E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి శాడిజానికి భయపడ్డ రణవీర్‌

Nindu Noorella Saavasam Serial Today october 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి శాడిజానికి భయపడ్డ రణవీర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ మీద కోపంతో రణవీర్‌ ఇంటికి వెళ్తుంది మనోహరి. అక్కడే ఉన్న మిస్సమ్మ ఫోటోను చూసి కత్తితో పొడుస్తుంది. శాడిజంగా చూస్తూ.. చావవే చావు అంటూ కసితో ఫోటోను పొడుస్తుంటే.. ఇంతలో అక్కడికి రణవీర్‌ వస్తాడు. ఏంటి   మనోహరి నువ్వు చేస్తున్న పనేంటి అసలు..పిచ్చి పట్టిందా నీకు.. మిస్సమ్మను డైరెక్టుగా పొడవలేక ఇండైరెక్టుగా ఫోటోను పొడుస్తూ శాటిఫై అవుతున్నావా..? నువ్వు ఎంత పొడిచినా ఫోటోకు చిల్లు పడుతుంది తప్పా భాగీ ఒంట్లో నుంచి చుక్క రక్తం కూడా బయటకు రాదు మనోహరి అంటూ రణవీర్‌ చెప్పగానే.. ఏంటి రణవీర్‌ నా చేతలు నీకు కామెడీగా ఉన్నాయా..? అంటూ కోపంగా చెప్తుంది మనోహరి.

దీంతో రణవీర్‌ కూడా కోపంగా  అవును నువ్వు చేస్తుంది చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పు.. నాతో కోల్‌కతా వచ్చేసెయ్‌.. నా ఎక్స్‌ వైఫ్‌గా నా ఇంట్లో హ్యాపీగా ఉండు.. నిన్ను అక్కడ నేను మహారాణిలా చూసుకుంటాను అంటాడు రణవీర్‌. దీంతో మనోహరి మరింత కోపంగా రణవీర్‌ను చూస్తూ.. నేను ఇన్నిరోజులు ఇంత కష్టపడింది. అన్ని వదిలేసి నీతో రావడానికి అనుకున్నావా..? రణవీర్‌ అంటుంది. దీంతో  నువ్వు ఇంక ఎన్ని రోజులు కష్టపడినా అమరేంద్ర నీకు దక్కడు. తన మీద ఆశలు వదిలేసుకో.. మనోహరి అని చెప్తాడు రణవీర్‌. అది జరగని పని రణవీర్‌. నేను కోరుకున్నది నాకు ఎలాగైనా దక్కాలి. నాకు అమర్‌పై ప్రేమ కన్నా అరుంధతిపై పగే ఎక్కువ. అందుకే దాన్ని చంపేశాను. అరుంధతి చచ్చాక దాని స్థానంలోకి భాగీ వచ్చింది. ఇప్పుడు అది కూడా తల్లి కాబోతుంది. దాన్ని వదిలిపెట్టను అరుంధతి లాగా దాన్ని చంపేస్తాను అంటూ కోపంగా చెప్తుంది మనోహరి.

Advertisement

రణవీర్‌ వెటకారంగా నవ్వుతూ..  భాగీని నువ్వు ఏమీ చేయలేవు మనోహరి అంటాడు. దీంతో మనోహరి కసిగా చూస్తూ.. ఏయ్‌ ఎందుకు చేయలేను చెప్పు.. ఎందుకు చేయలేను అంటూ అడుగుతుంది.. ఇన్నాళ్లు ఏం చేశావని ఇప్పుడు కొత్తగా ఏదో చేయడానికి అంటాడు రణవీర్‌. ఇన్నాళ్లు ఆరుంధతి ఆత్మ ఆ భాగీ పక్కనే ఉంది. అందుకే దాన్ని ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఆత్మ పైకి వెళ్లిపోయింది. ఇప్పుడు దాన్ని చంపడానికి ఏ అడ్డూ లేదు అని చెప్తుంది మనోహరి. భాగీ పక్కన అరుంధతి ఆత్మ మాత్రమే లేదు. అమరేంద్ర కూడా ఉన్నాడు.. ఆ విషయం మర్చిపోవద్దు నువ్వు మనోహరి అని రణవీర్‌ చెప్పగానే.. ఉంటే ఏంటి..? ఆ గోడను బద్దలుకొట్టుకుని మరీ ఆ ఇద్దరినీ లేపేస్తాను అంటుంది మనోహరి. అయితే రణవీర్‌ ఆశ్చర్యంగా ఇద్దరినీ అంటే అమరేంద్రను కూడా లేపేస్తావా..? అని అడగ్గానే.. అమర్‌ను కాదు.. భాగీని దాని కడుపులో ఉన్న బిడ్డను..అని చెప్తుంది మనోహరి.

మనోహరి మాటలకు రణవీర్‌ నవ్వుకుని బాగుంది ఉట్టికి ఎగురలేనిది. స్వర్గానికి ఎగురుతుంది అన్నట్టు భాగీనే చంపలేకపోయావు..ఇప్పుడు తన కడుపులో బిడ్డను చంపుతావా..? అంటాడు. దీంతో మనోహరి  నన్ను తక్కువ అంచనా వేయకు రణవీర్‌ నా గురించి నీకు తెలసింది చాలా తక్కువ అంటుంది. దీంతో  నువ్వే అమరేంద్రను తక్కువ అంచనా వేస్తున్నావు. ఇన్నాళ్లు ఒట్టి మనిషి అయిన భాగీ మీద ఈగ వాలకుండా చూసుకున్నాడు. ఇప్పుడు తను కడుపుతో ఉందని తెలిశాక కంచెలా కాపాడుకుంటాడు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అని రణవీర్‌ చెప్పగానే.. అరుంధతి లేకపోతే భాగీని కాపాడుకోవడం అమర్‌ వల్ల అస్సలు కాదు రణవీర్‌ అనగానే.. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. తను దేశాన్ని కాపాడే లెఫ్టినెంట్‌..  అలాంటి వాడు సొంత భార్యను కాపాడుకోలేడా..? అంటాడు రణవీర్‌.

Advertisement

అయితే అప్పట్లో అరుంధతిని కాపాడుకోగలిగాడా..? ఇప్పుడు భాగీ పరిస్థితి కూడా అంతే. ఆ స్థానంలోకి నేను తప్ప ఎవ్వరు వచ్చినా వాళ్ల పరిస్థితి కూడా అంతే చూస్తూ ఉండు రణవీర్‌ నేను అనుకున్నది చేసి చూపిస్తాను.. అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. మనోహరి మాటలకు రణవీర్‌ భయపడతాడు. మరీ కసాయిలా మారిపోతుంది మనోహరి అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×