Brahmamudi serial today Episode: రూంలోకి వచ్చిన కావ్యను రాజ్ దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటాడు. వద్దండి ఎవరైనా చూస్తూ బాగోదు అయినా మనం సీమంతానికి వచ్చి ఇలా చేస్తే ఏమైనా బాగుంటుందా.? చెప్పండి అని అడుగుతుంది. దీంతో హలో హలో ఏం మాట్లాడుతున్నావు. నాకు కొంచెం సెన్స్ ఉంది. నిన్ను పిలిచింది అందుకు కాదు.. అంటూ జ్యువెల్లరీ బాక్స్ తీసి కావ్య చేతిలో పెడుతూ ఇందుకు అంటాడు. దీని కోసమేనా అంత సీక్రెట్‌గా పిలిచావు అంటూ నిట్టూరుస్తుంది కావ్య. నువ్వే ఏదేదో ఊహించుకుని ఇప్పుడు నన్ను అంటే ఎలా అంటాడు రాజ్.
మగాళ్లు అలా పిలిస్తే ఏ పెడ్లాం అయినా ఇలాగే ఫీల్ అవుతుంది. అయినా ఈ నెక్లెస్ ఎందుకు తీసుకొచ్చావు.. ఆరోజు ఈ నెక్లెస్ విషయంలోనే నువ్వు తిట్టావు కదా..? అదే ఇప్పుడు నువ్వు గిఫ్టుగా ఇస్తే..చాలా సంతోషిస్తుంది.. అని రాజ్ చెప్పగానే.. అవును సంతోషిస్తుంది. ఈ లోకంలో నా సంతోషం తప్పా అందరి సంతోషం గురించి ఆలోచిస్తారు మీరు అనగానే… ఇప్పుడు నీకేం చేశాను. నీతో బాగానే ఉంటున్నాను కదా..? అంటాడు రాజ్.
ఉంటున్నారు బాగానే.. అంటి ముట్టనట్టు.. సరసం ఆడి ఆడనట్టు.. సముద్రంలో తీరం లాగా అలలు వచ్చి ఎప్పుడు తాకుతాయా అని ఎదురుచూస్తుంది నా మనసు..అంటుంది కావ్య. నా పద్దతిలో ఇంత వెతుకుతున్నావా..? అంటాడు రాజ్. ఇందులో వెతకడం దేనికి కనిపిస్తూనే ఉంది కదా..? నాతో అవసరం లేన్నప్పుడు పతాలు, పట్టింపులు, గొడవలు.. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కాబట్టి నా అవసరం వచ్చింది మీకు అంటూ కావ్య అనగానే.. అమ్మ కళావతి లోపల ఇంత దాచుకున్నావన్నమాట అంటాడు రాజ్. ఇంట్లోంచి బాధపడుతూ బయటకు వచ్చిన రుద్రాణి.. ఫంక్షన్ అయ్యే వరకు ఇక్కడే బయట కూర్చుందామని ధాన్యలక్ష్మీతో కలిసి వస్తుంది. ఇరిగిపోయిన కుర్చీ మీద శాలువ కప్పి ఉండటంతో ఆ కుర్చీలో కూర్చోవడానికి రుద్రాని వెళితే.. సీమంతం శ్రీను ఆగండి అంటూ పరుగెత్తుకొస్తాడు.
ఈ కుర్చీలో కూర్చోవద్దు అంటాడు. దీంతో నువ్వెవడివిరా నన్ను ఈ కుర్చీలో కూర్చోవద్దు అనడానికి అంటూ కోప్పడుతుంది రుద్రాణి. ఇంతలో కనకం వచ్చి వద్దంటున్నాడు కదా వదిన ఎందుకు కూర్చుంటారు అని చెప్తుంది. మీరు వద్దంటున్నారు కాబట్టి నేను కచ్చితంగా ఈ కుర్చీలోనే కూర్చుంటాను అంటుంది రుద్రాణి. నేను కూర్చోనివ్వను అంటాడు శ్రీను. రుద్రాణి లాగిపెట్టి శ్రీనును కొడుతుంది. పోనీలే వదిన వాడు వద్దంటున్నాడు కదా అని కనకం చెప్తే.. అయినా వద్దనడానికి మీరెవరు అంటూ ధాన్యలక్ష్మీ నేను కూర్చుంటాను అంటుంది. రుద్రాణి.. పంతానికైనా పగకైనా నేనే అంటూ వెళ్లి రుద్రాణి కుర్చీలో కూర్చుని కిందపడిపోతుంది.
