BigTV English

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

Junior Movie: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే అనుకున్న సమయానికి ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేవరకు కాస్త అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అంతేకాదు ఎన్ని అనుకున్నా.. పలు కారణాలవల్ల ఆ సినిమాలు ప్రకటించిన తేదీలకు థియేటర్లలోకి రావనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలు థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఆలస్యం అవుతున్నాయి. అలాంటి చిత్రాలలో ‘జూనియర్’ మూవీ కూడా ఒకటి. శ్రీ లీల(SreeLeela).. గాలి కిరీటి రెడ్డి(Gali Kireeti Reddy) కాంబినేషన్లో వచ్చిన చిత్రం జూనియర్.


ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 22 నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆరోజు ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాలేదు. కానీ ఇప్పుడు కొత్త స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే..”సీనియర్ కి సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి. అందుకే జూనియర్ ఈనెల 30న వస్తున్నాడు” అంటూ క్యాప్షన్ పెట్టింది ఆహా. అలా మొత్తానికైతే సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దసరా కానుకగా ఈ సినిమాను ఆహా ఓటీటీలో చూడవచ్చు.

జూనియర్ సినిమా తారాగణం..


జూనియర్ సినిమా విషయానికొస్తే.. యంగ్ హీరో గాలి కిరీటి రెడ్డి తొలి పరిచయంలో శ్రీ లీల హీరోయిన్గా వచ్చిన చిత్రం ఇది. రాధా కృష్ణారెడ్డి రచనా దర్శకత్వం వహించగా వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జెనీలియా (Genelia) కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నుంచీ విడుదలైన “వైరల్ వయ్యారి సాంగ్” భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

జూనియర్ సినిమా స్టోరీ..

జూనియర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే వ్యక్తి అభి (కిరీటి రెడ్డి). అలా కాలేజీలో నాలుగేళ్ల జీవితాన్ని స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతాడు. చిన్నప్పటి నుంచి తను కోల్పోయిన జ్ఞాపకాలను పోగు చేసుకుంటాడు. ఆ తర్వాత తాను ఇష్టపడిన స్ఫూర్తి (శ్రీ లీల) పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే అసలు నచ్చదు. ఆమెకు తన పేరుతో ఉన్న విజయనగరం అనే ఊరు అంటే కూడా నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి .. ఇష్టంలేని అభితో కలిసి వెళ్లాల్సి వస్తుంది. అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ఊరికి విజయ సౌజన్యకి మధ్య సంబంధం ఏమిటి? అసలు ఆ పేర్లు ఆమెకు ఎందుకు నచ్చవు? దాని వెనుక ఉన్న బలమైన కథ ఏంటి ? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఈ సినిమాలో జెనీలియా కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ లీలాకి ఇది తొలి సినిమా.. కాకపోతే ఈ సినిమా ఆలస్యం వల్ల ఆమె ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.అలా దాదాపు కొన్ని సంవత్సరాలు వాయిదా పడిన ఈ జూనియర్ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది విడుదలైంది.

Related News

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×