NZ-W vs Ban-W: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025 ) భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 10 మ్యాచ్ లు పూర్తిగా ఇవాళ 11వ మ్యాచ్ జరగనుంది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ( Barsapara Cricket Stadium, Guwahati ) ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025 ) భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ( New Zealand Women vs Bangladesh Women ) మహిళల జట్ల మధ్య బీకర ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. రెండున్నర గంటలకే టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌహతిలో ఇవాళ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే వర్షం పడితే పరిస్థితులు మారిపోతాయి. అలాంటప్పుడు ఛేజింగ్ చేసే జట్టుకు ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
వన్డే మహిళ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో పాయింట్ల పట్టిక చాలా అ కీలకంగా మారింది. ఇందులో టాప్ ఫోర్ లో ఉన్న జట్లు మాత్రమే ముందుకు వెళ్తాయి. దీనికోసం జట్లన్నీ గట్టిగానే పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టు ఐదు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత నాలుగు పాయింట్లు తో ఇంగ్లాండ్ అనంతరం టీమిండియా పోటీ పడుతున్నాయి. ఇక నాలుగో స్థానంలో సౌత్ ఆఫ్రికా నిలిచింది. బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉండగా శ్రీలంక ఆరో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ చిట్ట చివరన ఉన్నాయి.
న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(w), జెస్ కెర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, బ్రీ ఇల్లింగ్
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI: రుబ్యా హైదర్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, మరుఫా అక్టర్, శంజిదా అక్టర్ మేఘలా