Podarillu Today Episode July 1st: నేను ఇంట్లోంచి వెళ్లిపోయి తప్పు చేశాను కన్నా అని మహాలక్ష్మి అంటుంది.. మీరేం తప్పు చేయలేదు వదిన మా ఇంటికి ఒక శాపం ఉంది.. నలుగురు మగాళ్లు ఉన్న ఆ ఇంట్లో ఒక ఆడది ఎలా ఉంటుంది అని అందరూ అనుకునేవారు.. మీరు రావడంతో ఆ ఇంటికి శాపం పోయింది అని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు మీరు వెళ్లిపోయారు కదా మా ఇంట్లో అందరికీ పెళ్లిళ్లు అయి వదినలు వస్తారన్న నా ఆశ ఆశగానే ఉండిపోతుందేమో అని కన్నా బాధపడతాడు.. మహాలక్ష్మి తాయారు మాట విని తప్పు చేశాను అని అనుకుంటుంది.. మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న కుమారు తనని ఘోరంగా తిడతాడు.. ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ ఒక పని సరిగ్గా చేయలేవు అంటూ దారుణంగా తిడతాడు.. విక్కీ ఎంట్రీ ఇవ్వడంతో కుమార్ షాక్ అవుతాడు.. విక్కీ మహాలక్ష్మిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మహా కూడా పాజిటివ్ గా అనుకుంటుంది..
నారాయణ బయట కూర్చుని ఉండగా… ఇద్దరు ఆడవాళ్లు ఒకరికి వచ్చి మీ ఇంట్లోని ఆడవాళ్ళని పిలవండి మా కోడలు సీమంతం పిలవడానికి వచ్చాము అని అంటారు.. మీ కోడలు శ్రీమంతం అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని మౌనంగా ఉంటాడు.. బయట ఎవరో వచ్చారని అందరూ చూడ్డానికి వస్తారు.. అందరు మాట విని ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మీ ఇంట్లో ఆడవాళ్ళని పిలవమంటే అలా ఉంటారు ఏంటండీ ఒకసారి పిలవండి మేము బొట్టు పెట్టి పిలుస్తాము అని అంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన తాయారు ఇది మగసంత ఉండే కొంప.. ఇక్కడ ఆడవాళ్లు ఎవరూ లేరు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు అని తాయారు అంటుంది.. మహా సడన్గా ఎంట్రీ ఇచ్చి ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది.. లోపలినించి మహారావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..
లోపలి నుంచి మహాలక్ష్మి హారతి పట్టుకుని బయటకు రావడం చూసిన తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఎప్పుడు అండి ఫంక్షన్ అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఫంక్షన్ ఇవాళ సాయంత్రం 6:00కి అని చెప్పగానే అవునా సరే నేను వస్తానండి అని మహాలక్ష్మి అంటుంది.. అయితే అందరికీ హారతిస్తుంది.. తాయారుకు కూడా పిన్ని గారు హారతి తీసుకోండి అని అంటుంది.. నువ్వు వెళ్లిపోయావు కదా మల్ల ఎలా వచ్చావు అని తాయారు షాక్ లో అడుగుతుంది.. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు అది మీ బ్రమ మాత్రమే ఇక్కడే ఉన్నాను అని అంటుంది.. ఇంట్లో ఇంకొకసారి ఆడవాళ్లు లేరు అని ఎవరు అనద్దు నేను ఇక్కడే ఉంటాను అని తయారుకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది మహాలక్ష్మి.. మహా ఎంట్రీ ఇవ్వడంతో నారాయణ వాళ్ళిద్దరికీ క్లాస్ పీకుతాడు.
మహాలక్ష్మి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు.. లోపలికి రాగానే ఏంటి వదిన సడన్ ఎంట్రీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఎంట్రీ చాలా బాగుంది అని కన్నా కూడా మహాలక్ష్మిని అడుగుతాడు.. ఇప్పుడు చూడ్డానికి వచ్చారా చూసి వెళ్ళిపోతారా అని కేశవ మాధవ కూడా అడుగుతారు.. ఒకరు చేసిన తప్పు వల్ల నేను అందరినీ ఇబ్బంది పెడుతున్నాను.. ఒకసారి అటు చూడు అని మహాలక్ష్మి తన లగేజ్ను చూపిస్తుంది.. మళ్లీ వస్తావని అస్సలు అనుకోలేదు వదిన అని కన్నా అంటాడు.. మీ ఇంటికి ఒక పేరు ఉంది ఆ పేరుని నేను వచ్చిన తర్వాత పోగొట్టాను అని అనుకున్నాను కానీ మళ్ళీ అదే పేరు మీకు వస్తుందని అనుకోలేదు పెద్ది.. అందుకే నేను వచ్చేసాను అని మహాలక్ష్మి అంటుంది.. నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అందరూ సంతోషంగా ఉంటారు..
