E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు యాక్సిడెంట్‌ చేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today october 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు యాక్సిడెంట్‌ చేసిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి వచ్చిన చంభాను చూసి అంజు అనుమానిస్తుంది. మనం ఇంతకు ముందు ఎక్కడైనా చూశామా.? అని అడుగుతుంది. దీంతో చంభా భయపడుతుంది. లేదమ్మా నేను ఈ ఇంట్లోకి రావడం ఇదే మొదటి సారి అని చెప్తుంది. దీంతో అంజు బయట ఎక్కడైనా కలిశామా..? అని అడగ్గానే.. ఇళ్లల్లో పని చేసుకునే దాన్ని బయట ఎక్కువ తిరగను అమ్మా అంటుంది. నీ పేరేంటి అని అంజు అడగ్గానే.. యాదమ్మ అని చెప్తుంది చంభా..దీంతో అంజు నిన్ను ఎక్కడో చూశాను అబ్బా.. అంటుంది. ఇంతలో మనోహరి కోపంగా ఈ పొట్టిది ఒకతి అనుకుని అంజు స్కూల్‌ కు టైం అవుతుంది కదా అంజు వెళ్లండి. అమ్ము తీసుకెళ్లు.. అని చెప్పగానే.. అమ్ము పద అంజు అంటుంది. అంజు బయటకు వెళుతూ నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా..? సాయంత్రం మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు యమలోకంలో ఉన్న ఆరు కంగారుగా రాజు గారు అంటూ యముడి దగ్గరకు వెళ్తుంది. యముడు ఎవరది అని అడగ్గానే.. ఆరు నేనే అని చెప్తుంది. ఏమిటా కంగారు మీ వల్ల మా కిరీటము కింద పడబోయినది అని చెప్పగానే.. పెద్ద ప్రమాదం వచ్చింది రాజుగారు అని ఆరు చెప్పగానే.. యమపురికి ప్రమాదమా.? అసాధ్యం అంటాడు యముడు.. దీంతో ఆరు అయ్యో ప్రమాదం వచ్చింది మీ రాజ్యానికి కాదు.. మా చెల్లికి మనోహరి మా చెల్లి దగ్గర చంభా మాత్రికురాలిని పనిలో పెట్టింది అని చెప్పగానే.. అయినచో మేమేమీ చేయవలెను అని యముడు అడగ్గానే.. ఏదో ఒకటి చేసి ఆ మాత్రికురాలిని అక్కడి నుంచి పంపించివేయండి  లేదంటే మా చెల్లికి ప్రమాదం అని చెప్తుంది. యముడు కోపంగా ప్రతిసారి నీ సోదరిని కాపాడటమే మా పనా..? అని అడుగుతాడ. దీంతో ఆరు ప్రతిసారి అంటే ఎన్నిసార్లు కాపాడారు..? ఒక్కసారి అయినా కాపాడారా రాజుగారు.. అని ప్రశ్నిస్తుంది.

Advertisement

దీంతో యముడు కోపంగా మేము యమధర్మరాజులం మా విధులు వేరే మా కర్తవ్యాలు వేరు అని చెప్తాడు. దీంతో ఆరు ఏంట మీ పని నా లాంటి మంచి వాళ్లను త్వరగా చంపేస్తారు.. మనోహరి లాంటి చెడ్డ వాళ్లను పాపి చిరాయువు అంటూ చాలా రోజులు భూమ్మీదే ఉంచుతారు అని అడుగుతుంది. దీంతో యముడు దేనికైనా సమయం రావాలి బాలిక.. అని చెప్పగానే.. అదే ఆ సమయం ఎప్పుడు వస్తుంది. ఆ మనోహరి పాపం ఎప్పుడు పండుతుంది అని ఆరు అడగ్గానే.. నువ్వు అలా తొందర పడితే ఎలా బాలిక కాస్త ఓపిక పట్టుము.. అయినా భూలోకంలో జరుగు విషయములు ఎలా తెలియుచున్నవి..నీ శక్తులు సమాప్తం అయినవి కదా.. అని యముడు అడగ్గానే.. ఇప్పుడు అదా ముఖ్యం మా చెల్లిని కాపాడండి స్వామి అంటే లాజిక్కులు అడుగుతున్నారు..? రాజు గారు ఇంతకీ మేడం గారు స్నానానికి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతుంది.

దీంతో యముడు ఎందులకు ఈసారి మళ్లీ అంగుళీయకము దొంగిలించుటకా..? ఈసారి నీ ఆటలు సాగకు బాలిక మా దేవి నగలన్నీ బోషానములో భద్రపరచి తాళం వేసి స్నానమునకు వెళ్లినది అని చెప్పగానే.. ఆరు పెట్టుకోండి సార్‌ మీ సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోండి.. మా ప్రాణాలను మాత్రం మీ ఇష్టాలకు తీసేయండి అంటుంది. ఇంతలో గుప్త కంగారుగా ప్రభూ అంటూ పరుగెత్తుకుంటూ వస్తాడు.. దీంతో యముడు కోపంగా ఏమిటి విచిత్ర గుప్త నువ్వు కూడా పాపల వలే అరుచుచున్నావు.. ఏమిటీ ఆ గావు కేకలు.. అని అడగ్గానే.. ప్రభు నారదుల వారు మన యమలోకమునకు విచ్చేయుచున్నారని వర్తమానం అందింది అని గుప్త చెప్పగానే.. యముడు డైలమాలో పడిపోతాడు. అమ్మో నారదుల వారు ఇక్కడ బాలిక ను చూశారంటే ఇంకేమైనా ఉందా..? అని ఆలోచిస్తుంటే.. గుప్త కల్పించుకుని ఇప్పుడు ఏమి చేయుదుము ప్రభు ఆయన వచ్చో లోపు ఈ బాలికను భూలోకం పంపించెదమా..? అని అడగుతాడు.. వద్దని రహస్య మందిరంలో పెట్టమని చెప్పి యముడు వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు భూలోకంలో మిస్సమ్మ, చంభా కలిసి బయటకు వెళ్తారు. రోడ్డు మీద నడుస్తుంటే.. మనోహరి, చంభాకు ఫోన్‌ చేసి కాసేపట్లో నేను కారుతో వచ్చి దాన్ని గుద్దేయబోతున్నాను.. నువ్వు రెడీగా ఉండు అని చెప్తుంది. దీంతో చంభా భయపడుతుంది. ఇంతలో మనోహరి కారుతో వచ్చి మిస్సమ్మను గుద్దేస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×