Gundeninda Gudigantalu Satyam: తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ పేరు వినగానే జనాలకు టక్కున గుర్తుకు వచ్చే పేరు బాలు, సత్యం.. తండ్రి కొడుకుల ప్రేమ ఇలా ఉంటుందా అన్నది ఈ సీరియల్ ల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ టాప్ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా లో ప్రసారం అవుతుంది. మధ్య తరగతి కుటుంబంలో కొడుకుల జీవితం బాగుండాలి ఆమె తండ్రి పాత్రలో సత్యం నటించాడు. ఈ పాత్ర సీరియల్ కు హైలెట్. ఇందులో కన్నడ యాక్టర్ శ్రీకాంత్ నటించారు.. ఈయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ల లో గుండె నిండా గుడిగంటలు ఒకటి. ఇందులో తండ్రి పాత్రలో నటించిన సత్యం క్యారెక్టర్ హైలెట్ గానే నిలిచింది. తన కుటుంబాన్ని తన కొడుకులను దారిలో పెట్టాలని అనుకునే ఒక మధ్యతరగతి తండ్రి. ఆయన కొడుకులు కోసం పడే తపన జనాలను కట్టిపడేసింది. అలాంటి పాత్రలో నటించిన వ్యక్తి పేరు శ్రీకాంత్. ఈయన ఒక కన్నడ నటుడు. కన్నడ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్లలో నటించాడు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈయన రియల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. శ్రీకాంత్ కి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్ళిన ఫోటోలను ఆయన షేర్ చేసుకుంటుంటారు.. పెళ్లీడుకొచ్చిన కొడుకు కూతుర్లు ఉన్నారు.
Also Read : ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్.. కార్తీక దీపం పరిస్థితి దారుణం..?
వేరే ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులకు రెమ్యూ నరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమధ్య చాలామంది తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. అందులో కన్నడ యాక్టర్ శ్రీకాంత్ ఒకరు. ఈయన గతంలో తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించారు. రాధా కళ్యాణం, కావేరి, జానుగుడి వంటి ఎన్నో సీరియల్స్లలో నటించాడు. ఆ సీరియల్స్ అన్ని మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలా బుల్లితెర ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యారు శ్రీకాంత్. ఈయన తెలుగులో ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ లో నటించేందుకు ఒక్క రోజుకు 25 వేలు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నెలకు ఎటు లేదన్న కూడా లక్షల్లో ఆయనకు ఆదాయం వస్తుంది. ఇకపోతే తెలుగు తో పాటు కన్నడలో కూడా ఈయన సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈయన సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు అన్నమాట.. హీరో కన్నా ఎక్కువే..