E-Paper
Advertisement

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని
Advertisement

Nellore News: హిజ్రాలు రూటు మార్చారా? అడిగినంత ఇవ్వకుండా సామాన్యులపై దాడి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా? ఉత్తరాది వాళ్ల దారిని ఎంచుకున్నారా? అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఆసుపత్రిలో నర్సుపై మూకుమ్మడిగా హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రాన్స్ జెండర్లు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇచ్చినంత డబ్బులు తీసుకునేవారు. వారు రూటు మార్చారు. తాము ఎంత అడిగితే అంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇవ్వకుంటే సామాన్యులపై దాడులు చేస్తున్నారు కూడా. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో వెలుగుచూసింది.

Advertisement

నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు దాడులకు తెగబడ్డారు. మ‌ద్యం మ‌త్తులో ఆసుపత్రిలో ప‌ని చేస్తున్న న‌ర్సుని మూమూలు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు ఎందుకుంటాయని ఆమె ఎదురు ప్రశ్నించింది. వారిని ప్రశ్నించడమే ఆ నర్సు చేసిన తప్పు. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆరుగురు హిజ్రాలు నర్సుని బ‌య‌ట‌కు లాకొచ్చి దాడి చేశారు.

కొన్ని ఫైల్స్ తీసుకుని కింద విసిరి పారేశారు. ఈలోగా పేషెంట్లు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ నర్సుని దాడి చేశారు. నర్సు జుట్టు పట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై బట్టలు చించేసి దాడి చేశారు హిజ్రాలు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో ఈతతంగమంతా రికార్డు అయ్యింది.

Advertisement

ALSO READ: జైలులో బత్తుల ప్రభాకర్ ఏమేమి చేసేవాడు

దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిజ్రాల‌పై క‌ఠినచ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ వీరి ఆగ‌డాలు పెరిగిపోతున్నాయని మండిప‌డుతున్నారు.

ఒకప్పుడు హిజ్రాలు సామాన్యులు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. అయితే ఉత్తరాది నుంచి ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలకు చాలామంది హిజ్రాలు వలస వచ్చారు. వారంతా రాష్ట్రాలు, ప్రాంతాలుగా విడిపోయారు. పిల్లల బర్త్ డే ఫంక్షన్లు, షాపు ఓపెనింగులు, గృహ ప్రవేశం వంటి కార్యక్రమాలు జరిగితే క్షణాల్లో వాలిపోతుంటారు.

వారికి కావాల్సినంత డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇంటి నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటారు. అంతేకాదు తెల్లవారుజామున వాహనంలో తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే పెళ్లి, గృహ ప్రవేశాలు తెలుసుకుని వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు కూడా.

 

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×