అపర్ణ, ఇందిరాదేవి, కనకం.. స్వప్నను రెడీ చేస్తుంటారు. నెక్లెస్ తీసుకుని స్వప్న దగ్గరకు వస్తుంది కావ్య. అక్కా నీకొక సర్‌ప్రైజ్ అని చెప్తుంది. స్వప్న ఏంటే అని అడగ్గానే.. నువ్వే చూడు అని నెక్లెస్ ఇస్తుంది. నెక్లెస్ చూసిన స్వప్న ఆశ్చర్యపోతుంది. ఇది నువ్వు అమ్మేయలేదా..? అని అడుగుతుంది. లేదక్కా.. ఇది నీ సీమంతానికి దుగ్గిరాల ఇంటి నుంచి ఇచ్చే కానుక అని చెప్తుంది. అంతా బయటి నుంచి చూస్తున్న రుద్రాణి, ధాన్యలక్ష్మీ లోపలికి వస్తారు. శబాష్ కావ్య మీరిద్దరూ ఎంత తోడుదొంగలో అర్థం అయింది. అక్కను మించి చెల్లి, చెల్లిని మించి అక్కా.. మహా నటన చూపిస్తున్నారు.
అయినా కనకం కూతుళ్లు కదా అంటుంది రుద్రాణి. ఏమైంది ఇప్పుడు నువ్వు ఎందుకు అంత వెటకారం చూపిస్తున్నావు అని అపర్ణ అడుగుతుంది. ఏమైందా..? కళ్ల ముందు సాక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా వదిన. నెక్లెస్ తీసుకోమని అక్కకు చెక్కు ఇచ్చి నెక్లెస్ కొనుక్కోమంది. అప్పుడు ఇష్యూ అయ్యే సరికి అక్కను తిట్టింది. ఇప్పుడు ఇలా చేసింది. దీన్నేమంటారు అని రుద్రాణి అనగానే.. చావు తెలివితేటలు అంటారు. తోడబుట్టిన అక్కను ఒకలా చూసి మనింట్లో మాత్రం అందరినీ అడుక్కునేలా చేసింది అంటుంది ధాన్యలక్ష్మీ.. ఇంతలో సుభాష్, ప్రకాష్ వస్తారు. ఇప్పుడు దాని గురించి అంత అవసరమా..? మనం సీమంతానికి వచ్చాం.. సీమంతం జరిపించి వెళ్దాం అంటాడు సుభాష్.
ఎప్పటి లెక్క అప్పుడే తీరాలి అన్నయ్యా అంటుంది రుద్రాణి. లెక్కలేస్తున్నావా..? ఇక్కడ జరిగేది నీ కోడలి సీమంతం నువ్వే గొడవ మొదలుపెడతావేంటి..? అసలు బుద్దుందా నీకు.. అంటాడు సుభాష్. బుద్దే ఉంటే అది రుద్రాణి ఎందుకు అవుతుంది అంటుంది ఇదిరాదేవి. దీంతో స్వప్న కోపంగా ధాన్యలక్ష్మీ, రుద్రాణిని తిడుతుంది. మేము ఇద్దరం కలిపిపోయి ఉంటే.. మేము ఎప్పుడో మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టేవాళ్లం. అంటూ వార్నింగ్ ఇస్తుంది. అక్కా చెల్లెలు ఇద్దరూ రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాక మళ్లీ దబాయిస్తావేంటి అంటుంది రుద్రాణి.
ఇంతలో రాజ్ వచ్చి ఆ నెక్లెస్ ఇక్కడికి కళావతి తీసుకురాలేదని అది తీసుకొచ్చింది నేనే అంటాడు. తను అందరి కోసం కష్టపడుతుంది. స్వప్న నువ్వు హ్యాపీగా ఉండు వీళ్ల మాటలేం పట్టించుకోకు అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో స్వప్న కోపంగా ఏమత్తా రాత్రి వచ్చి ఏదేదో అన్నావు.. నాకు నా చెల్లికి మధ్య దూరం పెంచావు ఇప్పుడేమంటావు.. ఎప్పటికైనా మేము ఇద్దరం ఒక్కటే ఇక వెళ్లు అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ, రుద్రాణి బయటకు వెళ్లిపోతారు.
ఇంతలో రాహుల్ వచ్చి రుద్రాణిని బయటకు తీసుకెళ్లి హాస్పిటల్ బిల్ కట్టింది కంపెనీ చెక్ తో కాదు.. క్యాష్‌తో అది కూడా నగలు తాకట్టు పెట్టి బిల్ కట్టారు అని చెప్తాడు. కావ్య ఇంటి దగ్గర నుంచి నగలు వేసుకోకుండా వచ్చినప్పుడే నాకు డౌటు వచ్చింది. అయినా నగలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమోచ్చింది అని డౌటు క్రియేట్ చేస్తుంది రుద్రాణి. ఏమో కంపెనీ దివాలీ తీసిందేమో అంటాడు రాహుల్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?