E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న అంజు 

Nindu Noorella Saavasam Serial Today September 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న అంజు 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  తీవ్రవాదుల కాల్పుల్లో అంజుకు బుల్లెట్‌ తగులుతుంది. అందరూ అంజు అంటూ అరుస్తుంటారు. ఇంతలో మిలటరీ వాళ్లు లోపలకి వస్తారు. తీవ్రవాదులను పట్టుకుంటారు. ఇంతలో ఒక తీవ్రవాది అమరేంద్ర తప్పించుకున్నానని సంతోష పడకు నీ ఫ్యామిలీకి ఇంకా థ్రెట్‌ ఉంది. నీ ఫ్యామిలీని చంపమని ఒక లేడీ మాకు ఫోన్‌ చేసి చెప్పింది మా నుంచి తప్పించుకున్నా  ఆ లేడీ మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తుంది అని చెప్తాడు. అమర్‌ వాడిని తిడుతూ అంజును తీసుకుని కిందకు పరుగెడతాడు.. కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు.

మరోవైపు యమలోకంలో ఉన్న గుప్త ఆరు బాగా గుర్తుకు వస్తుంది. భూలోకంలో చంభా బాలికను ఏం బాధ పెడుతుందో ఏంటో ఒకసారి మాయ దర్పణంలో చూడాలని ఓపెన్‌ చేసి అంతా చూస్తాడు. అంజును తీవ్రవాదులు కాల్చేసింది చూసి షాక్ అవుతాడు గుప్త. వెంటనే ఆ పిల్ల పిచ్చుక ఎలా ఉందో చూస్తాను అంటూ మంత్రం వేస్తుంటే.. యముడ వస్తాడు. విచిత్రగుప్త ఏమి చేయుచుంటివి అని అడుగుతాడు. దీంతో గుప్త ప్రభువులకు ప్రణామములు.. కాలక్షేపమునకు మాయా దర్పణం వీక్షించిచుంటిని.. అని చెప్తాడు. బ్రహ్మ ఇచ్చిన మాయా దర్పణం నీకు కాలక్షేపం చేయడానికి పనికి వచ్చిందా..? అని యముడు అడగ్గానే.. క్షమించుము ప్రభు అంటూ మాయా దర్పణం మూసివేస్తాడు.

Advertisement

నువ్వు వెంటనే భూలోకమునకు వెళ్ల వలెను.. అని చెప్తాడు. అలాగే ప్రభు కానీ ఎందులకు అని గుప్త అడగ్గానే.. నువ్వు భూలోకమునకు వెళ్లిన పిదప నీ కర్తవ్యము తెలియ వచ్చును అని చెప్పి యముడు మాయం అయిపోతాడు. ఒకవేళ ఆ పసిప్రానం తెచ్చుటకు కాదు కదా..? జగన్నాథ మేము అటుల చేసిన యెడల అరుంధతి ఆత్మ మరింత క్షోభించును ఎందుకైనా మంచిది మాయా దర్పణంలో ఆ పిల్ల పిచ్చుక భవిష్యత్తు తెలుసుకొనెదను అని మాయా దర్పణం తెరవడానికి ప్రయత్నిస్తే తెరుచుకోదు.. దీంతో యముడు మళ్లీ వచ్చి కోపంగా చిత్రగుప్త నువ్వు ఇంకను ఇచ్చటనే ఉంటివా..? అని తిడతాడు. ప్రభూ వెళ్తున్నాను ప్రభు అంటూ గుప్త అక్కడి నుంచి మాయం అయిపోతాడు.

