Intinti Ramayanam Today Episode October 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కి టాబ్లెట్ ఇవ్వాల్సిన సంగతి పార్వతి మర్చిపోతుంది.. అవని అక్షయ్ రావడానికి లేట్ అవుతుంది కదా అని కమల్ ను పిలుస్తుంది. ఏదో పని ఉందని వాడు కూడా బయటికి వెళ్ళాడు. శ్రీకర్ శ్రియ మాత్రమే ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దర్నీ పిలుస్తా తెచ్చిస్తారు అని పార్వతి అంటుంది.. వాళ్ళిద్దర్నీ పిలవగానే మీ నాన్న వి టాబ్లెట్స్ అయిపోయాయి తీసుకుచ్చేస్తారా అని అడగగానే శ్రీకర్ నాకు ఒక ముఖ్యమైన పని ఉందమ్మా.. ఇంపార్టెంట్ క్లైంట్ వస్తున్నారు. ఆయనను కలిసేసి వచ్చేటప్పుడు తీసుకు రమ్మంటే తీసుకొస్తాను అని అంటాడు.. అది కాదురా అవి టైం కి వేసుకోవాలి అని అన్నా కూడా శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రియకు టాబ్లెట్ తీసుకు రమ్మని అడుగుతుంది పార్వతి.. శ్రియ నేను తీసుకురాను అని మొహం మీదే చెప్పేస్తుంది.. ఇవాళ టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్తారు. రేపు ఇంకొకటి తీసుకు రమ్మని చెప్తారు. మీకేం అలానే కూరగాయలు అని ఇంటి పనిమనిషి చేసేస్తారు అని శ్రీయ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ ఎలక్ట్రిషన్ జాబు లో జాయిన్ అవుతాడు.. మొదటి రోజు తను ఎలక్ట్రిషన్ గా పనిచేసేందుకు ఓ ఆర్డర్ వచ్చిందని ఓనర్ చెప్పగానే ఆ ఇంటికి వెళ్తాడు.. ఇది చక్రధర్ మామయ్య ఇల్లు కదా.. మనకు భయం ఎందుకు రాజు అలాగా వెళ్లి పని ఏంటో చూసుకొని వద్దామని వెళ్తాడు. రాజేశ్వరి అల్లుడు వచ్చాడు కదా అని సంతోష పడుతూ మర్యాదగా పలకరిస్తుంది. చక్రధర్ మాత్రం ఎందుకొచ్చావ్ ఏం పనితో వచ్చావు అని అడుగుతాడు. నేను ఎలక్ట్రిషన్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను. ఇంట్లో ఏదో పని ఉందంట కదా నాకు ఆ పని అప్పగించారు అందుకే నేను వచ్చాను ఏంటో చెప్పండి అని కమల్ అడుగుతాడు.. కమల్ని చక్రధర్ దారుణంగా అవమానిస్తాడు..
నేను అందరిలాగా మోసాలు చేయడం లేదు. కుట్రలు చేయడం లేదు కదా.. నేను ఎలక్ట్రిషన్ గా జాబ్ చేస్తున్నాను దాంట్లో తప్పేమీ లేదు కదా అని చక్రధర్ కు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్తాడు.. ఇక పార్వతీ రాజేంద్రప్రసాద్ ఇద్దరూ మాట్లాడుకుంటూ టాబ్లెట్స్ తీసుకుని వస్తారు. ఇంట్లో పరిస్థితిని చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉందండి. అవనీని ఎంతగా శ్రీయ పల్లవిలు అవమానిస్తున్నారు అర్థం కావడం లేదు. ఎక్కడికక్కడ అవనిని తప్పుగా చేసి చూపిస్తున్నారు. ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియడం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎదురుగా రాజేంద్రప్రసాద్ ఫ్రెండు కనిపించడంతో ఏంట్రా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు కార్లు ఏమైనాయి అని అడుగుతారు. సర్వీస్ కు ఇచ్చాం రా అని అబద్ధం చెప్తారు. వీడికి నిజం చెప్తే జాలిపడి ఏదో ఒకటి సాయం చేస్తానంటాడు అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. కమల్ తాను వచ్చిన పనిని పూర్తిచేసి చక్రధర్ దగ్గర డబ్బులు తీసుకొని వస్తారు. ఇంటికి సంతోషంగా వచ్చిన కమల్ తనకి జాబ్ వచ్చిందని అందరితో పంచుకుంటాడు. అందరిని పిలుస్తాడు. పల్లవి ఏమైంది ఎందుకందని పిలుస్తున్నావు ఉదయం నుంచి కనిపించలేదు అని అడుగుతుంది. నాకు జాబ్ వచ్చింది ఎలక్ట్రిషన్ గా అని అనగానే పల్లవి షాక్ అవుతుంది.
