Rashmika Mandanna:రష్మిక మందన్న (Rashmika mandanna).. ప్రస్తుతం కుర్రాళ్ళ క్రష్ కాదు స్టార్ సీనియర్ హీరోల క్రష్ కూడా.. నాగార్జున (Nagarjuna), చిరంజీవి(Chiranjeevi ), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది స్టార్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. తన చలాకీతనంతో.. వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. విజయపరంపరా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సీనియర్ స్టార్ హీరోయిన్ల రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి, స్టార్ హీరోలు కూడా క్రియేట్ చేయలేని రికార్డ్స్ సొంతం చేసుకుంది. మూడేళ్లలోనే రూ.3వేల కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది రష్మిక మందన్న.
స్టార్ హీరోకి కూడా సాధ్యంకాని రికార్డ్స్..
‘పుష్ప’, ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’ ఇలా వరుస చిత్రాలు.. ఒకదాని తర్వాత మరొకటి భారీ విజయాన్ని అందించాయి. వీటికి తోడు ఇటీవల ధనుష్(Dhanush ), నాగార్జున (Nagarjuna) కాంబినేషన్లో శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ మరో సక్సెస్.. ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొక సక్సెస్ అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది రష్మిక.
రష్మిక సక్సెస్ కి కారణం?
ఇకపోతే రష్మిక ఇంత తక్కువ సమయంలోనే ఇంత సక్సెస్ పొందడానికి కారణం ఏంటి.? ఆమె కథల ఎంపికనా? లేక ఆమెకు ఏదైనా అదృష్టం తలుపు తడుతోందా? లేదా ఆమె దగ్గర అతీత శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు కోణాలలో నెటిజన్లే కాదు అభిమానులు కూడా ప్రశ్నలు సంధిస్తూ ఆ ప్రశ్నల సమాధానం తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో రష్మిక మందన్నకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
అసలు విషయంలోకి వెళ్తే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) తో రాజశ్యామల యాగం చేయించింది రష్మిక. ఈ పూజా ప్రతిఫలమో ఇదంతా అని, వేణు స్వామి రాజశ్యామల యాగం చేసేటప్పుడు ఈమెకు ప్రత్యేకంగా ఒక వస్తువు ఇచ్చారని, ఆ వస్తువును తన దగ్గర ఉంచుకోవడం వల్లే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈమెను చుట్టూ ఆవహిస్తున్నాయని, ఈ కారణం చేతనే ఆమె ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ.. కథలు ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.
ప్రతి అడుగు పూల పాన్పే..
అందుకే ఆ తర్వాత కాలంలో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా హిట్ గానే నిలిచింది. ముఖ్యంగా ఒక్కో అడుగు ముందుకు వేసే కొద్దీ పూల పాన్పు ఈమెకు ఎదురుగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మాత్రం వరుస సూపర్ హిట్ సక్సెస్ లు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరచడమే కాదు.. అందరికీ రోల్ మోడల్ గా కూడా నిలిచిందని చెప్పవచ్చు.
ALSO READ:Aishwarya – Abhishek: విడాకులు నిజమే.. సీనియర్ హీరోయిన్ తో అభిషేక్ రెండో పెళ్లికి సిద్ధం!