Pratika Rawal Injury: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సెమీస్ ఫైనల్ పోరు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ కు ( Pratika Rawal Injury ) తీవ్ర గాయం అయింది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న గ్రూప్ స్టేజి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడింది టీం ఇండియా. ఈ మ్యాచ్ నామమాత్రపుది అయినప్పటికీ, ఫీలింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా ఓపెన్ ప్రతీకా రావల్ తీవ్రంగా గాయపడ్డారు. బంతిని ఆపే క్రమంలో పరుగు తీస్తుండగా కాలు మడత పడడంతో, మడమ అలాగే మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రతీకా రావల్ ( Pratika Rawal ) మడమ దగ్గర విరిగినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత నడవలేని పరిస్థితిలో ఉన్న ప్రతీకా రావల్ మైదానాన్ని వీడి పెవిలీయన్ కు వెళ్ళిపోయారు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ సమయంలో కూడా ప్రతీకా రావల్ బ్యాటింగ్ చేయకపోవడం అందరినీ కలవర పెడుతోంది. మొన్ననే సెంచరీ చేసిన ప్రతీకా రావల్, ఇప్పుడు గాయపడటం టీమిండియాకు ఎదురుదెబ్బే.
ఇక గ్రౌండ్ లో ప్రతీకా రావల్ కుప్పకూలిన నేపథ్యంలో వెంటనే మెడికల్ టీం రంగంలోకి దిగింది. ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతీకా రావల్ ఆసుపత్రిలోనే స్పెషల్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ గాయం నేపథ్యంలో సెమీ ఫైనల్ లో ఆడే ఛాన్స్ లేనట్టు చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీ ఫైనల్ 2లో తలపడనుంది ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ప్రతీకా రావల్ అందుబాటులో ఉండడం కష్టమే అంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఆరు మ్యాచ్ లలో ఏకంగా 308 పరుగులు చేశారు ప్రతీకా రావల్. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో వర్షం విలన్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికి సగం మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఇక నిన్న గ్రూప్ స్టేజిలో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా తలపడగా, ఈ మ్యాచ్ లో కూడా వర్షం విలన్ గా మారడంతో మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పయి 119 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 57 పరుగులు చేయగా వర్షం భారీగా పడింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు.
Pratika Rawal's ankle twisted while fielding. 🙁#CricketTwitter #CWC25 pic.twitter.com/xXLzb7CGCN
— Female Cricket (@imfemalecricket) October 26, 2025
A freak injury for Indian opener #PratikaRawal while diving to save a boundary! 😧
Catch the LIVE action ➡ https://t.co/AHK0zZJTc3#CWC25 👉 #INDvBAN | LIVE NOW pic.twitter.com/xvWH7lFTrV
— Star Sports (@StarSportsIndia) October 26, 2025