Intinti Ramayanam Today Episode October 25 th: నిన్నటి ఎపిసోడ్ లో.. దీపావళి సందర్బంగా ఇంట్లో పూజ చేసేందుకు అన్నీ సిద్ధం చేస్తారు. ఇక పూజ మొదలు పెడదామని భానుమతి అంటుంది. అయితే పూజకి అంత సిద్ధం చేసి పంతుల్ని పిలిచిన తర్వాత.. లక్ష్మీదేవి రూపు లేకుండా పూజ చేయడం ఎలా అని పల్లవి అవనీని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఇంత గొప్పగా పూజ చేయాలని అనుకోవడం ఏంటి అని పల్లవి శ్రియ ఇద్దరు కూడా సందు దొరికితే అవనిపై పడిపోతుంటారు.
అప్పుడే అవనీని బయట నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే షాప్ లో బట్టలు తీసుకున్నారు కదా మేడం మీకు లక్ష్మీదేవి రూప్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అని అనగానే అవని సంతోషపడుతుంది. ఆ రూపును తీసుకొచ్చి పూజలో పెట్టమని పంతులుగారికి ఇస్తుంది. గురు కోడలు తెచ్చిన లక్ష్మీదేవి రూపంతో పంతులుగారు పూజని పూర్తి చేస్తారు.. దీపావళి బాంబులను కాల్చి అందరూ సరదాగా సంబరాలు చేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ కి టాబ్లెట్ ఇవ్వాల్సిన సంగతి పార్వతి మర్చిపోతుంది.. అవని అక్షయ్ రావడానికి లేట్ అవుతుంది కదా అని కమల్ ను పిలుస్తుంది. ఏదో పని ఉందని వాడు కూడా బయటికి వెళ్ళాడు. శ్రీకర్ శ్రియ మాత్రమే ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దర్నీ పిలుస్తా తెచ్చిస్తారు అని పార్వతి అంటుంది.. వాళ్ళిద్దర్నీ పిలవగానే మీ నాన్న వి టాబ్లెట్స్ అయిపోయాయి తీసుకుచ్చేస్తారా అని అడగగానే శ్రీకర్ నాకు ఒక ముఖ్యమైన పని ఉందమ్మా.. ఇంపార్టెంట్ క్లైంట్ వస్తున్నారు. ఆయనను కలిసేసి వచ్చేటప్పుడు తీసుకు రమ్మంటే తీసుకొస్తాను అని అంటాడు.. అది కాదురా అవి టైం కి వేసుకోవాలి అని అన్నా కూడా శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
శ్రియకు టాబ్లెట్ తీసుకు రమ్మని అడుగుతుంది పార్వతి.. శ్రియ నేను తీసుకురాను అని మొహం మీదే చెప్పేస్తుంది.. ఇవాళ టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్తారు. రేపు ఇంకొకటి తీసుకు రమ్మని చెప్తారు. మీకేం అలానే కూరగాయలు అని ఇంటి పనిమనిషి చేసేస్తారు అని శ్రేయ అంటుంది. నాకేమంత అవసరం పట్టలేదు మీ ముద్దుల కోడలు ఉంది కదా ఆమెను అడిగి తెచ్చుకోండి అని శ్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే తనని బయటకు పంపిస్తారేమో అని అక్కడినుంచి మెల్లగా జారుకుంటుంది..
కమల్ ఎలక్ట్రిషన్ జాబు లో జాయిన్ అవుతాడు.. మొదటి రోజు తను ఎలక్ట్రిషన్ గా పనిచేసేందుకు ఓ ఆర్డర్ వచ్చిందని ఓనర్ చెప్పగానే ఆ ఇంటికి వెళ్తాడు.. ఇది చక్రధర్ మామయ్య ఇల్లు కదా.. మనకు భయం ఎందుకు రాజు అలాగా వెళ్లి పని ఏంటో చూసుకొని వద్దామని వెళ్తాడు. రాజేశ్వరి అల్లుడు వచ్చాడు కదా అని సంతోష పడుతూ మర్యాదగా పలకరిస్తుంది. చక్రధర్ మాత్రం ఎందుకొచ్చావ్ ఏం పనితో వచ్చావు అని అడుగుతాడు. నేను ఎలక్ట్రిషన్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను. ఇంట్లో ఏదో పని ఉందంట కదా నాకు ఆ పని అప్పగించారు అందుకే నేను వచ్చాను ఏంటో చెప్పండి అని కమల్ అడుగుతాడు.. కమల్ని చక్రధర్ దారుణంగా అవమానిస్తాడు..
ఆ తర్వాత అక్షయ్ అవని ఇద్దరూ తనకి తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్తారు. మా ఇంటిని ఓ ప్రైవేట్ మనీ లాండర్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు అతను మా ఇంటిని కబ్జా చేశాడు. నా సంతకాలను ఫోర్జరీ చేశాడు. దీని మీద కేసు వేద్దామని వచ్చామని అవని అంటుంది. ఈ కేసు నేను ఫైల్ చేస్తాను కానీ ఇదంతా పూర్తయ్యలోగా కచ్చితంగా చాలా ఏళ్లు పడుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రావాలి.. ఇదంతా జరిగే లోపల చాలా కాలం పడుతుంది. అందుకే నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే.. మీరు పోలీసులు ద్వారానో.. వేరే వారి ద్వారానో అది తెలుసుకొని మీ ఇంటిని మీరు సొంతం చేసుకోండి అని చెప్తాడు..
Also Read: ప్రేమ దెబ్బకు శ్రీవల్లికి షాక్.. బొమ్మ చూపించిన నర్మద.. అమూల్య కోసం విశ్వం మాస్టర్ ప్లాన్..?
ఏదో ఒక విధంగా మన ఇంటిని మనం సొంతం చేసుకోవాలని అక్షయ అవని అక్కడి నుంచి వచ్చేస్తారు. కమల్ స్వీట్ బాక్స్ పట్టుకొని సంతోషంగా ఇంటికి వస్తాడు. ఏమైందిరా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అని పార్వతి అడుగుతుంది. నేను ఎలక్ట్రిషన్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను అమ్మ. మొదటి రోజే నాకు 2000 ఇచ్చారు. అని ఆ డబ్బులని పార్వతికి ఇవ్వబోతాడు.. పల్లవి అడ్డుపడి ఇంటింటికి వెళ్లి ఎలక్ట్రిషన్ గా చేయడం ఎంత సిగ్గులేని పని అని దారుణంగా తిడుతుంది. నేనేమీ తప్పుడు పని చేయట్లేదు.. జాబ్ చేస్తున్నాను.. ఈ ఇంటి కోసం అవని వదిన ఒక్కటే కష్టపడుతుంది.. నేను వదినకు సాయంగా ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే అందరూ సంతోషపడతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…