OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నంత సేపు స్టోరీలో లీనమైపోతుంటాము. ఎందుకంటే ఈ సినిమాలలో స్టోరీ, నటన అంత అద్భుతంగా ఉంటాయి. ఓవరాల్ గా టీం మార్క్ కనబడుతుంటుంది. ఇలాంటి సినిమాలకి అవార్డులు కూడా వారిస్తుంటాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే సినిమా, రెండు ఆస్కార్ అవార్డులు (సినిమాటోగ్రఫీ, సౌండ్) గెలుచుకుంది. ఇది ఒక యుద్ధం సమయంలో ఒక సైనికుడు మరో అధికారిని చంపడానికి అడవుల్లో ప్రయాణించే ఒక ఎమోషనల్ కథ. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అపోకలిప్స్ నౌ’ (Apocalypse Now) 1979లో వచ్చిన అమెరికన్ వార్ సినిమా. ఫ్రాన్సిస్ ఫోర్డ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మార్టిన్ షీన్, మార్లన్ బ్రాండో, రాబర్ట్ డువాల్, ఫ్రెడరిక్ ఫారెస్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1979 ఆగస్ట్ 15న విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. రెండు ఆస్కార్ అవార్డులను కూడా పొందిన ఈ సినిమా IMDbలో 8.4/10 రేటింగ్ ని కూడా పొందింది.
1969లో వియత్నాం యుద్ధం జరుగుతున్న సమయంలో కెప్టెన్ విల్లార్డ్ అనే అమెరికన్ సైనికుడికి ఒక సీక్రెట్ మిషన్ ఇస్తారు. అతను కల్నల్ కర్ట్జ్ అనే అధికారిని చంపాలి. కర్ట్జ్ ఒకప్పుడు గొప్ప సైనికుడు, కానీ ఇప్పుడు పిచ్చివాడై, కంబోడియా అడవుల్లో తన సొంత ఆర్మీని తయారు చేసుకున్నాడు. అతను అమెరికన్ ఆర్మీ ఆర్డర్స్‌ను పాటించడం మానేసి, చెడు పనులు చేస్తున్నాడు. విల్లార్డ్ ఒక చిన్న బోట్‌లో, నలుగురు సైనికులతో అతన్ని చంపడానికి నదిపై ప్రయాణం మొదలెడతాడు. ఈ ప్రయాణంలో వాళ్లు అనేక సవాళ్లను ఎదుర్కుంటారు.
Read Also : ఈ కాలిపోయిన ఆసుపత్రిలో కాలు పెడితే తిరిగిరారు… అల్లాడించే అమ్మాయి ఆత్మ… అనన్య నాగళ్ళ హర్రర్ మూవీ
విల్లార్డ్, అతని టీమ్ నదిపై ప్రయాణిస్తూ చాలా ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఈ ప్రయాణంలో వాళ్ల టీమ్‌లోని కొందరు సైనికులు చనిపోతారు. విల్లార్డ్, కర్ట్జ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అతన్ని స్థానికులు దేవుడిలా చూస్తుంటారు. దీని వెనుక అసలు విషయాలు తెలుసుకుని, అధికారుల ఆజ్ఞను పాటించాలా, లేక వెనక్కి వెళ్ళాలా అనే సందేహంలో పడతాడు. చివరికి విల్లార్డ్ అతని గురించి తెలుసుకున్న, అసలు నిజాలు ఏమిటి ? కర్ట్జ్ ను విల్లార్డ్ చంపుతాడా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.