కమలు అందరిని పిలిచి స్వీట్లు ఇస్తారు.. ఏమైందిరా ఎందుకురా ఈ స్వీట్లు అనగానే పల్లవి వాళ్ళ అమ్మాయి స్వీట్లు ఇచ్చింది నాకు ఎలక్ట్రిషన్ గా జాబ్ వచ్చింది అని చెప్పగానే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. నా మొదటి సంపాదన 2000 అమ్మ ఇదిగో అని పార్వతికి ఇవ్వబోతుంటే పల్లవి ఆపండి చూసారా ఎంత పరువు తక్కువ పని చేస్తున్నాడు మీ అబ్బాయి అని పల్లవి అంటుంది. ఇందులో పరువు తక్కువ ఏముంది అని అవని అడుగుతుంది.. నా భర్త లాగా నీ భర్తని కూడా అలా జాబ్ చేయమని చెప్పొచ్చు కదా నువ్వు ఎందుకు 50 లక్షలు ఇచ్చి బిజినెస్ చేయమని చెప్పావు అని పల్లవి అంటుంది.
మా ఆయన కూడా ఇలాంటి ఏదో ఒక పని చేస్తానంటే నేను ఎంకరేజ్ చేస్తాను తప్ప నీలాగా ఇలా అనను అని అవని అంటుంది. అయినా మా ఆయన గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అని పల్లవి అవనితో అంటుంది. అయితే మీ ఆయన కాకముందు నాకు అతను మరిది నా భర్తకు తమ్ముడు.. అన్ని అనే హక్కులు నాకు ఉన్నాయని అవని అంటుంది. నేనేమీ తక్కువ పని చేయడం లేదు కదా కమల్ అంటాడు. శ్రీకర్ కూడా పరువు తక్కువ పని చేస్తున్నావని అనగానే శ్రీయ వత్తాసు పాడుతుంది..
ఇంట్లో అవని వదిన ఒక్కటే కష్టపడుతుంది. ఇంటి అడ్డు కట్టడానికి ఆమె ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. వదినకు సాయంగా ఉండాలని ఎవరు అనుకోలేదు. భార్య ఇంటి వద్ద కట్టడానికి డబ్బులు ఇవ్వకుండా టీవీ కొన్నది. అందుకే నేను వదినకి సాయంగా ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను అని కమల్ అంటాడు. కమల్ మాటకి అందరూ సంతోషపడతారు. పల్లవి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు బావ నీ చేత నేను బిజినెస్ చేయిస్తాను అని అంటుంది.
Also Read :తాగొచ్చిన బాలు.. ఒక్కొక్కరికి క్లాస్ పీకిన మీనా.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..
ఇక అక్షయ్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు అక్కడ జాబ్ రాలేదని ఫీలవుతూ ఉంటాడు. మీరేం ఫీల్ అవ్వకండి మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది కదా ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఏ వస్తుంది అని అంటుంది. ఆరాధ్య అమ్మాయి ఏది చెప్తే అది జరుగుతుంది నాన్న అని ధైర్యం చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..