Gundeninda GudiGantalu Today episode October 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడినందుకు శృతి వాళ్ళ అమ్మని కొట్టాలని అంత కోపం ఉందంటూ బాలు రాజేష్తో అంటాడు.. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను రా ఖచ్చితంగా మందు తాగాల్సిందే అని ఇద్దరు కలిసి మందు తాగుతారు. అక్కడ ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే ఎవరు ఏమి అనలేదు. మా నాన్నని అనే లోపల నేను అస్సలు ఊరుకోలేకపోయాను. కోపంతో అన్నాను సరే నన్ను అందరూ అర్థం చేసుకోకుండా అంటారేంటి అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లందరూ అన్నందుకు నాకు బాధ లేదురా మా నాన్న నన్ను అర్థం చేసుకోకుండా కొట్టినందుకు నాకు బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని బాలు మందు తాగుతాడు. మందు తాగేసి ఇంటికి వచ్చాడు. బాలును చూసిన సత్యం తాగొచ్చావా అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు పడిపోతూ ఉంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు. ఏంట్రా తాగొచ్చావా అని అంటాడు. నేను బాధతోనే తాగానని చెప్పు మీనా.. కావాలని తాగలేదు అని బాలు మీనాతో అంటాడు. ఎందుకురా ఇలా చిన్న విషయాలని పట్టించుకోని నీలో నువ్వే మదన పడిపోతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని సత్యం అంటాడు. అప్పుడే వీళ్లిద్దరి మాటలు విన్న ఇంట్లోని వాళ్ళందరూ కిందకి వస్తారు. మళ్లీ బాలు తాగొచ్చాడు అని అనగానే మీనా పెద్ద క్లాస్ పీకుతుంది. ప్రభావతి సార్ గుర్రం ఎక్కి వచ్చాడు. ఏంటి ఈ మధ్య లేదు అనుకున్నాను. కానీ మళ్లీ ఎక్కాడే అని వెటకారంగా మాట్లాడుతుంది.
మనోజ్ నేను బాగా అలసిపోయాను.. పడుకోనివ్వాడ ఏంటి తాగొచ్చి గోల అంటాడు.. శృతి రవీతో మీ అన్నయ్య తాగేసి వచ్చాడు అంటుంది.. ఒక పెద్ద మనిషిని అవమానించాడు అని ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే మీనా రెచ్చిపోతుంది. మా ఆయనను అంటే ఊరుకోను అని మీనా అంటుంది. రోహిణి మీ ఆయన ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటావా..? మీ ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే నువ్వు ఊరుకుంటావా అని మీనా అడుగుతుంది. నేను అసలు ఊరుకోను అని శృతి అంటుంది. మా ఆయన అన్న కూడా నేను అస్సలు ఊరుకోను. మీ ఆయన గురించి ఎవరైనా ఏమైనా అంటే ముందు మీరు రియాక్ట్ అవ్వాలి. బయట వాళ్ళు ఎవరో వచ్చి న్యాయాన్ని అవమానిస్తుంటే ముందు నువ్వు మాట్లాడాలి అని మీనా ప్రభావతికి షాక్ ఇస్తుంది.
మీ ఆయన గురించి నువ్వు తప్పుగా అనుకోకూడదు.. మా మావయ్య గారిని అంటే మాకే కోపం వచ్చింది.. వాళ్ల నాన్నని అనడంతో ఆయన అన్నాడు. ఇందులో తప్పేముంది మా ఆయన అంటే నేను అసలు ఊరుకోను అని అందరికీ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది మీనా. అయితే బాలుని తీసుకొని మీనా అక్కడికి వెళ్తుంది. సత్యం నీకు మాట్లాడే అర్హత లేదు వెళ్ళు అని ప్రభావతిని అంటుంది. బాలు మీనా పైకి వెళ్ళగానే బాలు బాధపడుతూ ఉంటాడు. నన్ను మా నాన్న కొట్టాడు అందుకే తాగొచ్చాను అని అంటాడు. మీ నాన్న కొట్టాడు అని ఈరోజు తాగొచ్చారు ఇంతకుముందు ఏం జరిగింది? ఎందుకు తాగారు అని మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే బాలు బాధపడుతూ ఉండటం చూసి మీనా తనని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది..
ఉదయం లేవగానే బాలు పూజ చేస్తూ ఉంటాడు. అది చూసినా శృతి షాక్ అవుతుంది. మీనా కూడా షాక్ అవుతుంది. మనోజు నిద్రలేచి వచ్చి ఏంటమ్మా రాత్రి పడుకొని ఇవ్వవు ఇప్పుడు పొద్దున్నే గంట కొడుతూ అందరిని నిద్ర లేపుతున్నావు అని అంటాడు. నిద్ర మొహమోడా గంట కొట్టేది నేను కాదురా అటు చూడరా అని ప్రభావతి మనోజ్ ని తిడుతుంది. బాలుని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బాలు పూజ చేస్తూ హారతి కొనరా అంటూ అదే మాట అనడంతో ప్రభావతి అమ్మే వాళ్ళగా కొనరా కొనర ఏంట్రా అని అడుగుతుంది. బాలు పూజని చూసి కాస్త నవ్వుకున్న కూడా బాలు చెప్పిన మాటతో అందరూ ప్రశాంతంగా ఉంటారు.
ఇంత మార్పు ఏంట్రా పొద్దున్నే లేచి ఈ పూజ ఏంటి రా అని సత్యం అడుగుతాడు.. మిమ్మల్ని బాధ పెట్టాను నాన్న ఇకమీదట నుంచి నేను ఇలానే ఉంటాను నన్ను క్షమించండి నాన్నగారు అని మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. ఆ మాట వినగానే ఏంటి ఈ మార్పు ఏమైంది అని అందరూ ఆలోచనలో పడతారు. బాలు ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది అని అందరూ అనుకుంటారు. నాన్న రూమ్ కట్టాలని అనుకున్నాడు కదా ఆ రూమ్ కి డబ్బులు ఇవ్వాలని ఇలా చేస్తున్నాడేమో అని మనోజ్ అంటాడు.
Also Read : నోరు జారి బుక్కయిన ఆది..దీపిక పరువు అడ్డంగా పోయిందిగా..
ఏం మాట్లాడుతున్నావ్ మావయ్య మాకు రూమ్ కట్టించేదేంటి మా ఆయనే మాకు రూమ్ కట్టిస్తాడు. అప్పుడు బంగారం కొనిస్తాడు అంతవరకు వేసుకొని అని అన్నారు… ఇప్పుడు మళ్లీ రూమ్ కట్టిస్తాడు అని అంటున్నావు ఇవి తీరినట్టే అని ప్రభావతి పెట్టుకోరంగా మాట్లాడుతుంది. మీనా మాత్రం మా ఆయన రూమ్ కట్టిస్తాడు అని శబదం చేస్తుంది. మళ్లీ మంగం మా రెండో శబదం చేసిందని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. మీరు ఒక్కరే అయితే కష్టం.. నేను కూడా నా వంతు సాయం చేస్తానని సత్యం అంటాడు. కానీ మీనా మాత్రం మీరు అప్పులు చేసి బాధపడకండి మావయ్య మా ఆయనే కట్టిస్తాడు అని అంటుంది. మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సాఫ్ అని అంటుంది. బాలు మీనా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా అంటుంటే నాకు మాత్రం భయంగా ఉంది అని అంటాడు. ఇంకొక కారు కొని దాన్ని రెంటిగిద్దాం. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా అని మీనా అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ దారుణంగా మోసపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..