కింద అమర్‌ వాళ్లు అంజును హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్లు అంజుకు హాస్పిటల్‌ లోని ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తారు. బయటి నుంచి అందరూ ఏడుస్తూ చూస్తుంటారు. మిస్సమ్మ ఏడుస్తూ భగవంతుడా అంజుకు ఏం కాకుండా చూడు తండ్రి అని మొక్కుతుంది. మరోవైపు మనోహరి దగ్గరకు రణవీర్‌ వెళ్తాడు. మొత్తానికి మనం సాధించాం మనోహరి అంటాడు. మనం అని నిన్ను కూడా కలుపుకుంటావేంటి..? సాధించింది నేను గెలిచింది నేను అంటుంది. మనం ఒక్కటి కాదా..? మనోహరి.. నీ గెలుపు నా గెలుపు కాదా..? అని అడుగుతాడు రణవీర్‌.. నేను భాగీని టార్గెట్‌ చేస్తే అంజలి బలైంది. భాగీకి తగలాల్సిన బుల్లెట్‌ అంజలికి తగిలింది అంటుంది మనోహరి. అది కూడా మన మంచికే కదా మనోహరి. ఈరోజు  ఆ పిల్ల చస్తే రేపు కోర్టులో దాని డెత్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేసి నా ఆస్తిని నేను దక్కించుకుంటాను అంటాడు రణవీర్‌.

Advertisement

అరుంధతి చిన్న కూతురు నీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. పాపం తన ముద్దుల కూతురు చావబోతుందని తెలిసి అరుంధతి ఆత్మ ఎంతలా ఆలోచిస్తుందో అంటుంది మనోహరి. ఏడుపు ఎందుకు చచ్చాక ఎలాగూ తల్లీ కూతుళ్లు ఒకే దగ్గర ఉంటారు కదా అంటాడు రణవీర్‌. కరెక్టే రణవీర్‌ ఒక రకంగా తల్లీ కూతుళ్లను కలిపి నేను పుణ్యం చేస్తున్నాను. తల్లినీ నేనే చంపాను.. పిల్ల చావుకు నేనే కారణం అవుతున్నాను అని చెప్తుంది మను..

అవును ఆ తల్లీ కూతుళ్లు మళ్ళీ పుట్టే వరకు నిన్నే తలుచుకుంటారు అంటాడు రణవీర్‌. దీంతో మను కోపంగా వెటకారంగా అంటున్నావా..? అని అడుగుతుంది. ఏం లేదు తల్లీకూతుళ్లను కలిపిన పుణ్యం దక్కుతుందని నువ్వన్న మాటే నీకు చెప్తున్నాను.. నా ప్రాబ్లం సాల్వ్‌ అయిపోతుంది. మరి నీ అడ్డు ఎలా తొలగించుకోబోతున్నావు.. అని అడగ్గానే.. ఏముంది ఆ పిల్ల చావగానే.. దాని చావుకు కారణం భాగీనే అని చెప్తాను. ఆ అపార్ట్‌మెంట్‌కు భాగీనే తీసుకెళ్లిందని చెప్పి అమర్‌ను రెచ్చగొడతాను దీంతో అమరే, భాగీని తన్ని తరిమేస్తాడు.. అంటూ చెప్తుంది.

మరోవైపు హాస్పిటల్‌లోని ఐసీయూలోంచి డాక్టర్‌ బయలకు రాగానే అమర్‌ ఆత్రుతగా డాక్టర్‌ పాప కండీషన్‌ ఎలా ఉంది. అని అడుగుతాడు. పాప కండీషన్‌ చాలా క్రిటికల్‌ గానే ఉందని డాక్టర్‌ చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. బుల్లెట్‌ హార్ట్‌ పక్కన ఉంది. ఇమ్మిడియేట్‌గా సర్జరీ చేసి బుల్లెట్‌ రిమూవ్‌ చేయాలి. సర్జరీ చేయాలంటే బ్లడ్‌ కావాలి అని డాక్టర్‌ చెప్పగానే.. మీ హాస్పిటల్‌ లో ఆ బ్లడ్‌ గ్రూప్‌ లేదా డాక్టర్‌ అని అమర్‌ అడగ్గానే.. పాప బ్లడ్‌ గ్రూప్‌ ఏబీ నెగెటివ్‌.. అది చాలా రేర్‌ గ్రూప్‌ వందలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. 24 గంటల్లోపు పాపకు సర్జరీ చేయాలి లేదంటే పరిస్థితి మా చేయి దాటిపోతుంది అని డాక్టర్ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×