Illu Illalu Pillalu Today Episode September 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ నర్మదా వెళ్ళిపోతారు. ప్రేమ కళ్యాణ్ కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇప్పుడు కళ్యాణ్ కోసం వెతుకుతున్నావు ఏంటి అని ప్రేమ ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం లేదే ఊరికే అడుగుదామని అని ప్రేమ ఏదో ఒకటి కవర్ చేస్తుంది. మొత్తానికి కళ్యాణ్ను పట్టుకుంటుంది ప్రేమ. ఆ కళ్యాణ్ ను రోడ్డు పై పరిగెత్తించి మరీ కొడుతుంది. వీధులన్నీ తిప్పి మరి చితగ్గొట్టేస్తుంది. నర్మదా సాగర్ కి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కి లోపలికి పంపిస్తుంది. భద్రావతి ఇంట్లో సేన కొడుకుకి పెళ్లి సంబంధం కోసం మనుషులు వస్తారు. మాకు బాగా నచ్చింది కట్నకానుకలు ఏమాత్రం ఇస్తారు అని అడుగుతారు.. కొంచమైనా సిగ్గుండాలి మీ అమ్మాయి లేచిపోయింది.
సేన కుటుంబానికి ఘోర అవమానం జరుగుతుంది. శ్రీవల్లి సాగర్ నర్మదా ఏదో ఎగ్జామ్ కోసం వెళ్ళినట్లు ఉన్నారు అని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. సాగరు ఎగ్జామ్ ని అతి కష్టం మీద రాసి బయటకు వస్తాడు. ఎగ్జామ్ ఎలా రాశావు సాగర్ అని నర్మదా అడుగుతుంది. పెళ్లి అని చెప్పేసి ఇక్కడ వీళ్లు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారా అని షాక్ అవుతుంది. కచ్చితంగా ఇంట్లో చెప్పి రచ్చ చేయాలి అప్పుడే నా కడుపు మంట చల్లారిపోతుంది అని శ్రీవల్లి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు వేదవతి సంతోషంగా నవ్వుకుంటూ ఉండటం చూసినా భద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికొచ్చిన విశ్వం ఏంటి అత్త వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైంది అని అడుగుతాడు. పాతికేళ్ల క్రితం నా చెల్లెలు దూరమైపోయింది దాని గురించి నేను బాధపడుతూనే ఉన్నాను. చిన్న కూతురు లాగా పెంచుకున్న మేనకోడలు కూడా నాకు దూరం అయిపోయింది అది నేను తట్టుకోలేక పోతున్నాను. మనం కూడా ఆ రామరాజుకి అతని సంతోషాన్ని దూరం చేయాలి అని భద్ర అంటుంది.
అందుకే మనము ఆ రామరాజు సంతోషాన్ని దూరం చేయాలి ఆడి మూడో కూతురు అమూల్యని నువ్వు ప్రేమించి ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి.. ధీరజ్ గాడు ఎలాగైతే మన ప్రేమను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అలానే పెళ్లి చేసుకోవాలి. దానిని ఎలా పెళ్లి చేసుకోవాలో తని విశ్వం అని అడుగుతాడు. నువ్వు పెళ్లి చేసుకుని దాంతో కాపురం చేయడానికి కాదురా దాన్ని టార్చర్ చేయడానికి.. ఆ రామరాజు మన ఇంటి గేటు ముందర కొచ్చి కన్నీళ్లు పెట్టుకోవాలి. అప్పుడు నా చెల్లెలు పోయిందని నా మేనకోడలు వెళ్ళిందని బాధ తుడిచిపెట్టి పోతుంది నాలో అని అంటుంది.
ఇక ప్రేమ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నర్మదా వేదవతిలో ఏమైంది ఎందుకు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తుంది అని అనుకుంటారు. ఇద్దరూ వెళ్లి ప్రేమ దగ్గర సరదాగా మాట్లాడతారు. ఏమైంది ఎందుకు? నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు. నీకు మేమిద్దరం ఫ్రెండ్స్ ఏ కదా మరి ఎందుకు నువ్వు మాకు కూడా చెప్పకుండా బాధపడుతున్నావు అని అడుగుతావు. బాధ ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నాను అని ప్రేమ అంటుంది.
శ్రీవల్లి మామయ్య గారి దగ్గర నర్మదా ప్రేమలో గుట్టుని బయట పెట్టాలి అని అనుకుంటుంది. ఇద్దరు ఒకేసారి బలే దొరికేశారు ఇద్దరు గుడ్డుని బయట పెడితే అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను ఇంకొకసారి నా జోలికి రావడానికి భయపడతారు అని అనుకుంటుంది. అయితే ఆధారాలు లేకుండా వెళ్తే మావయ్య గారు నమ్మరేమో.. వాళ్ళ ఆధారాలతో సహా బయటపెట్టి అప్పుడు వాళ్ళని ఇరికిస్తే ఆ తర్వాత నా జోలికి రాకుండా ఉంటారు అని అంటుంది. రామరాజును పిలిచి ఏదో పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటుంది.
Also Read: అక్షయ్ కు దిమ్మతిరిగే షాక్.. అవని దగ్గరకు వచ్చిన పార్వతి.. కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్..
సాగర్ నర్మదా ఇద్దరు కూడా సరదాగా రొమాన్స్లు మునిగి తేలుతూ ఉంటే మధ్యలో శ్రీవల్లి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. మంచి టైం లో వచ్చి డిస్టర్బ్ చేసింది అని శ్రీవల్లిని తిట్టుకుంటారు. అయితే ఏంటి వదిన ఇలా వచ్చావు ఏం కావాలి అని సాగర్ అడుగుతాడు. నేను కొంచెం నర్మదతో అర్జెంటుగా మాట్లాడాలి అని శ్రీవల్లి అంటుంది. అయితే శ్రీవల్లి నర్మద దగ్గరకు వచ్చి నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది గురించి నాకు క్లారిటీ ఇస్తే ఆ తర్వాత మామయ్య గారి దగ్గర మీరు సేఫ్ గా ఉంటారు అని అడుగుతుంది. విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అని శ్రీవల్లిని అడుగుతుంది నర్మదా అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..