Sudigali Sudheer : బుల్లితెరపై కమీడియన్గా ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్స్ తో, ప్రత్యేక ఇమేజ్ ని దక్కించుకున్న వాళ్ళలో సుడిగాలి సుదీర్ ఒకరు.జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్ట్ గా, టీమ్ లీడర్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఒకవైపు కమెడియన్ గా చేస్తూనే మరోవైపు తన కంటూ ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. మంచి ప్రశంసలు అందుకున్నారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక సుధీర్ సినిమాలతో పాటుగా పలు షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. అయితే ఆయా గేమ్ షోలకు యాంకర్ గా వ్యవహిరిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్ షోకు హాజరైన హీరోయిన్ కామెంట్స్ చేశారు. సుధీర్ పై అలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమందంటే..
సర్కార్ 5 సీజన్ ప్రోమో..
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న షోలలో సర్కార్ 5 కూడా ఒకటి. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టీవీ షో ప్రసారం అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. మూడు సీజన్లు యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేశారు. సీజన్ 4 నుంచి సుధీర్ హౌస్ట్ గా చేసుకున్నారు. సుధీర్ ప్రస్తుతం సర్కార్ 5వ సీజన్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా 4వ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది. కాగా తాజాగా ఇంట్రెస్టింగ్ ప్రోమోను విడుదల చేశారు.. ఈ ప్రోమోలో మారన్ టీం సందడి చేశారు. కోలీవుడ్ లో రూపుదిద్దుకున్న ‘మారన్ ‘ మూవీ టీమ్ గెస్ట్ గా హాజరైంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ, అజయ్ దిశాన్, బ్రిడిగా సాగా, నటి దీప్షికా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ తో ఫన్ క్రియేట్ చేశారు. ఆంటోనీ, అజయ్ లు ఇద్దరూ సుడిగాలి సుధీర్ మాటలకు పంచులు వేస్తూ నవ్వులు పూయించారు. ఇందులో దీప్షికా సుధీర్ మధ్య జరిగిన కన్వర్జేషన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మామూలుగా సుధీర్ పై అమ్మాయిలు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా మనసు పారేసుకుందని ప్రోమోను చూస్తే అర్థమవుతుంది..
Also Read: భూత్ బంగ్లా కాదు..అదొక పర్యాటక స్థలం.. కాజోల్ యూటర్న్..
సుడిగాలి సుధీర్ కు కన్ను కొట్టి మరీ..
సుడిగాలి సుధీర్ సినిమాలతో పాటు పలు షోలకు హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ తో తమిళ నటి దీప్షికా చాలా ఆసక్తికరంగా మాట్లాడింది. సుడిగాలి సుధీర్ తన లవ్ లైఫ్ గురించి చెబుతుంటే.. ఆమె బోల్డ్ కామెంట్స్ చేసింది.. సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక మార్గన్ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో టీమ్ గట్టిగానే ప్రమోట్ చేస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే సర్కారు 5 గేమ్ షోకు వచ్చారు.. దీప్షికా సుధీర్ మధ్య లవ్ ట్రాక్ ని క్రియేట్ చేశారు. మొత్తానికి అది ప్రోమో కి హైలైట్ గా మారింది. మరి ఎపిసోడ్ ఎలా సందడిగా ఉంటుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే…