BigTV English
Advertisement

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : హారర్ సినిమా ఫ్యాన్స్ ను భయపెట్టించిన ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో దద్దరిల్లిపోయింది. ఒక పెద్ద క్రూ షిప్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఇది దెయ్యాలతో నిండి ఉంటుంది. దాని బారిన పడ్డ కొంతమంది, ఎలా బయట పడ్డారనేదే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఘోస్ట్ షిప్’ (Ghost Ship) అనే సినిమా ఒక సూపర్‌ నాచురల్ హారర్ ఫిల్మ్. ఇది స్టీవ్ బెక్ దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా 91 నిమిషాలు ఉంది. ఇది 2002 అక్టోబర్ 25న అమెరికా థియేటర్లలో విడుదలైంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. $20 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $68.3 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

ఈ కథ 1962లో మొదలవుతుంది. ఆంటోనియా గ్రాజా అనే లగ్జరీ ఓషన్ లైనర్ షిప్‌లో ఒక గ్రాండ్ పార్టీ జరుగుతోంది. ప్యాసింజర్స్ అందరూ డ్యాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తుంటారు. ఒక అందమైన ఇటాలియన్ సింగర్ పాట కూడా పాడుతుంటుంది. కానీ ఇంతలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఒక స్టీల్ కేబుల్ వల్ల డ్యాన్స్ ఫ్లోర్‌ ధ్వంసం అవుతుంది. దీని వల్ల షిప్‌లోని దాదాపు అందరూ ఒక్కసారిగా చనిపోతారు. ఈ ఓపెనింగ్ సీన్ చాలా షాకింగ్ గా ఉంటుంది. 40 ఏళ్ల తర్వాత, 2002లో ఒక షిప్ కెప్టెన్ మర్ఫీ తన టీం తో ఈ మిస్టీరియస్ షిప్‌ను కనుగొంటాడు. వాళ్లు ఈ షిప్ ఆంటోనియా గ్రాజా అని తెలుసుకుని, దాన్ని టో చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. మొదట వాళ్లకు ఇది ఒక గోల్డ్ మైన్ లాగా అనిపిస్తుంది.


Read Also : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

క్రూ షిప్‌పైకి ఎక్కగానే, విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. షిప్ లోపల అంతా 1960 స్టైల్ ఫర్నీచర్, డెకరేషన్స్ ఉంటుంది. ఒక చిన్న ఘోస్ట్ దెయ్యం వీళ్ళకు కనిపిస్తుంది. ఆమె షిప్‌లో ఏదో డేంజర్ ఉందని వార్న్ చేస్తుంది. అయితే క్రూ షిప్‌ను ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే, గోల్డ్ బార్స్ కనిపిస్తాయి. కానీ అదే సమయంలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఒక్కొక్కరూ మిస్టీరియస్ గా చనిపోతుంటారు. మర్ఫీ షిప్ లాగ్‌బుక్‌ను చూసి, 1962లో ఏదో టెర్రిబుల్ జరిగిందని తెలుసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఈ షిప్ సీక్రెట్ రివీల్ అవుతుంది. 1962లో షిప్‌లో ఒక డెమోనిక్ ఫోర్స్ గోల్డ్ కోసం ప్యాసింజర్స్‌ను చంపింది. ఇప్పుడు వాళ్ళు అందులో దెయ్యాలుగా తిరుగుతున్నారు. ఇది తెలుసుకుని మిగిలిన వాళ్ళు భయంతో వణికి పోతారు. చివరికి వీళ్ళు ఆ ఘోస్ట్ షిప్ నుంచి బయట పడతారా ? ఆ దెయ్యాలకు బలవుతారా అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : మనుషుల్ని మాయం చేసే మిస్డ్ కాల్… హర్రర్ మూవీ లవర్స్ ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

OTT Movie : చంద్రుడు అమాంతం భూమిపై పడిపోతే… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా… మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ

OTT Movie : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

OTT Movie : నగరాన్ని తుడిచిపెట్టే డేంజర్ డిసీజ్… మనుషులను ఆయిల్ లో వేయించి తోలు ఒలిచే సైకోలు… బ్రూటల్ సీన్లు భయ్యా

Big Stories

×