E-Paper
Advertisement

Illu illaalu Pillalu Bhagyam : భాగ్యం ఎక్కడా తగ్గదు.. పంతంతోనే పెళ్లి.. అన్నీ ట్విస్ట్ లే..

Illu illaalu Pillalu Bhagyam : భాగ్యం ఎక్కడా తగ్గదు.. పంతంతోనే పెళ్లి.. అన్నీ ట్విస్ట్ లే..
Advertisement

Illu illaalu Pillalu Bhagyam : బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమాలను మించిన కథలతో, రివెంజ్ డ్రామాలతో ఈ మధ్య వస్తున్న సీరియల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొ టీవీ ఛానల్ ఒక్కో విధంగా డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ లను ప్రసారం చేస్తున్నాయి. అందులో స్టార్ మా చానల్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎప్పుడూ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతూనే ఉంది. ఈ సీరియల్ లో నటించిన భాగ్యం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె అసలు పేరు మిర్చి మాధవి. మిర్చి మూవీతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు మాధవి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నన్ను అంతమాట అనేశాడు..

మిర్చి మాధవి పెళ్లి గురించి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆమెకు తన తల్లి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చిన విషయాన్ని చెప్పారు. అయితే మొదట్లో నాకు ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు. నాకు నచ్చలేదని మా అమ్మతో చెప్పేసాను. కానీ మా అమ్మ మాత్రం బ్యాంకు ఉద్యోగం మంచి అబ్బాయి అంటూ నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ నేను కన్విన్స్ అవ్వలేకపోయాను. ఇక ఏదైనా ఒప్పుకున్న టైం కి ఆ అబ్బాయి నేను నచ్చలేదని చెప్పేసాడు. హీరోయిన్ మెటీరియల్ అయిన నేను ఎందుకు నచ్చలేదు అని మొదట్లో బాధపడ్డాను.. కానీ, ఆ తర్వాత ఎలాగైనా సరే అతన్ని పెళ్లి చేసుకోవాలని పంతం పట్టి కూర్చున్నాను.. అలా అలా మొత్తానికి పంతం తోనే నేను పెళ్లి చేసుకున్నాను అని ఆమె ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read :గుండెల్ని పిండేసే స్టోరీ.. సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో తెలుసా..?

మిర్చి మాధవి రెమ్యూనరేషన్..

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని చాలా మంది నిరూపిస్తున్నారు.. సీరియల్స్ లో నటిస్తూ సినిమాల్లోకి వెళ్తున్నారు. మిర్చి మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మాధవి.. ఆ మూవీ తర్వాత మిర్చి మాధవిగా పాపులర్ అయ్యింది. బుల్లితెరపై ప్రసారమైన గుప్పెడంత మనసు ఇలాంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో భాగ్యం పాత్రలో నటిస్తున్న ఈమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాలు సీరియల్స్లలో బిజీగా ఉన్నా మాధవి రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ఒక్కో సినిమాకి సీరియల్ కి ఎంత తీసుకుంటుందో అని నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ప్రస్తుతం మాధవి ఒక్కో సీరియల్కు దాదాపు 30 వేలకు పైగా తీసుకుంటుంది. ఒక్క రోజుకి ఇంత తీసుకుంటే నెలకు లక్షల్లోనే ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పవచ్చు.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు మాధవి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×