Best fitness smartwatches June 2026: హెల్తీగా ఉండటం, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం ఈ రోజుల్లో ఒక లైఫ్ స్టైల్ ట్రెండ్ అయిపోయింది. అయితే, మనం చేసే వర్కవుట్, రన్నింగ్ ఎంత వరకు ఎఫెక్టివ్‌గా పని చేస్తుందో తెలియాలంటే ఒక పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్ ఉండాల్సిందే. కేవలం స్టెప్స్ లెక్కించడమే కాకుండా.. బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ క్వాలిటీ, రికవరీ టైమ్ వంటి ప్రతి మైక్రో మేట్రిక్‌ను పక్కాగా ట్రాక్ చేసే టాప్ 5 స్మార్ట్ వాచ్‌ల వివరాలు వాటి ధరలతో సహా ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం.
ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అంటే కేవలం నోటిఫికేషన్స్ చూసుకోవడానికి మాత్రమే కాదు.. మన బాడీకి ఒక పర్సనల్ డాక్టర్‌లా, ఫిట్‌నెస్ కోచ్‌లా పనిచేస్తుంది. మార్కెట్లో దూసుకుపోతున్న టాప్-రేటెడ్ ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..
రన్నర్లు, అథ్లెట్లకు ‘గార్మిన్’ బ్రాండ్ ఒక ఎమోషన్. ఈ వాచ్ ఇచ్చే డేటా అంత పక్కాగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన AMOLED డిస్‌ప్లే ఉంది. దీని ‘ట్రైనింగ్ రెడీనెస్’ ఫీచర్.. మీరు ఈరోజు వర్కవుట్ చేయడానికి మీ బాడీ ఎంతవరకు సిద్ధంగా ఉందో చెప్తుంది. మల్టీ-బ్యాండ్ జీపీఎస్ ట్రాకింగ్ దీని ప్రత్యేకత. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.43,490 నుంచి రూ.45,999 మధ్య అందుబాటులో ఉంది.
మీరు ఐఫోన్ యూజర్ అయి ఉండి, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, హైకింగ్ ఇష్టపడితే దీనికి తిరుగులేదు. రగ్గడ్ టైటానియం కేస్‌తో వచ్చే ఈ వాచ్ 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. అడ్వాన్స్‌డ్ రన్నింగ్ మేట్రిక్స్, హార్ట్ రేట్ జోన్స్, వర్కవుట్ కస్టమైజేషన్ ఇందులో చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా నార్మల్ యాపిల్ వాచ్ కంటే చాలా ఎక్కువ. ఇదెలా ఉంటే ఈ వాచ్ ప్రీమియం లగ్జరీ కేటగిరీ కావడంతో దీని ధర రూ.85,999 నుంచి రూ. 89,900 వరకు ఉంటుంది.
ఆండ్రాయిడ్ లేదా శామ్‌సంగ్ మొబైల్స్ వాడేవారికి ఇది మోస్ట్ అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకర్. ఇందులో ‘బాడీ కంపోజిషన్ ఎనాలిసిస్’ఫీచర్ ఉంది. అంటే ఇది మీ బాడీలోని ఫ్యాట్ పర్సంటేజ్, స్కెలెటల్ మజిల్స్ బరువును కూడా కొలిచి చెప్తుంది. పర్సనలైజ్డ్ హార్ట్ రేట్ జోన్స్ వర్కవుట్ సమయంలో చాలా ప్లస్ అవుతాయి. ఇదెలా ఉంటే..అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో దీని ధర రూ.22,999 నుంచి రూ. 29,999 రేంజ్‌లో లభిస్తోంది.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్ , హోలిస్టిక్ హెల్త్ (మొత్తం ఆరోగ్యం)పై ఎక్కువ ఫోకస్ పెట్టేవారికి ఫిట్‌బిట్ బెస్ట్ ఆప్షన్. ఇది ఆల్-డే బాడీ రెస్పాన్స్ సెన్సార్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇది మీ శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు వెంటనే అలర్ట్ చేస్తుంది. ఈసీజీ (ECG), స్లీప్ ప్రొఫైల్, పీక్ హార్ట్ రేట్ ట్రాకింగ్ ఇందులో చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. ఇది సుమారుగా రూ.22,499 ధరలో లభిస్తోంది.
Also Read: తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!
ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు కానీ, రగ్గడ్ లుక్ , హెవీ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి అమేజ్‌ఫిట్ సూపర్ ఛాయిస్. మిలిటరీ గ్రేడ్ టఫ్‌నెస్ ఉన్న ఈ వాచ్ అవుట్‌డోర్ ట్రెక్కింగ్స్ కు సూపర్. ఆఫ్‌లైన్ మ్యాప్స్, 150+ స్పోర్ట్స్ మోడ్స్, ,ఏకంగా 20 రోజుల కంటే ఎక్కువ వచ్చే బ్యాటరీ లైఫ్ దీని ప్లస్ పాయింట్స్. దీనిని రూ. 21,999 లోపే సొంతం చేసుకోవచ్చు.
మీరు పక్కా ప్రొఫెషనల్ అథ్లెట్ అయితే Garmin, ఐఫోన్ లవర్స్ అయితే Apple Ultra 2 బెస్ట్ ఇన్ క్లాస్. అదే బడ్జెట్ , ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ లో బెస్ట్ కావాలనుకుంటే Samsung లేదా Amazfit వైపు వెళ్ళవచ్చు. ఈ టాప్ ఫిట్‌నెస్ వాచ్‌లలో మీ నీడ్‌కు సెట్ అయ్యే దాన్ని ఇప్పుడే ఆర్డర్ చేసి మీ ఫిట్‌నెస్ జర్నీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లండి.