BigTV English
Advertisement

Bigg Boss 9 : ట్విస్ట్లుతో రమ్య ఎలిమినేషన్, మరోసారి ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చి చెప్పేసింది. 

Bigg Boss 9 : ట్విస్ట్లుతో రమ్య ఎలిమినేషన్, మరోసారి ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చి చెప్పేసింది. 

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో 7 వారాలు కంప్లీట్ అయిపోయింది. శనివారం ఆదివారం జరిగే ఎపిసోడ్స్ లో నాగార్జున వస్తారు అనే విషయం తెలిసిందే. అయితే తనుజ సేవ్ అయిన తర్వాత కళ్యాణ్ ఒక మాట చెప్తాను అన్నాడు. అయితే వీరిద్దరిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి నాగార్జున మాట్లాడారు. తనుజ పడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ రోజుకు రెండు కాఫీలు తాగటం వలన ఇలా పడిపోయాను అని తనుజ చెప్పినప్పుడు నేను నార్మల్ అయ్యాను. నేను ఈ హౌస్ లో ఇద్దరికి మాత్రమే సారీ చెప్పాలి ఒకటి ఇమ్మానుయేల్ అన్నకు మరియు తనుజ కి అని కళ్యాణ్ చెప్పాడు.


గోల్డెన్ బజర్ ప్రక్రియ 

కెప్టెన్ ఇమ్మానుయేల్ గోల్డెన్ బజర్ కోసం నలుగురిని సెలెక్ట్ చేశారు.తనుజ, పవన్, రీతు చౌదరి, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురిని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచారు బిగ్ బాస్. గోల్డెన్ బజర్ మిస్ చేసుకున్న మాధురి ను కూడా కన్ఫ్యూషన్ రూమ్ కి ఇన్వైట్ చేశారు. ఈ నలుగురికి ఒక గేమ్ ను బిగ్ బాస్ ఏర్పాటు చేశారు.

ఈ గేమ్ కు కన్ఫ్యూషన్ రూమ్ లో దువ్వాడ మాధురి సంచలక్ గా వ్యవహరించారు. ఈ గేమ్ లో తనూజ గెలిచారు. గేమ్ సరిగ్గా ఆడలేదు అని పవన్ చెప్పినా కూడా బిగ్ బాస్ హౌస్ లో సంచాలకు డెసిషన్ ఫైనల్ అని మొహం మీద చెప్పేశారు నాగార్జున.


సంజన ఏమీ మాట్లాడకూడదు 

అయితే ఇన్విజిబుల్ అనే ఒక కోట్ హౌస్ లో పెట్టారు. అది వేసుకున్న వాళ్లు హౌస్ లో ఉన్నా కూడా లేనట్లే. వారం రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదు. అయితే ఈ కోట్ ఎవరికి ఇస్తావు అని బిగ్ బాస్ ఇమ్మానియేల్ ను అడిగారు. ఇమ్మానుయేల్ ఆ కోట్ సంజనాకు ఇచ్చాడు. మరో వారం రోజుల వరకు సంజన ఏమి మాట్లాడకూడదు

నామినేషన్స్ లో ఉన్నారు 

నామినేషన్స్ లో దివ్య, సంజన, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, రమ్య మోక్ష ఉన్న సంగతి తెలిసిందే వీళ్ళలో మొదట దివ్య సేఫ్ అయిపోయారు. మొత్తానికి కొన్ని గేమ్ లు టాస్కులు తర్వాత సంజన మరియు రమ్య మోక్ష మిగిలారు. మొత్తానికి హౌస్ నుంచి రమ్య మోక్షను ఎలిమినేట్ చేశారు.

రమ్య ఒపీనియన్ 

ఎలిమినేట్ అయిపోయిన రమ్య మాట్లాడుతూ నేను ముందే ఊహించాను సార్ ప్రతివారం ఎలిమినేషన్ లో ఉంటానని ఇంత త్వరగా వెళ్ళిపోతాను అని అనుకోలేదు అని చెప్పింది. అయితే ఈ రెండు వారాల జర్నీలో తాను ఉన్న హైలెట్స్ అన్ని కూడా కట్ చేసి బిగ్ బాస్ యాజమాన్యం ఏవీ రూపంలో చూపించారు.

వెళ్లిపోయే ముందు హౌస్ మేట్స్ పైన ఒపీనియన్ కనుక్కున్నారు. కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. మనకి మెచ్యూరిటీ లేదు. నిబ్బ నిబ్బీలా బిహేవ్ చేస్తాడు. కాలేజీలో నేను ఫస్ట్ టైం లవ్ లో పడినట్టు అలా బిహేవ్ చేస్తాడు. తను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటాడు కానీ తనకు అంత మాట్లాడటం కూడా తెలియదు.

దివ్య స్టార్టింగ్ నుంచి ఒక పర్సన్ తోనే ఉండేవాళ్ళు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆమె బిహేవర్ చాలా చేంజ్ వచ్చింది. ఊరికే ఆవిడకి కోపం వచ్చేస్తుంది. ఆవిడ అనవసరమైన ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తున్నారు అదొకటి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది.

తనుజ ఎక్కువగా మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. తనకు విషయం తెలియకపోయినా కూడా తెలుసు అనుకుని ఏదేదో ఫీల్ అయిపోతుంది.

గౌరవ రాక్షసుడు చెప్పిన మాట అసలు వినడు. ఏం చెప్పినా వినడు. మాట్లాడడానికి అసలు 5 సెకండ్లు కూడా గ్యాప్ ఇవ్వడు. తనకి ఇగో కూడా ఎక్కువ ఉంది.

పవన్ నేను స్టార్టింగ్ నుంచి చెబుతున్నాను ఈ గేమ్ నువ్వు ఆడు. ఎమోషనల్ గా ఎక్కువ వెళ్లిపోకు. హౌస్ లో ఉన్నప్పుడు అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఓవర్ హెల్ప్ చేస్తుంటాడు. వెళ్లిపోయే ముందు వాష్ రూమ్ డ్యూటీ రీతూకి ఇచ్చేసింది.

Also Read: Ramya Moksha: మాదే మిస్టేక్, నచ్చిన ఫుడ్ పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది రెండు వారాల్లో బయటకు తగిలేస్తారని

Related News

Ramya Moksha: మాదే మిస్టేక్, నచ్చిన ఫుడ్ పెడుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది రెండు వారాల్లో బయటకు తగిలేస్తారని

Bigg Boss 9 : ఏమి మేనేజ్మెంట్ సామీ, కంప్లీట్ సపోర్ట్ అంతా తనూజ కేనా?

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Big Stories

×