Telugu TV Serials TRP Ratings : బుల్లితెర ఆడియన్స్ కి వినోదాన్ని అందించే వాటిలో సీరియల్స్ ఒకటి.. టీవీ చానల్స్ లో బోలెడు సినిమాలు వస్తున్నా సరే ఈమధ్య వస్తున్న సీరియల్స్ స్టోరీ మంచిగా ఉండడంతో ప్రతి ఒక్కరూ సీరియల్స్ చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎటు లేదన్న కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య వస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. గత వారానికి ఏ సీరియల్ టాప్ లో ఉందో ఒకసారి చూసేద్దాం..
నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఈ సీరియల్. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రసారమవుతుంది. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చూస్తే.. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 13.53 రేటింగ్ తో దూసుపోతుంది.
స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో హిట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రేటింగ్ విషయంలో అస్సలు తగ్గట్లేదు.. రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 12.58 రేటింగ్ నమోదైంది.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఇప్పుడు కాస్త ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 12.39 ఉందని తెలుస్తుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా పెరిగింది.
స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న కుటుంబ కథా సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 11.50 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..
కొత్త సీరియల్ ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం గమనార్హం.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పెరిగింది. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా రేటింగ్ పెరిగింది. అదే విధంగా కొత్త సీరియల్ నిండు మనసులో సీరియల్ని నిన్ను మనసులు సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. నిండు మనుసులు 9.20 రేటింగ్ అందుకుంది. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.50తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.23 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.40 రేటింగ్తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. కేవలం స్టార్ మా లో మాత్రమే కాదు అటు జెమినీలోనూ, ఇటు జీతెలుగు లోనూ కొత్త సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.