E-Paper
Advertisement

వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!

వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!
Advertisement

Vi Plan: వోడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2475 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త ప్లాన్.. సుదీర్ఘ కాలం పాటు రీఛార్జ్ ఇబ్బందులు లేకుండా ఉండాలనుకునే వారికి ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆరు నెలల (180 రోజులు) వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ వివరాలు, యూజర్ కు లభించే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.2475 ప్లాన్ బెనిఫిట్స్

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం ప్రధానంగా వీఐ ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 2475 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల పాటు ఫ్రీ కాల్స్ లభించనున్నాయి. అలాగే ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రతీ 28 రోజులకు 300GB వరకూ డేటాను యూజర్ ఉపయోగించుకోవచ్చు.

రోజుకు రూ.14 మాత్రమే?

Advertisement

వీఐ కొత్త ప్లాన్ ను రూ. 2475కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 180 రోజుల వ్యాలిడిటీని పరిగణలోకి తీసుకుంటే రోజుకు సగటను రూ.13.75 యూజర్ కు ఖర్చు కానుంది. జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలు ఆఫర్ చేస్తున్న అధిక వ్యాలిడిటీ ప్లాన్లతో పోలిస్తే.. ఇది కాస్త తక్కువేనని వీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. వీఐ తన 4G నెట్ వర్క్ ను 5Gకి అప్ గ్రేడ్ చేసినందువల్ల.. ఈ ప్లాన్ తో మరింత వేగంగా డేటా సేవలు పొందవచ్చని పేర్కొంటున్నాయి.

Also Read: మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!

ఎవరికి ఇది బెస్ట్ చాయిస్?

Advertisement

పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా.. ప్రతిరోజూ తగినంత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. అలాగే ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్, ఓటీటీ కంటెంట్, సోషల్ మీడియాను ఎక్కువగా వీక్షించే వారికి సైతం ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

Also Read: ఒకే చెట్టు.. 300 ఏళ్లపాటు కలప.. 600 ఏళ్ల నాటి అద్భుత టెక్నాలజీ!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×