E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోసం చక్రి ప్లాన్.. అయ్యో.. పాపం మహా.. మాధవ్ కోసం గాయత్రి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా కోసం చక్రి ప్లాన్.. అయ్యో.. పాపం మహా.. మాధవ్ కోసం గాయత్రి కన్నీళ్లు..
Advertisement

Podarillu Today Episode April 18th : హారిక దగ్గరికి వచ్చిన ఆది.. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.. నువ్వు ఆ మహాలక్ష్మికి ఆధార్ కార్డు ఇవ్వాలని అనుకున్నావు కదా.. అది మా ఇంటి పరువు ని తీసేసి పోయిందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి లేదు అని హారికను అడుగుతాడు ఆది.. అయితే నేను ఏమి ఇవ్వలేదు అని ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇవ్వడం నేను చూశాను. అందుకే నీ నెంబర్ రాసి అక్కడ పెట్టాను అని ఆది అంటాడు. అయితే ఆ మాట వినగానే మహా కు తప్పుడు నెంబర్ ఇచ్చాను అని హారిక ఫోన్ చేస్తుంది. మా ఆయన చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను మహా ఇంకొకసారి ట్రై చేస్తాను అని హారిక అనగానే మహాలక్ష్మి ఫీల్ అవుతుంది.

ఆది పై చక్రీ సీరియస్.. 

హారిక ఆ విషయాన్ని చెప్పగానే మహాలక్ష్మి ఆ విషయాన్ని వెంటనే చక్రితో చెప్తుంది. చక్రి మీ వాళ్ళకి బుర్ర లేదనుకున్నాను ఎలా రివెంజ్ తెచ్చుకోవాలో కూడా తెలియదా అని అంటాడు. ఇలా సిల్లిగా ఆధార్ కార్డు నెంబర్ మార్చేయడం, లేదంటే సర్టిఫికెట్లను చించేయడం లాంటివి మాత్రమే తెలుసా అని చక్రి అంటాడు.. వాళ్ల దగ్గర నుంచి ఇంకేది ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. సరేలేటి ఆధార్ కార్డు లేకపోతే ఫోన్ నెంబర్ కూడా కొత్తది తీసుకొచ్చేమో ఒకసారి కనుక్కుందాం పదండి అని చక్రి మహాలక్ష్మిని అక్కడ ఇక్కడ తిప్పిస్తాడు.. మహా మాత్రం ఆది చేసిన పనికి కోపంగా ఉంది అని అంటుంది.

కారును తన్నిన మహా.. 

Advertisement

అయితే మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిన సరే ఏదో ఒకటి అడుగుతూ వస్తున్నారు.. ఇక నాకు ఆధార కార్డు రాదేమో నా గోల్ నేను రీచ్ అవనేమో అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు అలా బాధపడకండి ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు సిమ్ ఉంటే చాలు కదా ఒకసారి ఆ సిమ్ లో ఏమున్నాయో ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకున్న పదండి అని అంటుంది. మహాలక్ష్మి సిమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేసిన ఆవిడ అది ప్రతాప్ పేరు మీద ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా నాన్న వచ్చి తంబ్ పెట్టాలి అంటే ఇప్పుడు కుదరదు అని బయటికి వచ్చి కారుని తన్నేస్తుంది.. ఏం వచ్చినా కూడా నా కారును తన్నేస్తారా ఏంటి అని చక్రి అడుగుతాడు.

మాధవ్ కోసం వెతికిన గాయత్రి..

గాయత్రి తమ బావని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బావని ఇలా దూరం చేసుకోవడం నేను సహించలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది. అయితే బావని ఎలాగైనా దగ్గర చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు శాశ్వతము దూరం అవుతున్నానేమో అని అనిపిస్తుంది అని గాయత్రి తన బావ ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ టైంలో బావ పనికి పోతూ ఉంటాడు కదా అని కిటికీలోంచి తన బావని వెతుకుతూ ఉంటుంది. అక్కడ మాధవ్ కూడా నెమ్మదిగా వెళ్లడంతో గాయత్రి భావన చూసి ఏడుస్తుంది..

చక్రీ ప్లాన్ ఫెయిల్.. 

Advertisement

చక్రి ఆధార్ కార్డు కోసం ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెప్పడంతో తాను కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నట్లు ఉంటాడు. చక్రి అనే బాధ పెట్టడం చూసిన మహాలక్ష్మి నాకోసం ఇతను ఎంత బాధ పడుతున్నాడు అని అంటుంది. ఆ తర్వాత చక్రి మహా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మి సంతోషంగా ఉంచాలి అని ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. చివరికి వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళగానే అందరితో సంతోషంగా మాట్లాడాలి అని అనుకుంటారు. ముఖ్యంగా మహాలక్ష్మి ఆ గాయత్రి కి పెళ్లి అవుతుంది కదా మనం కూడా పెద్దికి పెళ్లి చేద్దామని అంటుంది. ఆల్రెడీ మనం చూసిన సంబంధాలలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వెళ్లి అడిగితే మంచిది కదా అని అనుకున్నది మహాలక్ష్మి. మొత్తానికి మాధవ్ కి మరోసారి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది మహాలక్ష్మి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Illu Illaalu Pillalu Narmada: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద ఆస్తులు.. ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్            

Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

Big Stories

Advertisement
×