Nitish Kumar Reddy: టీమిండియా యంగ్ క్రికెటర్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వెళ్లి…. ఒక్క సిరీస్ తోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. వాస్తవంగా తెలుగు కుర్రాడు అయిన నితీష్ కుమార్ రెడ్డి… టీమిండియా తరఫున దాటిగా ఆడటంతో.. మన తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు తెలియని వారు లేకుండా పోయారు. అయితే మొన్న ఆస్ట్రేలియా పైన ఆడిన ఇన్నింగ్స్ తర్వాత.. నితీష్ కుమార్ రెడ్డి క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది.
Also Read: Ind Women vs Ire Women: 304 పరుగుల తేడాతో టీమిండియా విజయం… సిరీస్ క్లీన్‌స్వీప్ !
ఇక ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి… వరుసగా దేవాలయాలు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy )… సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడిపందాల్లో సందడి చేశాడు టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ). ఏపీలో కోడిపందాలు ప్రస్తుతం విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ కావడంతో… చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలామంది… కోడిపందాలలో ( Kodi Pandalu ) పాల్గొంటున్నారు. కొంతమంది కోడిపందాలలో పాల్గొంటే… మరికొంతమంది మాత్రం… ఈ కోడిపందాలను వీక్షించేందుకు తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన రీల్స్ మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) కూడా కోడిపందాల్లో కనిపించారు.
Also Read: Smriti Mandhana: సెంచరీతో దుమ్ములేపిన స్మృతి.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రికార్డు !
భీమవరంలో కోడిపందాలు ( Kodi Pandalu ) జరుగుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లారు. తన స్నేహితులతో కలిసి.. కోడిపందాలు చూడడానికి భీమవరం వెళ్లారు నితీష్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, ఫాన్స్.. ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. టీమిండియా రేంజ్ కి వెళ్లిన నితీష్ కుమార్ రెడ్డి ఇలా కోడిపందాలు పాల్గొంటున్నాడా అని షాక్ అవుతున్నారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) కోడిపందాలు చూడడానికి మాత్రమే అక్కడికి వెళ్లారు.
ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. మోకాళ్లపై నడిచి మరి.. తిరుమలకు చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. విఐపి దర్శన మార్గంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక లేటెస్ట్ గా భీమవరంలో జరిగిన కోడిపందాల్లో కనిపించే సందడి చేశారు. మొత్తానికి తెలుగు కుర్రాడు సాధారణ జనాల లాగానే అందరిలో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. టీమిండియా ప్లేయర్ అన్న గర్వం లేకుండా దూసుకు వెళ్తున్నాడు.
కోడి పందాల్లో టీమిండియా యువ క్రికెటర్..
భీమవరంలో కోడి పందాలను తిలకించిన నితీష్ కుమార్ రెడ్డి pic.twitter.com/bVtx73mdTF
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025