E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు గార్డెన్‌లో ఆలోచిస్తూ ఉండగా ఆశ్రమం నుంచి రాజు వస్తుంటాడు. ఆయనను చూసిన ఆరు మా ఆశ్రమం రజు గారు కదా అనుకుంటుంది. ఇంతలో ఇంట్లోంచి మనోహరి బయటకు వస్తుంది. రాజు వెంటనే పక్కకు వెళ్లి దాక్కుంటాడు. మనోహరి కారేసుకుని బయటకు వెళ్లిపోతుంది. మనును చూసిన ఆరు మను ఎక్కడికి వెళ్తుంది అనుకుంటుంది. రాజు బయటకు వచ్చి హమ్మయ్యా ఈ రాక్షసి వెళ్లిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి భాగీ గారికి నిజం చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఈ విషయం వెంటనే గుప్త గారికి చెప్పాలి అనుకుంటూ అటూ ఇటూ వెతుకుతుంది. గుప్త గారేంటి కనిపించడం లేదు అనుకుంటుంది.

ఇంతలో  గుప్త పక్క నుంచి వస్తాడు. గుప్త గారు ఎక్కడికి వెళ్లిపోయారు..? అని అడుగుతుంది. దీంతో గుప్త విషాదముతో చిన్న విరామం తీసుకుంటిని బాలిక అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆరు గుప్త గారు మీకు ఒక విషయం చెప్పాలి అనాథ ఆశ్రమం నుంచి ఒక మనిషి వచ్చారు. మా చిన్ననాటి మనోహరి గురించి నిజం చెప్పడానికి ఇప్పుడే ఇంట్లోకి వెళ్తారు. మనోహరికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి గుప్తగారు. దాని చాప్టర్‌ క్లోజ్‌ అంటూ నవ్వుతుంది. సమాప్తం కాబోతున్నది ఆ దుష్ట బాలిక కాదు బాలిక. నీ చరిత్ర అని మనసులో అనుకుంటాడు గుప్త. అవును ఇందాక మీరు మీ పెట్టెలో చూసింది ఇదేనా అని అడుగుతుంది. అవును అన్నట్టు గుప్త తలూపుతాడు. ఓహో దీనికే ఎందుకు అంత ఇదై పోయారు.. ఎందుకు అంత కంగారు పడ్డారు. అయినా ఇది ఆనందించాల్సిన విషయం కదా ఎందుకు అంత ఫీల్‌ అయ్యారు అంటుంది.

Advertisement

ఇంట్లోకి వెళ్లిన రాజును చూసి పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. అంజు వెళ్లి ఎలా ఉన్నావు తాతయ్యా అని అడుగుతుంది. రాజు నేను బాగానే ఉన్నాను అమ్మా.. నువ్వెలా ఉన్నావు.. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశ్రమంలోని పిల్లలు అందరూ ప్రేయర్‌ చేశారు.. అని చెప్పగానే.. నేను బాగానే ఉన్నాను తాతయ్య.. థాంక్యూ అంటుంది అంజు. మీ నాన్నగారు ఉన్నారా? అని రాజు అడగ్గానే.. లేరు తాతయ్యా ఆఫీసుకు వెళ్లారు అని అమ్ము చెప్తుంది. మరి భాగీ గారు ఉన్నారా అమ్మా అని రాజు అడగ్గానే.. మిస్సమ్మ ఇంట్లోనే ఉంది తాతయ్యా అంటూ ఆనంద్‌  చెప్తాడు. మిస్సమ్మా మిస్సమ్మా తాతయ్య వచ్చారు అంటూ ఆకాష్‌ పిలుస్తాడు.

మిస్సమ్మ కిందకు వస్తుంది. ఏంటి రాజు గారు ఇలా వచ్చారు.. అని అడుగుతుంది. దీంతో మీతో ఒక విషయం చెప్పాలమ్మా అంటాడు రాజు. చెప్పండి అని మిస్సమ్మ అడగ్గానే.. నేను కాదు సరస్వతి మేడం మీతో మాట్లాడతామన్నారు అని రాజు చెప్పగానే.. ఆవిడ ఎక్కడున్నారు ఇంతకీ ఆవిడకు ఇప్పుడు ఎలా ఉంది..? అని అడుగుతుంది మిస్సమ్మ. పర్వాలేదమ్మా.. మీరు ఒకసారి ఆశ్రమానికి వస్తే మీకు అన్ని విషయాలు చెప్తారు.   సరే రాజు గారు నేను తర్వాత వస్తాను అని చెప్తుంది మిస్సమ్మ. రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత మిస్సమ్మ, రాథోడ్‌ తో కలిసి ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ సరస్వతి వార్డెన్ దగ్గరకు వెళ్లగానే సరస్వతి నమస్తే మేడం కూర్చోండి అంటుంది. దీంతో మిస్సమ్మ పర్వా లేదు మేడం.. మీరు ఏదో విషయం చెప్పాలి అన్నారట కదా ఏంటి మేడం చెప్పండి అని అడుగుతుంది మిస్సమ్మ. అవును మేడం.. మీ ఇంట్లో ఉన్న అరుంధతి ఫ్రెండ్‌ మనోహరి గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. అందుకే చాలా రోజులుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ అన్ని అడ్డంకులే వస్తున్నాయి.. అంటూ సరస్వతి చెప్తుంటే..

ఇంతకీ మనోహరి గురించి ఏంటి మేడం చెప్పండి అని రాథోడ్‌ అడగ్గానే.. సరస్వతి కోపంగా ఆ మనోహరి మనిషి కాదు. నరరూప రాక్షసురాలు.. అది ఏం చేసిందో తెలుసా అమ్మా అమాయకురాలైన అరుంధతిని స్నేహితురాలిగా నటించి నమ్మించి మోసం చేసింది అరుంధతిని పొట్టన పెట్టుకుంది. అరుంధతిని చంపిన హంతకురాలు అదేనమ్మా..? అంటూ సరస్వతి చెప్పగానే.. మిస్సమ్మ, రాథోడ్‌ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Big Stories

Advertisement
×