Rajasthan News: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ అడ్డంగా బుక్కయ్యారు. ఓ విద్యార్థిని మొబైల్ తనిఖీ చేశాడనే ఆరోపణలతో ఆయన్ని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థిని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని విమర్శలపై ఆధారంగా వేటు వేశారు. అసలు మేటరేంటి?
విద్యార్థిని ఫోన్ చెక్ చేసిన ప్రిన్సిపాల్
ఈ మధ్యకాలంలో స్కూళ్లకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావడం కామన్‌గా మారిపోయింది. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులు ఫోన్లను తమ బేగ్‌లో పెట్టకుని తీసుకెళ్తున్నారు. ఇందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. స్కూల్ కాగానే పేరెంట్స్ ఫోన్ చేస్తే విద్యార్థులను తీసుకుని వెళ్తారు. మరికొందరు బయటకు వెళ్తే.. తాము వచ్చేవరకు స్కూల్ వద్ద ఉండమని చెప్పిన సందర్భాలు లేకపోలేదు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని శ్రీ మహాత్మాగాంధీ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. ఓ విద్యార్థిని అందులో ఇంటర్ ఫస్టయిర్ చదువుతోంది. తన మొబైల్ ఫోన్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండడం గమనించాడు ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్. విద్యార్థిని నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు ప్రిన్సిపాల్. తీసుకున్న ఫోన్‌ను జాగ్రత్త చేయాల్సిందిపోయి, ఫోన్ లాక్ తీశారు.
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
గ్యాలరీ, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కాల్ వివరాలను తనిఖీ చేశారు. క్లాసులో యువతి పక్కన కూర్చొన్న అబ్బాయిని ప్రశ్నించినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రిన్సిపాల్ మొబైల్ తీసుకున్న వ్యవహారాన్ని విద్యార్థిని, తన తల్లిదండ్రులకు చెప్పింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాఠశాలకు చేరుకున్న విద్యార్థిని కుటుంబసభ్యులు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై ఆందోళనకు దిగారు.
ALSO READ: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. 21 మంది లొంగిబాటు
ఫోన్‌లో ఏవైనా వ్యక్తిగత వివరాలుంటే వాటిని ప్రిన్సిపాల్ దుర్వినియోగం చేసే అవకాశముందని ఆరోపించారు. అక్కడే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థిని, వారి తల్లిదండ్రులు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు, విచారణకు ఆదేశించారు. విచారణలో ప్రిన్సిపాల్ షకీల్ తన తప్పు అంగీకరించారు. ప్రిన్సిపాల్ కొత్త విషయం బయటపెట్టారు.
పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నందున ఆమె మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుందేమోనని భావించి, నిర్ధారించుకోవడానికి తాను ఫోన్‌ను తనిఖీ చేశానని నిజం అంగీకరించాడు. ప్రిన్సిపల్ చేసిన పని విద్యార్థిని గోప్యతకు భంగం కలిగించడమేనని నిర్ధారించారు ఉన్నతాధికారులు. వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.