Satyabhama Today Episode January 16th : నిన్నటి ఎపిసోడ్ లో… క్రిష్ సత్యను అనుమానంగా చూస్తాడు. ఏంటి అలా అనుమానంగా చూస్తున్నాడు. కొంపతీసి నా ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందని సత్య టెన్షన్ పడుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. బల్లి శాస్త్రం ప్రకారం మృత్యుంజయ హోమం చేస్తే చాలా మంచిది అని పంతులు చెప్తాడు. మహదేవయ్యను టెన్షన్ పెడుతుంది భైరవి.. అయ్యో పెనిమిటి నాకు తాలికొండమ్మ మీరు లేకుండా నేను అసలు ఊహించుకోలేను అనేసి ఏదేదో అంటుంది దానికి కోపంతో మహదేవ ఆ మృత్యుంజయ హోమం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక అంతే కాదమ్మా ఇందులో ఒక చిక్కు ఉందని పంతులు చెప్తాడు.. అదేంటి పంతులుగారు ఇంకా ఏదైనా సమస్య ఉందా అని భైరవి అడుగుతుంది. సమస్య కాదమ్మా ఈ హోమం తర్వాత మీరు ఇంట్లోని ఆడవాళ్ళ కోరికలు తీర్చాలని అంటాడు. అదేం పెద్ద భాగ్యం కాదు అలానే పంతులుగారు మీరు ముందు హోమం చేయించండి ఈ బల్లి గురించి నాకు టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా ముందు తొలగిపోతే చాలు వాళ్ళ కోరికల్ని తీరుస్తానని భైరవి భరోసా ఇస్తుంది. ఇక భైరవి మహదేవయ్యను ఒప్పించి హోమాన్ని పూర్తి చేస్తుంది. ఇక హోమం సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత పంతులు చెప్పినట్లు అందరు కోరికలు తీర్చాలని భైరవి అనుకుంటుంది. భైరవి అందరి కోరికలు తీరుస్తుంది.. చక్రవర్తి కూడా సపోర్టుగా నిలుస్తాడు. ఒకవైపు మహదేవ బెదిరిస్తున్న కూడా నేను సత్య కే సపోర్ట్ చేస్తాను నీ బెదిరింపులకి భయపడి రోజులు పోయాయి అన్నయని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..సంతకం చేయడానికి పది మంది దొరికేసినట్టే అని క్రిష్ మనసులో సంతోషపడతాడు. సంపంగి చాలా సంతోషంగా ఉంది కదా ఈరోజు ఎలాగైనా నా సంపంగి నేను బాగా ఎంజాయ్ చేయాలని క్రిష్ అనుకుంటాడు. అని సత్య వచ్చి క్రిష్ కు పెద్ద షాక్ ఇస్తుంది ఈ సంతోషమంతా నాది కదా నేను కష్టపడ్డాను కదా అయితే ఒక్కడినే ఎంజాయ్ చేయాలి నేను ఎలక్షన్స్ లో పోటీ చేసేంతవరకు నాకు అందరూ సాయం చేసే అంతవరకు మన మధ్య ఈ దూరం ఉండాలి అని అంటుంది దాంతో క్రిష్ షాక్ అవుతాడు. ఇక ఉదయం లేవగానే నామినేషన్స్ వేయడానికి మహదేవయ్య కుటుంబం అందరూ రెడీ అవుతారు. మహదేవయ్యాను ఊరేగింపు నామినేషన్స్ కు తీసుకెళ్లాలని రుద్ర ప్లాన్ చేస్తాడు. భైరవి వీర తిలకం దిద్ది హారతి ఇవ్వాలని అనుకుంటుంది కానీ మహదేవయ్య నాకు చిన్న కోడలు హారతి ఇస్తేనే విజయం సాధిస్తానని అంటాడు. ఇక సత్య మీ ఓటమికి తొలి అడుగు అని హారతి ఇచ్చి వీర తిలకం దిద్దుతుంది.
నీవల్ల నా పెనిమిటికీ హారతి కూడా ఇవ్వలేకున్నాను నీవల్ల అందరి దృష్టిలో నేను శత్రువుని అయిపోయాను హారతి కూడా ఇవ్వలేకపోయాను అని భైరవి సత్యను తిడుతుంది. ఇక మహదేవయ్యాను ఊరేగిస్తూ బయటకు తీసుకెళ్తారు. బైరవి నీతోపాటి నీ పక్కన ఊరేగింపుకు రావాలని అంటుంది. మహదేవయ్య మాత్రం సత్యకు నామినేషన్స్ లో సంతకం చేయడానికి వెళుతూ నాతో ఎలా వస్తావని అనగానే బైరవి షాక్ అవుతుంది.. ఇకపై మహదేవను ధూంధాం గా నామినేషన్స్ కి తీసుకెళ్తారు. ఆడవాళ్ళందరికీ ఒక కారులో తీసుకెళ్తారు. నామినేషన్స్ దగ్గరికి రాగానే సత్య ఫ్యామిలీ అక్కడికి వస్తుంది బైరవి మాటలతో వాళ్ళని బాధపెడుతుంది. నరసింహం కూడా అక్కడికి వచ్చి మహదేవ్ను ఇటు సత్యం ఎవరిని వదలకుండా నోటికొచ్చినట్లు తిడతాడు. ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు వచ్చి మీరు ఇలా గొడవపడితే మేము ఎన్నికల ఆపేస్తామని అనగానే అందరితో గొడవను ఆపేస్తారు.
ఇంట్లో ఉన్న నీ కోడలే పోటీగా దిగుతుంది అంటే నువ్వు ఎలాంటి వాడివో జనాలకు తెలుస్తుంది నీ కోడలు నేను ఉద్ధరించలేను వాడివి జనాలు ఏం ముద్రిస్తావని నరసింహ మహదేవైనా అంటాడు. అటు సత్య కూడా ఇది మా ఇంట్లో గొడవ మీకు అవసరం లేదు అని నరసింహను అరుస్తుంది. మహదేవయ్యకు కోపం వచ్చి నరసింహను చంపేయమని క్రిష్ తో అంటాడు. సత్య ఆపడంతో క్రిష్ వెనక్కి తగ్గుతాడు. దానికి రుద్ర నీ పెళ్ళాం చెప్పిందని ఆగిపోయావా బాపు మాట అంటే నీకు లెక్క లేదా అని క్రిష్ ను రెచ్చగొడతాడు.. ఇక అందరూ కలిసి నామినేషన్స్ వేయడానికి లోపలికి వెళ్తారు.. మహదేవయ్య నామినేషన్స్ వేయడానికి నీతానా మంది లేరు కదా అనేసి అనగానే అటు ఒకసారి చూడండి మావయ్య గారు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో సంధ్య మిస్ అవుతుంది సందీప్ కి ఫోన్ చేస్తే నేను రాను అని పెట్టేస్తుంది మరి సత్యకు సపోర్టుగా ఎవరిని నిలుస్తారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.