అవుతుంది. మిస్సమ్మ మాత్రం ఎందుకు అలా చేశావు. నువ్వు ఆయనలో దూరకుండా ఉండి ఉంటే ఆయనకు నిజం తెలిసి ఉండేది.. ఈ పాటికి మనోహరి గురించి ఆయనకు నిజం తెలిసి ఉండేది. ఆయనే మనోహరిని ఇంట్లోంచి వెళ్లగొట్టేవారు. ఈ ఇంటికి పట్టిన పీడ విరగడయ్యేది.. నువ్వు తొందరపడ్డావు అక్కా.. ఆయనను కిడ్నప్‌ చేయడానికి ఆయనేం మామూలు వ్యక్తి కాదు కదా అక్కా ఆయన ప్లాన్‌ ప్రకారమే రణవీర్ కు దొరికారు. రణవీర్‌ కిడ్నాప్‌ చేస్తాడని ఆయనకు ముందే తెలుసు.. కిడ్నాప్‌ చేశాక అక్కడికి రణవీర్ వైఫ్‌ అదే మను వెళ్లేది. ఆ నిజం ఆయనకు తెలిసేది.. ఇప్పుడు ఆయనకు నిజం తెలియకుండా అయిపోయింది అంటూ మిస్సమ్మ చెప్తుండగానే..

ఆరు ఎమోషనల్ అవుతుంది. సరే భాగీ ఆ విషయం వదిలేయ్‌.. నువ్వు నాకో సాయం చేయాలి. ఇది ఎవ్వరికీ చెప్పకూడదు.. చెప్పకుండా చేయాలి.. చేస్తావా..? చెల్లి.. అంటూ ఆరు అడగ్గానే.. ఏంటో చెప్పు అక్కా.. నేను ఎవ్వరికీ చెప్పను.. అంటుంది ఆరు. ఆయనకు కూడా ఈ విషయం తెలియకూడదు మిస్సమ్మ… తెలిస్తే ఆయన నిన్ను ఈ పని చేయనివ్వడు అంటుంది ఆరు. ఆయనకు చెప్పకుండా చేయాలా… ఇంతకీ ఏం చేయాలో చెప్పు అక్క.. అని అడగ్గానే..  రేపు ఉదయం 9 గంటల  నుంచి 11 గంటల మధ్య మంచి గడియలు ఉన్నాయి.. ఆ గడియల్లో నా ఆస్థికలు గంగలో కలిపితే వెంటనే నాకు మళ్లీ జన్మ వస్తుంది. భాగీ.. అని ఆరు చెప్పగానే..

Advertisement

మిస్సమ్మ బాధగా నేను ఆ పని చేయలేను అక్కా.. అది కూడా ఆయనకు తెలియకుండా చేయాలంటే.. నా వల్ల కాదు అక్క.. సారీ అక్క నన్ను క్షమించు ఈ విషయంలో నేను నీకు హెల్ప్‌ చేయలేను.. అంటూ మిస్సమ్మ చెప్తుండగానే.. ఆరు ఎమోషనల్‌ అవుతూ అది కాదు భాగీ.. నేను చెప్పేది విను.. నేను మళ్లీ జన్మించాలి అంటే నా ఆస్థికలు గంగలో కలపాలి.. ఆయనకు ఆస్తికలు గంగలో కలపడం ఇష్టం లేదు.. నువ్వే ఎలాగైనా కలపాలి భాగీ.. అంటూ ఆరు అడిగినా కూడా మిస్సమ్మ నా వల్ల కాదు అక్క అంటుంది. దీంతో ఆరు ఉక్రోషంగా మిస్సమ్మ చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుని నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే అని చెప్తుంది. దీంతో అక్కా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి..? అక్కా అంటూ ఏడుస్తుంది. ఆరు కూడా ఫ్లీజ్‌ భాగీ నా కోసం చేయ్‌.. కాదనకు అంటూ ఏడుస్తుది. అక్కా అంటూ ఆరును హగ్‌ చేసుకుంటుంది మిస్సమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×