E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి సారీ చెప్పిన మహా.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న హారీక.. దొరికిపోయిన మహా..

Podarillu Today Episode : చక్రీకి సారీ చెప్పిన మహా.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న హారీక.. దొరికిపోయిన మహా..
Advertisement

Podarillu Today Episode June 5th : అందరూ బయటికి వచ్చిన తర్వాత మాధవ్ నేను ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్లి వస్తాను అని అంటాడు. అయితే లోపలికి వెళ్ళిన మాధవ్ ఇంకా ఏదైనా చేస్తాడేమో అని కేశవా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన మాధవ్ మా చక్రికి ఏమన్నా అయితే సమాధి చేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. లక్ష్మి ని ఇంకెప్పుడు మీ ఇంటికి పంపించము అని అంటాడు. ఇంకొకసారి మా ఇంటి లక్ష్మి ని దూరం చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ఎపిసోడ్ హైలైట్ గా మారుతుంది.. అందరిని కన్నీళ్లు పెట్టుకొనేలా చేస్తుంది..

చక్రీకి సారీ చెప్పిన మహా..

మహాలక్ష్మి నావల్ల ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అని అంటుంది. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దొంగ అని అంటున్న సరే నేను మాత్రం నీ గురించి అసలు నమ్మలేదు అని మహాలక్ష్మి అంటుంది. డబ్బులు పోయాయి బంగారం పోయింది అని ఎంతగా చెప్తున్నా మీరు వాటికోసం ఆశపడరు అని నా నమ్మకం.. మిమ్మల్ని ఎవరో కొట్టి వాటిని తీసుకెళ్లారేమో అని నేను చాలా కంగారు పడ్డాను అని మహాలక్ష్మి అంటుంది. నా వల్లే నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి సారీ అని అందరికీ సారీ చెప్తుంది మహాలక్ష్మి.. మీరు మాకు సారీ చెప్పడం ఏంటండీ అని అందరూ అంటున్న సరే మహాలక్ష్మి నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది అని అంటుంది.. గురించి ఏమనుకోవాలి ఏంటండీ మీరు ఇలా సారీ అని మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది. గయ్యాళి లాగ మీద పడుతుంటేనే బాగుంది అని చక్రి అనగానే మహాలక్ష్మి నీలో ఈ వెటకారం పోలేదుగాని నవ్వుతుంది.

ఇంట్లోంచి వెళ్లిపోతున్న హారిక..

Advertisement

హారిక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హారిక ఎక్కడికి వెళుతున్నావు అని ఆది అడుగుతాడు.. ఇలాంటి కూని కోర్ల ఇంట్లో నా బిడ్డను పెంచాలని అనుకోవడం లేదు.. మహా లాగే నేను కూడా బాగా చదువుకున్నాను కానీ వంటింట్లోనే మగ్గిపోతున్నాను అని హారిక అంటుంది. మీరు ఒక వ్యక్తి నమ్మించి ఇంటికి తీసుకుని వచ్చి చంపేయాలని చూసారు. ఇలాంటి దుర్మార్గులు ఉన్న ఇంట్లో నా బిడ్డను పెంచి దాన్ని కూడా నీలాగే మార్చాలని అనుకోవడం లేదు అని హారిక అంటుంది. హారిక మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆది అంటాడు. కానీ హారిక మాత్రం తను ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అని అంటుంది.. ఎలాగైనా సరే ఇంట్లోంచి నేను వెళ్ళిపోయి నా కాళ్ళ మీద నేను నిలబడి నా కూతుర్ని పెంచుకుంటాను అని హారిక అంటుంది..

హారికకు మాటిచ్చిన ప్రతాప్..

అసలు ఆ పెద్దాయనని కత్తితో పొడిచిన అప్పుడే నీ మీద నేను పోలీస్ కేసు పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. మీ తండ్రిలాగే మీరు కూడా కక్షలు అని పెంచుకొని ఇలా తయారయ్యారు.. నువ్వు ఏదైనా చెప్పు అని ఒక్కరోజేనా నన్ను అన్నారా..? నా అభిప్రాయంతో పని లేదు కేవలం మీరు అనుకున్నది చేయాలి అనుకున్న విధంగానే ఉండాలి అని నన్ను బలవంతం చేస్తూ ఉంటారు. తనని ఇలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మరోసారి వేరే వ్యక్తుల ముందు మీరు ఇలా చీపురు కనిపించడం నాకు నచ్చలేదు అందుకే నేను ఉద్యోగం చేసుకుంటూ నా బిడ్డను నేను చూసుకుంటాను అని అంటుంది. ప్రతాప్ మాత్రం నువ్వు చదివిన చదువుకి ఏదో ఒకటి చేసేలా నేను చేస్తానమ్మా మామ లాగా కాదు తండ్రి స్థానంలో నేను మీకు తోడుగా ఉంటాను అని ప్రతాప్ బ్రతిమలాడుతాడు..

లలితకు షాక్..

Advertisement

హారిక నేను చెప్తున్నాను కదా నువ్వు లోపలికి వెళ్ళు అని లలిత ఎంత చెప్తున్నా సరే హారిక మాత్రం మీరు ఉత్తమ ఇల్లాలు.. ఈ భర్త అడుగుజాడల్లోనే మీరు నడవాలని అనుకుంటారు.. మీకు నచ్చకపోతే చంపేయమని చెప్పారు నన్ను కూడా చంపేయమని చెప్తారు అంతే కదా అని హారిక అంటుంది. కన్న కూతురే మళ్ళీ చచ్చిపోయారు అని వెళ్ళిపోయింది. అని మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని హారిక ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతుంది. కానీ ప్రతాప్ ఇప్పుడు నా కూతురు వెళ్ళిపోయింది.. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుందమ్మా అందరు నన్ను ఎలా మాట్లాడుకుంటారు నీకు కావలసినట్లే ఇక మీదట ఉండు అని ప్రతాప్ మాటిస్తాడు. లోపలికి వెళ్ళిపోతుంది..

దొందు దొందే..

ఇంట్లోకి వెళ్లిన తర్వాత మాధవ్ అందరికీ మంచినీళ్లు ఇస్తాడు.. అయితే ఆ మంచినీళ్ళని మహాలక్ష్మి తీసుకొని తాగుతుంది.. మీరు తాగితే ఏమైంది నోట్లో ముంచుకుని తాగలేదు కదా అని మహా అంటుంది.. ఇక తర్వాత వాళ్లు నన్ను అవమానించారు.. నన్ను కొట్టారు. అందుకే అంత డబ్బు బంగారు ఏం చేసుకుంటారని నేను రెండు కొట్టేసాను అని చెక్రి కొట్టేసిన బంగారం నాణాలను చూపిస్తాడు. అవి చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. చక్రి చేసిందంతా తప్ప ఏమీ లేదు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. ఎందుకంటే నేను కూడా కొన్ని దొంగతనం చేశాను అని తాను దొంగతనం చేసిన ఆధార్ కార్డు పాన్ కార్డు గురించి బయటపడుతుంది. అది విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇవ్వమంటే ఇవ్వను అన్నారు కదా అందుకే నావి నేను తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది.. ఆ మాట వినగానే కేశవ దొందు దొందే.. ఇద్దరూ సరిపోయారు అని అనగానే మహాలక్ష్మి ఏం మాట్లాడావు అని కొట్టబోతుంది.. కేశవ, చక్రీ ఇద్దరు బయటకు పోతారు అందరూ సరదాగా నవ్వుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ అరెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×