మహాలక్ష్మి లేదనుకొని గదిలోకి వెళ్లిన చక్రి అక్కడ మహాలక్ష్మిని చూసి అంతా నా భ్రమ అని అనుకుంటాడు. అయితే మహాలక్ష్మి నిజంగా వచ్చింది అన్న విషయాన్ని చక్రి తెలుసుకోలేక పోతాడు.. ఇక తన మనసులోని మాటని మాట్లాడుతూ ఉంటాడు.. మీరు లేకున్నా కూడా మీ బెడ్ ని చూసా నాకు భయంగా ఉంది అని చక్రి అంటాడు.. మహాలక్ష్మి చక్రి మాటలు విని సీరియస్ అవుతుంది.. నన్ను దెయ్యంలాగా చూస్తున్నాడా చక్రి అని కోపంగా ఉంటుంది.. మహాలక్ష్మిని చూసిన చక్రి ఇక్కడ నాకు ఎటు చూసినా మీరే కనిపిస్తున్నారు గోడకి క్యాలెండర్ లాగా కూడా మీరే అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తుంది అని భ్రమలోంచి బయటికి వచ్చేస్తాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి నన్ను చూసి కూడా చూడనట్లే వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటుంది..
శైలు కోసమని కేశవ వెయిట్ చేస్తూ ఉంటాడు.. అప్పుడే వెనకాల నుంచి కేశవ కళ్ళు మూస్తుంది శైలు.. కేశవ చాలా సంతోషంగా ఉండడం చూసి ఏంటి గురువుగారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు నీ మొహం వెలిగిపోతుంది ఏంటి అని అంటుంది.. దీనికి కారణం మహాలక్ష్మి గారు అని కేశవ అనడంతో శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి మహాలక్ష్మి అంటే ఎవరు అని శైలు వివరాలను కానీ తెలుసుకుంటుంది.. మహాలక్ష్మిని కేశవ అంతగా పొగడడం చూసినా శైలు నువ్వు అంతగా పొగిడేస్తున్నావ్ కదా మరి నేను ఇక్కడ ఎందుకు? వెళ్ళిపోతాను అని అంటుంది..
రాత్రి అందరూ భోజనానికి కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారు.. కన్నా చాలా సంతోషంగా అందరిని భోజనానికి రండి అని పిలుస్తాడు.. అయితే చక్రి నన్ను కూడా కూర్చోమంటారా అని అడుగుతాడు. మహాలక్ష్మి కన్నా పక్కన కూర్చోవడం చూసి నాకు ఎటు చూసినా ఈవిడ కనిపిస్తుంది అని అనుకుంటాడు.. కానీ నారాయణ మాత్రం అరే ఫుల్లు మహాలక్ష్మి నిజంగానే వచ్చింది కళ్ళు తెరిచి చూడరా అని అంటాడు.. అయితే మహాలక్ష్మి వచ్చింది అని తెలుసుకున్న చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. మీరు వచ్చేసారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రిలోడలోడా వాగేస్తుంటే మహాలక్ష్మి ఇతను వెళ్ళిపోతాను అంటే నేను వచ్చాను ఎప్పుడు వెళ్ళిపోతాడు కనుక్కో పెద్ది అని అంటుంది.. రేపు నేను వెళ్ళిపోతాను అని చక్రి అంటాడు.. అయితే మొత్తానికి అందరూ కలిసి చాలా సరదాగా ఉంటారు. ఇదా కేశవ బయటికి వచ్చి తనకి మెసేజ్ చేయాలని వస్తాడు.. కేశవా మెసేజ్ చేస్తూ ఉండగా మహాలక్ష్మి వచ్చి సలహాలు ఇస్తుంది అది చూసినా కేశవ అది లవ్వు కాదు అని అసలు నిజం చెప్తాడు.. చక్రి వచ్చి మధ్యలో అది లవ్ అని చెప్పడంతో మహాలక్ష్మి కూడా నిజమే అని నమ్ముతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…