BigTV English

Ramoji Film City : భూత్ బంగ్లా కాదు..అదొక పర్యాటక స్థలం.. కాజోల్ యూటర్న్..

Ramoji Film City : భూత్ బంగ్లా కాదు..అదొక పర్యాటక స్థలం.. కాజోల్ యూటర్న్..

Ramoji Film City : ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిల్మ్ స్టుడియో గా ఉన్న రామోజీ ఫిల్మ్‌ సిటీ పై బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశమని.. అక్కడ షూటింగ్ సమయంలో కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ వచ్చాయని ఆమె చెప్పారు. అంతేకాదు జీవితంలో మరోసారి అక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఆ వ్యాఖ్యల పై పెద్ద చర్చలు జరిగాయి. నిత్యం వరుస షూటింగ్ లు, పర్యాటక స్థలంగా ఉన్న ఫిలిం సిటీపై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంపై ఆమెపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది.. తాజాగా ఈమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.. ఆమె ఏమన్నారంటే..


ట్రోల్స్ కు భయపడ్డ కాజోల్..

రామోజీ ఫిలిం సిటీపై కాజోల్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. ఇలాంటివి చేసి ముందర ఆలోచించి చేయాల్సింది కదా అని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఈ వ్యాఖ్యలపై స్పందించింది. నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతోనే నేను స్పందించాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నా కెరీర్లో ఆర్ఎఫ్‌సీలో ఎన్నో సినిమాల షూటింగుల్లో పాల్గొన్నారు. చాలారోజులు అక్కడ స్టే చేశారు. ఫిలిం మేకింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ వాతావరణం కనిపిస్తుంది. అక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అందులోకి వచ్చే పిల్లలు పర్యటకులు ఈ ప్రదేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు. అయితే తనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఆమె ఇలా యూటర్న్ తీసుకుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..


Also Read : మంగళవారం టీవీ ఛానెల్స్ లోకి వచ్చే సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

రామోజీ ఫిలిం సిటీ పై సెలబ్రిటీల నెగిటివ్ కామెంట్స్.. 

సినిమా షూటింగ్లకు, వినోదాలకు కేరఫ్ గా మారిన రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఫిలిం స్టూడియో. సినిమాలకు మాత్రమే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ ప్లేస్ చాలా అద్భుతమైనది. అందుకే నిత్యం ఇక్కడ జనాలతో రద్దీగా ఉంటుంది. అయితే రామోజీ ఫిల్మ్‌ సిటీపై కాజోల్ కంటే ముందే కొందరు సెలబ్రెటీలు నెగిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. తాప్సి, రాశీఖన్నా, ఎంఎం కీరవాణి లాంటి వారు సైతం ఆర్ఎఫ్‌సీలో తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని, ఒక రూమ్ లోకి వెళ్తే దెయ్యాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది అని ఇలా చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ ని చేశారు. వారు గతంలో ఎప్పుడో చెప్పిన వివరాలు కాజోల్ పుణ్యమాని ఇటీవల మళ్లీ వైరల్ అయ్యాయి. తాజాగా కాజోల్ యూటర్న్ తీసుకోవడంతో ఆర్ఎఫ్‌సీపై ఇలాంటి ప్రచారానికి తెర పడుతుందా? లేదా మరొక వార్త చర్చనీయంగా మారుతుందా అన్నది తెలియాల్సింది. ఏది ఏమైనా కూడా కాజోల్ తన మాటల్ని వెనక్కి తీసుకోవడంపై సినీ అభిమానులు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

Related News

‎OG Censor : ‘ఓజీ’ ఇట్స్ A సర్టిఫికేట్ మూవీ… అయినా రెండు నిమిషాలు కట్ చేశారు

Dharma Wife: రాత్రిళ్ళు మాత్రమే ఫ్లాట్‌కి వస్తుంది.. క్యారెక్టర్ లేదా? రీతు చౌదరిపై ధర్మా భార్య గౌతమి ఫైర్!

‎Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్‌ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

‎Ranbir Kapoor: రణబీర్ కపూర్ కు షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ఆర్సీ… చర్యలు తీసుకోవాలంటూ!

Balayya: బాలయ్య తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి చేసే పని ఇదేనట, వామ్మో!

OG Fever: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్

Big Stories

×